S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిపాజిట్లపై ఉచిత టాక్‌టైమ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించిన దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ నూతన సేవింగ్స్ ఖాతాదారులకు టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు డిపాజిట్ చేసే ప్రతి రూపాయికి ఒక నిమిషం టాక్‌టైమ్ (తమ నెట్‌వర్క్ పరిధిలోనే)ను ఇస్తోంది. ఈ అవకాశం తొలిసారి డిపాజిట్లకే ఉంటుం ది. ‘ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాను తెరిచిన ఏ కస్టమర్‌కైనా తాను డిపాజిట్ చేసే మొత్తం లో ప్రతి రూపాయికి ఒక నిమిషం చొప్పున టాక్‌టైమ్ పొందుతారు. ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్లకు మాత్ర మే ఈ టాక్‌టైమ్ వర్తిస్తుంది.’ అని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ తెలిపింది.

యోగా కోచ్ ఆంజనేయశర్మకు సత్కారం

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 2: దక్షిణ మండల రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హ్యాపీ వాకర్స్, మార్నింగ్ స్టార్ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో స్థానిక రైల్వే స్టేడియంలో నెలరోజులపాటు జరిగిన యోగా శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ శిక్షణా తరగతుల్లో సుమారు 50 మంది సభ్యులు పాల్గొన్నారు.

పల్టీకొట్టిన ఇన్నోవా

జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 2: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతం అయిన గరికపాడు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా, మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. హైదరాబాద్ కుకట్‌పల్లికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని ఒక ఆశ్రమంకు వెల్తున్నారు. తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్రా సరిహద్దు గరికపాడుకు ఇన్నోవా వాహనం ప్రవేసించి ఆతి వేగానికి అదుపు తప్పి రోడ్డు ఎడమ వైపు ఉన్న డివైడర్‌ను డీకొట్టి అక్కడినుండి 3 పల్టీలు కొట్టుకొంటూ కొంతదూరం వెళ్లి సెంటర్ డివైడర్‌కు తల్లకిందులుగా బొల్తా పడింది.

ఏడాదిలో జగన్ జైలుకెళ్లడం ఖాయం

మచిలీపట్నం, డిసెంబర్ 2: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారం కోసం పగటి కలలు కంటున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఎద్దేవా చేశారు. దేవుడు దయదలిస్తే యేడాదిలో తమ ప్రభుత్వం వస్తుందని జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అర్జునుడు మాట్లాడుతూ దేవుడు దయతలిస్తే యేడాదిలో జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ మీద తిరుగుతున్న జగన్ త్వరలోనే జైలుకు వెళతారని, ఇది తెలియక అధికారం కోసం పగటి కలలు కంటున్నారని విమర్శించారు.

‘రియల్’ ఢమాల్..!

మచిలీపట్నం, డిసెంబర్ 2: పెద్దనోట్ల దెబ్బకు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన ఈ రంగం నేడు బోసిపోయింది. గత పదేళ్ళ క్రితం సమాజంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సమస్యను సైతం అధిగమించిన రియల్ ఎస్టేట్ రంగం పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో మళ్ళీ ఆ సమస్యను తెచ్చి పెట్టింది. ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న ఏజెన్సీలు, బ్రోకర్లు నేడు బజారున పడ్డారు. భూములు, భవంతుల క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోవటంతో ప్రభుత్వ ఆదాయానికి సైతం భారీగా గండి పడుతోంది. ప్రధానంగా నల్లధనంతో సాగే ఈ రంగం నేడు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది.

భద్రిరాజుపాలెం పిఎసిఎస్‌లో అవినీతిపై విచారణ జరపాలి

తోట్లవల్లూరు, డిసెంబర్ 2: భద్రిరాజుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఎసిఎస్)లో వేలాది రూపాయల అక్రమాలు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాలని ముగ్గురు డైరెక్టర్లు, రైతుమిత్ర గ్రూపు సభ్యులు డిమాండ్ చేశారు. ఇటీవల సహకార అధికారి వచ్చినా సరైన విచారణ జరగలేదన్నారు. భద్రిరాజుపాలెం కమ్యూనిటీహాలు వద్ద శుక్రవారం రాత్రి పిఎసిఎస్ డైరెక్టర్లు పుచ్చకాయల సీతారావమ్మ, జొన్నల సుబ్బారెడ్డి, వల్లూరు పోతురాజు, రైతుమిత్ర గ్రూపు సభ్యులు పుచ్చకాయల శ్రీలక్ష్మీ, తియ్యగూర శివపార్వతి, ఆళ్ళ మల్లీశ్వరి, ఆళ్ళపార్వతి, మండేపూడి ప్రసాదరెడ్డి, మండేపూడి శ్రీనివాసరెడ్డి పలువురు రైతులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.

రూ.200లకే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు

అవనిగడ్డ, డిసెంబర్ 2: త్వరలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలకు కేవలం రూ.200లకే స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అధికారుల సమన్వయ లోపం కారణంగా అభివృద్ధిలో అవనిగడ్డ నియోజకవర్గం వెనుకబడుతోందన్నారు. జనరిక్ మందుల దుకాణాలను ఎందుకు మూయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రచార లోపం కారణంగా మూతబడే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘనంగా జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం

మైలవరం, డిసెంబర్ 2: జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె ప్రమీల మాట్లాడుతూ ప్లాస్టిక్ పెన్నులు, కవర్లు వాడకం వల్ల పర్యావరణానికి పెను ప్రమాదం వస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి చిన్నపనికీ వాహనాల వాడకం వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు. కాలుష్య నివారణకు చెట్ల పెంపకం మేలన్నారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరిచేత పతిజ్ఞ చేయించారు.

అక్రమ కేసుకు నిరసనగా విధులు బహిష్కరించిన వైద్యులు

కూచిపూడి, డిసెంబర్ 2: మొవ్వ పిహెచ్‌సి ఎఎన్‌ఎం అక్రమ కేసుకు నిరసనగా శుక్రవారం వైద్యులు డా. శొంఠి శివరామకృష్ణ, డా. భగవాన్, సిబ్బంది సాయంత్రం నుండి విధులను బహిష్కరించారు. మొవ్వ సబ్ సెంటర్ ఎఎన్‌ఎం ఎ రత్నకుమారిని వేరే పిహెచ్‌సికి బదిలీ చేయాలని లేదా తమను ఇతర ప్రాంతానికి బదిలీ చేయాలన్న విన్నపాన్ని పరిష్కరించాల్సిందిగా డియంహెచ్‌ఓ డా. ఆర్ నాగమల్లేశ్వరికి విజ్ఞప్తి చేసేందుకు శుక్రవారం సాయంత్రం మూకుమ్మడిగా విజయవాడ తరలి వెళ్లారు.
రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు మొవ్వ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు

గ్యాస్ పైప్‌లైన్ సంరక్షణ అందరి కర్తవ్యం

విజయవాడ, డిసెంబర్ 2: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) ఎల్‌పిజి పైపులైన్ సంరక్షణ అందరి కర్తవ్యం, బాధ్యత అని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. భవానీపురం హరితాబెరం పార్కులో శుక్రవారం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్‌పిజి గ్యాస్ పైప్‌లైన్ భద్రత, సంరక్షణపై జిల్లా అధికారులకు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు సుమారు 589 కిలోమీటర్లు ఎల్‌ఫిజి పైప్‌లైన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ పైప్‌లైన్ దేశం సంవృద్ధి మరియు అభివృద్ధికి చేయూతనిస్తుందని, దీని ద్వారా వంటగ్యాస్ సప్లై చేయటం జరుగుతుందన్నారు.

Pages