S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పన్ను.. 50 శాతం!

నల్లధన కుబేరులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. నిర్దేశిత పరిమాణానికి మించిన రీతిలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమయ్యే మొత్తానికి లెక్కలు చూపించలేని పక్షంలో కనీస పక్షంగా 50 శాతం పన్ను చెల్లిస్తే చాలన్న ప్రకటన చేసింది. అయతే, బ్లాక్‌మనీని సంబంధిత ఖాతాదారు వినియోగానికి అందకుండా నాలుగేళ్ల పాటు తమ వద్దే ఉంచేసుకోవాలని సంకల్పించింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో సవరణలు తీసుకొచ్చి బిల్లును పార్లమెంట్‌లో త్వరలోనే ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.

బీసీలకు ఢోకా లేదు

విజయవాడ, నవంబర్ 25:‘కాపులకు బిసి రిజర్వేషన్ల వర్తింపుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నోమార్లు తమ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇవ్వడమేగాని అమలుకు నోచుకోలేదు. అయితే టిడిపి దీనికి కట్టుబడి ఉంద’ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యా, ఉపాధి రంగాల్లో కాపులు వెనుకబడి ఉన్నందునే రిజర్వేషన్లు కల్పించదలిచామనీ, దీనివల్ల బిసిల రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదంటూ హర్షధ్వానాల మధ్య భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బిసిలు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారని, మీరే పార్టీకి గుండెకాయ... ఊపిరి లాంటి వారన్నారు.

ఆర్‌బిఐ కౌంటర్లలో పాత నోట్ల మార్పిడి

న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశ వ్యాప్తంగా రద్దయిన 500, 1000 నోట్లను తమ కౌంటర్ల వద్ద మార్పిడి చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అన్ని బ్యాంకుల్లోనూ ఈ నోట్ల మార్పిడి ఇక ఉండదని, వాటిని ఆయా ఖాతాదారులు తమతమ ఖాతాల్లోనే జమజేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఒక్కో వ్యక్తి రెండు వేల చొప్పున ఈ నోట్లను కొత్త నోట్లతో మార్చుకోవచ్చునని.. ఇతర బ్యాంకుల్లో మార్పిడి అవకాశం లేదని ఆర్‌బిఐ వెల్లడించింది.

నేడే గూడెంలో అమిత్ షా రైతు సభ

ఏలూరు, నవంబర్ 25: కేంద్రంలో అధికారం చేపట్టిన తమది రైతు అనుకూల ప్రభుత్వమని చాటిచెప్పడంలో భాగంగా బిజెపి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైతు మహాసభను నిర్వహిస్తోంది. సుమారు లక్షమంది రైతులు తరలివస్తారని అంచనావేస్తున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరువుతున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకువస్తున్న పథకాలు, వాటి ఫలితాలను రైతులకు వివరించే ప్రధాన లక్ష్యంతో ఈ రైతు మహాసభను నిర్వహిస్తున్నారు.

అవినీతి బోణీ చేసింది!

విజయవాడ (క్రైం), నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయంలో అవినీతి బోణి చేసింది. ఓ పేరు మోసిన సెక్యూరిటీ కంపెనీకి అనుమతి జారీ చేసేందుకు రూ.50వేలు లంచం తీసుకుంటూ సెక్షన్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటన సచివాలయంలో కలకలం రేకెత్తించింది. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌కు చెందిన శివ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అనే కంపెనీ దేశంలోని దాదాపు 6, 7 రాష్ట్రాల్లో సర్వీసులు అందిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వ శాఖల అనుమతి తీసుకుని సేవలు నిర్వహించింది.

అవినీతి హక్కవుతోంది!

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘అవినీతి, నల్లధనానికి కొందరు బాహాటంగా మద్దతిస్తున్నారు. దీనివల్ల భావితరాలకు తీరని అన్యాయం జరుగుతుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షంపై పరోక్ష ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని బాలయోగి గ్రంథాలయంలో బిజెపి సీనియర్ నాయకుడు కేదార్‌నాథ్ సహానిపై రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో విలువలు పడిపోవటం వలన దేశానికి ఎంతోనష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. దేశం కోసం జీవించేవారి ప్రజా జీవితంలో మచ్చలేకుండా ఉండాలని సూచించారు. దేశంలో ఇప్పుడొక వర్గం, గ్రూపు బాహాటంగా నల్లధనం, అవినీతిని సమర్థిస్తోంది.

సమన్వయమే ఆయుధం

నల్లధనం నిర్మూలనకే పెద్ద నోట్ల రద్దు ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరు
పోలీసు వ్యవస్థలో పారదర్శకత ఉండాలి టెక్నాలజీతో జాతివిద్రోహులపై ఉక్కుపాదం
డిజిపిల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ పిలుపు

మిస్ర్తిపై టాటా స్టీల్స్ వేటు

న్యూఢిల్లీ, నవంబర్ 25: టాటా సన్స్ సంస్థ మాజీ అధినేత సైరస్ మిస్ర్తిని టాటా స్టీల్స్ సంస్థ శుక్రవారం తమ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించింది. టాటా స్టీల్స్ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ముంబయిలో సమావేశమై చైర్మన్ పదవి నుంచి మిస్ర్తికి ఉద్వాసన పలికింది. అంతేకాకుండా మిస్ర్తి స్థానంలో టాటా స్టీల్స్ తమ బోర్డులోని స్వతంత్ర డైరెక్టర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మాజీ అధినేత ఓపి.్భట్‌ను తాత్కాలిక చైర్మన్‌గా నియమించింది.

డిజిటల్ లావాదేవీలే లక్ష్యంగా ఎటిఎంల స్థానంలో సిడిఎంలు!

కర్నూలు, నవంబర్ 25: రానున్న ఏడాది కాలంలో ప్రస్తుతం ఉన్న ఎటిఎంల స్థానంలో సిడిఎం (క్యాష్ డిపాజిట్ మిషన్)ల ఏర్పాటుకు ప్రాధాన్యనివ్వనున్నట్లు బ్యాంకర్ల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎటిఎంలలో చాలా వరకూ సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు స్వస్తిపలికి మరమ్మతులతో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై కొత్తగా ఎటిఎంల ఏర్పాటు కూడా ఉండకపోవచ్చని, వాటి స్థానంలో సిడిఎంలను ఏర్పాటు చేయాలని ఆర్‌బిఐ ఆలోచిస్తున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఎం-పెసాతో నగదు

హైదరాబాద్, నవంబర్ 25: దేశంలోని దాదాపు 84 లక్షల మంది ఖాతాదారులకు నగదు ఉపసంహరణ కోసం వొడాఫోన్ ఇండియా వినూత్నమైన సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు తమ డిజిటల్ వాలెట్‌ను ఉపయోగించి దేశ వ్యాప్తంగా 1.20 లక్షల వొడాఫోన్ ఎం-పెసా ఔట్‌లెట్లలో లభ్యతను అనుసరించి నగదును విత్ డ్రా చేసుకోవచ్చని ఆ సంస్థ బిజినెస్ హెడ్ సురేష్ సేథీ తెలిపారు. వొడాఫోన్ ఎం-పెసా కస్టమర్లు ఎటిఎంలు, బ్యాంకు శాఖల వద్ద నగదు కోసం భారీ క్యూలలో నిల్చోవాల్సిన అవసరంలేదన్నారు. తమ సంస్థ ఔట్‌లెట్లు 56 శాతం గ్రామీణ భారతంలో ఉన్నాయన్నారు.

Pages