S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్‌ఎమ్‌టిసిలో అమ్మకానికి ప్రభుత్వ వాటా

వడోదర, డిసెంబర్ 3: ప్రభుత్వరంగ ట్రేడింగ్ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసిలో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 15 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) వేద్ ప్రకాశ్ శనివారం ఇక్కడ తెలిపారు. ‘సంస్థలో 15 శాతం ప్రభుత్వ వాటా అమ్మకానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల ఖజానాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆదాయం లభిస్తుందని భావిస్తున్నాం.’ అని పిటిఐతో వేద్ ప్రకాశ్ చెప్పారు. కాగా, 2013 జూన్‌లో ఎమ్‌ఎమ్‌టిసిలోని 9.33 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది. దీంతో 570 కోట్ల రూపాయల నిధులను అందుకుంది. ప్రస్తుతం సంస్థలో ఇంకా ప్రభుత్వానికి 89.93 శాతం వాటా ఉంది.

నిస్సాన్ మోటార్ జిటి-ఆర్‌

జపాన్ ఆటోరంగ సంస్థ నిస్సాన్ మోటార్.. భారతీయ మార్కెట్‌కు తమ ప్రతిష్ఠాత్మక కారు జిటి-ఆర్‌ను పరిచయం చేసింది. ముంబయలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం
ఈ సూపర్ కార్‌తో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 1.99 కోట్ల రూపాయలు. జపాన్‌లోని తొచిగిలోగల నిస్సాన్ ప్లాంట్‌లో
జిటి-ఆర్ తయారవుతోంది

బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే బ్లాక్‌మనీ.. వైట్‌మనీ అవ్వదు

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే అక్రమ సంపద.. సక్రమ సంపదైపోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న నల్లధనానికి పన్ను చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘కేవలం బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా పన్ను చెల్లించకుండా తప్పించుకోవచ్చని అనుకోవద్దు.’ అన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో పెరుగుతున్న డిపాజిట్లపై అడిగిన ప్రశ్నకు జైట్లీ పైవిధంగా బదులిచ్చారు. ఇన్నాళ్లూ పన్నులు చెల్లించకుండా పోగేసిన అక్రమ సంపదను ఇప్పుడు బ్యాంకుల్లో జమచేసి సక్రమ సంపదగా మార్చుకుందామనుకుంటే అది పొరబాటేనని తేల్చిచెప్పారు.

ఆనంద గీతం

ఉన్నట్టుండి రవీందర్ ఫోన్ చేసినడు. ‘ఏమిటి సంగతి?’ అంటే అతను ‘పాప ఏడ్చింది’ అనేవాడా లేదా నాకు తెలియదు. గ్రైప్ వాటర్ ప్రకటనల గురించి తెలియని, తెలీని, తెలువని వారికి క్షమాపణలు. ‘ఏం సంగతులు?’ అన్నట్టున్న. ‘ఏం లేదు. ఊరికెనే గుర్తుకు వచ్చినవు’ అన్నడు. ఈ లోకంలో ఊరికెనే మనలను గుర్తుచేసుకుని, పలకరించే వాండ్లు గూడ ఉన్నరు గదా, అని సంతోషమయింది. ఆ సంగతే చెప్పిన. అతను నిజంగనే ఊరికే ఫోన్ చేసినడు. కాల్ ముగించే ముందు, ‘ఫెలిసిటా’ అని ఒక పాట ఉన్నది. ఇంటర్నెట్ గనక ఉంటే విను. దాని గురించి మళ్లెప్పుడన్న మాట్లాడుకుందము అన్నడు.

కె.బి. గోపాలం

ఇక నాణ్యమైన చేపల ఉత్పత్తి!

భీమవరం, డిసెంబర్ 3: అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ నాణ్యత లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ ఆక్వా ఉత్పత్తులను సంస్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతు న్నాయ. ఇప్పటికే యాంటీ బయోటిక్స్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించగా, తాజాగా పౌల్ట్రీ, కబేళా వ్యర్థాలను ఆక్వాసాగులో వినియోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందుకు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో పనిచేసేలా మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మనలో మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి)

పి.వి.శివప్రసాదరావు, అద్దంకి, ప్రకాశం జిల్లా
ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు పెద్ద మనుషులకు ముందే తెలుసని ప్రతిపక్షాల ఆరోపణ.
తమకు ముందే తెలియకపోయిందే అని అక్కసు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
డొనాల్డ్ ట్రంప్‌ను మెజారిటీతో గెలిపించి ఆయన మాకొద్దని గొడవ చేయడమెందుకో?
గెలిపించిన వారు వేరు. గొడవ చేసేవారు వేరు...

