S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30నాటికి మెరుగు

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశ వ్యాప్తంగా శుక్రవారం కూడా అన్ని బ్యాంకులు, ఎటిఎమ్‌లలో నగదు కటకట కొనసాగిన నేపథ్యంలో ఈ నెలాఖరు వరకూ దాదాపుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అప్పట్లోగా పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. డిసెంబర్ 30నాటికి దేశంలో కరెన్సీ కొరత గణనీయంగా తీరుతుందని చెప్పారు. అయితే, 500, 1000 నోట్ల రద్దుకు ముందు దేశంలో వీటి పరిమాణం ఎంత ఉండేదో అంతా ఇక నుంచి ఉండక పోవచ్చునని పేర్కొన్నారు. అంటే ఒకప్పుడు ఉన్నంత పరిమాణంలో కాగితం కరెన్సీ ఇక మీద ఉండదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని తెలిపారు.

రూ.31లక్షల కొత్త నోట్లు సీజ్

విజయవాడ (క్రైం), డిసెంబర్ 2: నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠా ఒకటి టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడింది. వీరి నుంచి సుమారు రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్, సిఐ సురేష్‌రెడ్డి బృందం శుక్రవారం ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద దాడు లు నిర్వహించారు. అనుమానాస్పదం గా సంచరిస్తున్న గుంటూరు జిల్లా తుళ్ళూరుకు చెందిన జి వంశీకృష్ణ, పొన్నూరుకు చెందిన ఎం నాగ వెంకట సునీల్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండువేల రూపాయలు కొత్త నోట్లతో ఉన్న 31లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లక్షా 20వేలు పాత నోట్లు ఇస్తే..

చిత్తూరు జిల్లాకూ కృష్ణా జలాలు

అనంతపురం, డిసెంబర్ 2: దుర్భిక్ష పరిస్థితుల్ని అధిగమించి రైతులు, ప్రజలను ఆదుకోవడానికే రాష్ట్రంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాలను కరువు ప్రాంతాలకు తరలించామన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు హంద్రీ నీవా నీటిని శుక్రవారం ముఖ్యమంత్రి విడుదల చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ గొల్లపల్లి రిజర్వాయర్‌కు నందమూరి తారక రామారావు రిజర్వాయర్‌గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు.

హిందువులకు ‘దివ్య దర్శనం’

అమరావతి, డిసెంబర్ 2: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కల్పించనుంది. ఎప్పుడూ తీర్థయాత్రలు చేయని నిరుపేద హిందువుల కోసం ‘దివ్యదర్శనం’ అనే కార్యక్రమాన్ని జనవరి 2 నుంచి అమలు చేయనుంది. ఇప్పటివరకు మక్కా వెళ్లేందుకు ముస్లింలకు, జెరూసలెం వెళ్లేందుకు క్రైస్తవులకు ప్రభుత్వం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. దివ్యదర్శనం కార్యక్రమంతో బడుగు, బలహీన వర్గాలకు తీర్థయాత్రల భాగ్యాన్ని కలిగిస్తోంది.

డబ్బొచ్చింది!

అమరావతి, డిసెంబర్ 2:బ్యాంకుల్లో, ఏటిఎంలలో నగదు లేక అల్లాడుతున్న ప్రజలకు ఓ శుభవార్త. రాష్ట్రానికి ఆర్‌బిఐ 2,420 కోట్ల రూపాయల నగదును అందించింది. ఆర్‌బిఐ ఇలా విడుదల చేసిందే తడవు రాష్ట్ర ప్రభుత్వం ఆ నగదును యుద్ధప్రాతిపదికన విమానాల్లో వివిధ ప్రాంతాలకు తరలించి, తక్షణమే ఆ నగదు బ్యాంకుల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం విశేషం.

ఇంకెన్నాళ్లు.. కరెన్సీ కష్టాలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను తొలగించడానికి తీసుకొంటున్న చర్యలేమిటో తక్షణం తెలియజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని ఆదేశించింది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా సహకార బ్యాంకులపై ఆధారపడి ఉంటారని, అందువల్ల సహకార బ్యాంకులకు ఎక్కువ సొమ్ము పంపి వారి కష్టాలను తగ్గించాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ సూచించింది.

జాతీయగీతం... అసలు లొసుగు చట్టంలో!

న్యాయప్రవీణులు నిప్పులు కక్కుతున్నారు. ట్విట్టర్ మాలోకం మండిపడుతున్నది. ఎకసెక్కాలు ఆడీ ఆడీ సోషల్ మీడియాకు శోష వచ్చేస్తున్నది. పత్రికలు చదివే, చానెళ్లు చూసే, ట్వీటే, బ్లాగే ప్రతివాడి దృష్టిలో ఇవాళ జస్టిస్ దీపక్ మిశ్రా పాపాల భైరవుడు.
ఇంతకీ ఆయన చేసిన మహాపరాధమేమిటి? దేశంలోని సినిమా హాళ్లలో ప్రతి షో మొదలెట్టే ముందూ జాతీయ పతాకం చూపించి, జాతీయగీతం వినిపించమన్నాడు. ఆ సమయంలో అక్కడ వున్న వాళ్లందరూ గౌరవ సూచకంగా నిలబడాలన్నాడు. డిస్టర్బెన్సు లేకుండా ఆ కాసేపూ తలుపులు మూసి పెట్టాలన్నాడు.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ

బలగం తక్కువైనా సామర్థ్యం ఎక్కువే!

కొచ్చి, డిసెంబర్ 2: నౌకాదళంలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేనని, అయితే సామర్థ్యంపై దాని ప్రభావం ఎంతమాత్రం లేదని సదరన్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ ఎ.ఆర్.కావే స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నావికా దళాలు సన్నద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో నావికా దళాల్లో సిబ్బంది కొరతను తీర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నియామకాలతో పాటు వివిధ శిక్షణా సంస్థలనుండి సిబ్బందిని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కావే తెలిపారు.

జాతీయ గీతాన్ని కోర్టుల్లో ఆలపించాలి

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో విచారణలు మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించేలా ఆదేశివ్వాలని కోరుతూ బిజెపి అధికార ప్రతినిధి, న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించాలని ఇటీవల తీర్పు చెప్పిన న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అమితవ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకే ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అభిప్రాయాన్ని తెలుసుకున్న తరువాత ఈ పిటిషన్‌ను విచారించడానికి మొగ్గు చూపడం లేదని ధర్మాసనం ప్రకటించింది.

ఓటింగ్ జరగాల్సిందే

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఓటింగ్‌తో కూడిన చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన నినాదాలతో శుక్రవారం లోక్‌సభ దద్దరిల్లిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని దుర్వినియోగం చేస్తోందటూ ప్రతిపక్షాలు ఈరోజు లోక్‌సభను స్తంభింపజేశారు.

Pages