S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ చేతిలో నేపాల్ చిత్తు

బ్యాంకాక్, డిసెంబర్ 2: మహిళల ఆసియా కప్ టి-20 టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొన్న నేపాల్ చిత్తుచిత్తుగా ఓడింది. మహిళల క్రికెట్ టి-20 ఫార్మెట్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసి పరువు పోగొట్టుకుంది. 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆ జట్టు 16.3 ఓవర్లు ఆడి, కేవలం 21 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 120 పరుగులు సాధించింది. శిఖా పాండే అజేయంగా 39 పరుగులు చేయగా, నేపాల్ బౌలర్ రుబినా చెత్రి 21 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ ఏ దశలోనూ భారత్‌ను ప్రతిఘటించలేకపోయింది.

పార్లమెంటుకు క్రికెటర్ల క్యూ!

పార్లమెంటు భవనానికి భారత క్రికెటర్లు క్యూ కడుతున్నారు. మొన్న ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పార్లమెంటు హౌస్‌కు వెళ్లి, తన వివాహానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాడు. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ కూడా ప్రధానికి పెళ్లి పత్రిక అందించేందుకు వచ్చాడు. బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమతో అతని వివాహం ఈనెల 9న జరగనుంది.

చిత్రం.. పార్లమెంటు భవనం ముందు భారత క్రికెటర్ ఇశాంత్ శర్మ

సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండవ యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం

హైదరాబాద్, డిసెంబర్ 2: ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోగల రెండవ యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రక్రియ విజయవంతమైనట్లు సింగరేణి ఎండి ఎన్ శ్రీ్ధర్ శుక్రవారం ప్రకటించారు. ఈ ప్లాంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ధరకే 1,200 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తామన్నారు. ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి ఇప్పటివరకు 1,262 ఎంయు విద్యుత్‌ను గజ్వేల్‌లోని తెలంగాణ పవర్ గ్రిడ్‌కు సరఫరా చేశారు.

బివిఆర్ మోహన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక బిజినెస్ లీడర్ అవార్డు

హైదరాబాద్, డిసెంబర్ 2: ఐటి రంగానికి విశిష్ట సేవలు అందించిన సియాంట్ వ్యవస్థాపకుడు, నాస్కాం పూర్వ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన పయోనీరింగ్ బిజినెస్ లీడర్ అవార్డు లభించింది. ఢిల్లీలో శుక్రవారం ఆరవ నేషనల్ బిపిఎం షేర్డ్ సర్వీసెస్ సదస్సులో ఈ అవార్డును బివిఆర్ మోహన్ రెడ్డికి ప్రదానం చేశారు. ఈ అవార్డును స్వీకరించిన సందర్భంగా బివిఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఐటి రంగంలో ఉన్నానని, ఈ అవార్డు ద్వారా సియోంట్‌లో పనిచేస్తున్న 13 వేల మంది ఉద్యోగులను గుర్తించినట్లయిందన్నారు.

సెనె్సక్స్ 329 పాయంట్లు పతనం

ముంబయి, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితుల మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 329.26 పాయింట్లు క్షీణించి 26,230.66 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 106.10 పాయింట్లు పతనమై 8,086.80 వద్ద నిలిచింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఇటలీ రాజ్యాంగ రెఫరెండమ్‌పై మదుపరులు భయాలకు లోనవడంతో సూచీ లు నష్టాలకు గురయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ (ఎమ్‌ఎస్‌ఎస్), ప్రస్తుత జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాలు కూడా మదుపరుల పెట్టుబడులను దెబ్బతీశాయి.

ఎన్‌ఎస్‌ఇ చీఫ్ చిత్రా రామకృష్ణ రాజీనామా

ముంబయి, డిసెంబర్ 2: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) సిఇఒ, ఎండిగా శుక్రవారం చిత్రా రామకృష్ణ తప్పుకున్నారు. 2018 మార్చి వరకు ఆమె పదవీకాలం ఉన్నప్పటికీ, ఎన్‌ఎస్‌ఇ బోర్డులోని కొందరు సభ్యులతో నెలకొన్న విభేదాల మధ్య ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. 2013 ఏప్రిల్‌లో సిఇఒ, ఎండిగా చిత్రా రామకృష్ణ ఎంపికయ్యారు. మరోవైపు ఆమె స్థానంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ జె రవిచంద్రన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ఆర్థిక కార్యదర్శి అశోక్ చావ్లా నేతృత్వంలోని ఎన్‌ఎస్‌ఇ బోర్డు కొత్త చీఫ్‌ను ప్రకటించేదాకా రవిచంద్రన్ బాధ్యతలు కొనసాగుతాయి. కాగా, 1992లో ఎన్‌ఎస్‌ఇ ఏర్పాటుకు చిత్రా రామకృష్ణ విశేషంగా కృషి చేశారు.

ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టం రూ. 18 వేల కోట్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రభుత్వరంగ బ్యాంకుల నష్టాలు గత ఆర్థిక సంవత్సరం (2015-16) 17,993 కోట్ల రూపాయలుగా ఉన్నాయని శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా సమర్పించిన వివరాల ప్రకారం 2015-16లో 28 ప్రభుత్వరంగ బ్యాంకులు 17,993 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. ఇందులో 14 బ్యాంకులు నష్టాలను నమోదు చేయగా, మిగతా 14 బ్యాంకుల లాభాలు తగ్గుముఖం పట్టాయి.

27 మంది ప్రభుత్వ బ్యాంకర్లు సస్పెన్షన్

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన బ్యాంక్ అధికారులపై కేంద్రం కొరడా ఝుళిపించింది. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 27 మంది సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది. మరో ఆరుగురిని బదిలీ చేసింది. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ వీరంతా నల్లధనం మార్పిడికి పాల్పడుతున్నట్లు ఐటి శాఖ దాడుల్లో గుర్తించిన సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే.

గియానీ ఆసీస్ పర్యటన వాయిదా

సిడ్నీ, డిసెంబర్ 2: కొలంబియా విమాన ప్రమాదంలో మృతి చెందిన బ్రెజిల్ సాకర్ క్రీడాకారుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వీలుగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో తన ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకున్నాడు. సోమవారం ఉదయం జరిగే మహిళల అండర్-20 ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను తిలకించేందుకు అతను రావాల్సి ఉండింది. అయితే, ఇటీవల కొలంబియా విమాన ప్రమాదంలో మరణించిన 19 మంది క్రీడాకారుల మృతితో దిగ్భ్రాంతికి గురైన అతను పలు పర్యటనలను మానుకున్నాడు. వాటిలో భాగంగానే ఆస్ట్రేలియా టూర్‌ను కూడా వాయిదా వేసుకున్నాడు.

‘నగదు పోయనా.. విలువ తెలిసింది!’

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: తన సంపదలో 99 శాతం కోల్పోయిన బిలియనీర్ ఎవరూ కూడా సంతోషంగా ఉండరు. కానీ సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసయోషి సన్ మాత్రం ఇందుకు భిన్నం. అవును.. తన సంపద క్షీణతతో తాను పనిలో ఉన్న ఆనందం, ధనం విలువను తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. శుక్రవారం ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన తన అంతరంగాన్ని ఆహుతులతో పంచుకున్నారు. 2000వ సంవత్సరంలో చోటుచేసుకున్న టెక్నాలజీ సంక్షోభంలో సాఫ్ట్‌బ్యాంక్ సంపద 200 బిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇదిలావుంటే భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సాఫ్ట్‌బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు.

Pages