రెండు వేల రూపాయల నోటు నీళ్లల్లో తడిపితే రంగుపోయి వెలిసిపోతే అది మంచినోటట. వెలవకుండా అలాగే ఫ్రెష్‌గా ఉంటే అది నకిలీదట. ఇదేమిటండి? రంగుపోతే చెల్లుతుందా?
అది పోయే రంగు కాదు.

ఫార్మాసిటీ ఏర్పాటుకు టిఎస్‌ఐఐసి కసరత్తు

హైదరాబాద్, డిసెంబర్ 3: ఫార్మాసిటీ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) కసరత్తు చేస్తోంది. దీనికి మొత్తం 12,500 ఎకరాలు అవసరమని, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించి అమలు చేస్తోందని టిఎస్‌ఐఐసి చైర్మన్ జి బాలమల్లు తెలిపారు. శనివారం ఆయన టిఎస్‌ఐఐసి అధికారులతో కలిసి ఫార్మాసిటీ ప్రాంతాన్ని సందర్శించారు. హైదరాబాద్ శివారు కందకూరు మండలంలోని మీర్కచన్ పేట్, పంజగుట్ట, ముచ్చెర్ల గ్రామాలు, కడ్తాల్ మండలంలోని మిడ్విన్ తదితర గ్రామాల్లో భూమి సేకరణ ఉంటుందన్నారు.

నష్టాల నుంచి తేరుకున్న జిఎస్‌పిసి

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్ప్ (జిఎస్‌పిసి) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్- సెప్టెంబర్)లో 374.03 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధంలో ఇది 369.55 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చమురు అనే్వషణ వ్యయం తదితరాల రద్దు నేపథ్యంలో నష్టాలపాలైంది. ఇదిలావుంటే గ్యాస్ ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టినట్లు సంస్థ తెలిపింది. పోయినసారి 5,181.67 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకున్న సంస్థ.. ఈసారి 4,395.32 కోట్ల రూపాయల ఆదాయాన్ని మాత్రమే పొందింది. ఈ మేరకు ఓ ప్రకటనలో జిఎస్‌పిసి తెలియజేసింది.

గెలుపు దైవాధీనం కాదు.. ప్రజాధీనం!

‘నన్ను అన్యాయం చేశావు కదూ? పైన దేవుడున్నాడు.. అన్నీ చూస్తుంటాడు’- స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎవరైనా మోసం చేస్తే వెంటనే బాధిత బాలుడి నుంచి వచ్చే మాట ఇది! అప్పుడు లోకజ్ఞానం లేక, అమాయకంగా బతికే చిన్నతనపు ఊహల్లో చెప్పే మాటలవి. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా దాదాపు ఊహతెలియని పిల్లాడి మాటల మాదిరిగానే కనిపిస్తున్నాయి. ‘దేవుడు కరుణిస్తే వచ్చే ఏడాది మనం అధికారంలోకి వస్తాం. లేకపోతే రెండేళ్లు ఓపికపడతే రాజన్న పాలన వస్తుంద’ని ఆయన తాజాగా సెలవిచ్చారు. జగన్ ఇప్పుడే కాదు. ఇప్పటికి అనేక డజన్లసార్లు ‘పైన దేవుడున్నాడు.. అన్నీ చూస్తున్నాడ’ని అన్నారు. రాజకీయం కూడా ఆట లాంటిదే.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144

‘నలుపు’ వాన !

పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించగానే తెలంగాణ సిఎం కెసిఆర్ రాష్ట్రానికి తగ్గే ఆదాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై బిజెపి నేత కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ‘ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం నల్లధనంతోనే నడిచిందా?’ అని ప్రశ్నించారు. దీనికి కెసిఆర్ ఇచ్చిన సమాధానంతో బిజెపి నాయకులు అవాక్కయ్యారు. ‘తెలంగాణ ప్రభుత్వమే కాదు, మోదీ ప్రభుత్వం కూడా ఇన్నాళ్లూ నల్లధనంతోనే నడిచింది, మా రాష్ట్రం మినహాయింపుఏమీ కాదు, దేశం మొత్తం నల్లధనంతోనే నడిచింది’ అంటూ కెసిఆర్ చెప్పుకొచ్చారు.

Pages