S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జట్టులోకి మరొకరు!

* ప్రపంచ ట్రెకింగ్ చాంపియన్‌షిప్ పోటీలను బృందాలకు నిర్వహిస్తారు. ఒక్కో బృందంలో నలుగురు ఉంటారు. కానీ, స్వీడన్ బృందంలోకి ఓ అనుకోని అతిథి వచ్చి చేరడం అందరి దృష్టినీ ఆకర్షించింది. రాళ్లురప్పలు, ముళ్లపొదలు, బురద గుంటలతో, కొండ మలుపులతో కూడిన 430 మైళ్ల దూరం ట్రెకింగ్ చేసేందుకు అద్వితీయ ప్రతిభ, తిరుగులేని శక్తిసామర్థ్యాలేకాదు.. అంతులేని ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. స్వీడన్ జట్టులోని నలుగురు ట్రెకర్లు పోటీ ప్రారంభమైన కొంత సేపటి తర్వాత భోజనం చేయడానికి ఉపక్రమించారు. అదే సమయంలో అక్కడ ఒక కుక్క దీనంగా తమనే చూడడాన్ని గమనించి, దానికీ తిండి పెట్టారు. అంతే.. ఆ క్షణం నుంచి ఆ కుక్క వారిని విడిచిపెట్టలేదు.

- సత్య

దుస్తులు మార్చడు!!

భారత క్రికెట్‌లో ఒకప్పుడు చాలా మంది డిఫెన్సివ్ బ్యాట్స్‌మెన్ ఉండేవాళ్లు. క్రీజ్‌లో నిలదొక్కుకుపోతూ జిడ్డు బ్యాటింగ్ చేసే ఆటగాళ్ల తీరును మార్చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో కృష్ణమాచారి శ్రీకాంత్‌ది మొదటి స్థానం. రెండో స్థానం నవ్‌జోత్ సింగ్ సిద్ధుది. ‘సిక్సర్ల సిద్ధు’గా పేరు సంపాదించిన ఈ పంజాబ్ ఆటగాడు 1983 వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. అప్పట్లో విశ్రాంతి రోజుతో కలిసి టెస్టు ఆరు రోజులు జరిగేది. అన్ని రోజులూ సిద్ధు దుస్తులను మార్చకుండానే మ్యాచ్ ఆడాడు. వాటిని మారిస్తే తన అదృష్టం కూడా మారుతుందేమోనని అనుమానించడమే అందుకు కారణం.

ఆశ చావలేదు..

ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కీలక స్పిన్నర్‌గా సేవలు అందించి, బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా నిషేధానికి గురైన సయిద్ అజ్మల్‌కు జాతీయ జట్టులో స్థానంపై ఇంకా ఆశ చావలేదు. రిటైర్మెంట్ ఆలోచన తనకు ఏమాత్రం లేదని 39 ఏళ్ల అజ్మల్ స్పష్టం చేస్తున్నాడు. 2014లో సస్పెన్షన్‌కు గురైన అతను ప్రత్యేకంగా నిపుణుల వద్ద శిక్షణ పొంది, బౌలింగ్ యాక్షన్‌ను చక్కదిద్దుకున్నాడు. మారిన అతని బౌలింగ్ యాక్షన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, అతనిపై గతంలో విధించిన సస్పెన్షన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిరుడు తొలగించింది.

మేవెదర్, పాక్వియానో రీ మ్యాచ్ జరిగేనా?

ఓటమి ఎరుగని వీరుడు ఫ్లోయిడ్ మేవెదర్‌తో రీ మ్యాచ్‌కి తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల ప్రకటించిన ఫిలిప్పీన్స్ బాక్సింగ్ హీరో మానీ పాక్వియావో దానిని ఒక జోక్‌గా కొట్టిపారేశాడు. అంతలోనే మళ్లీ మాట మార్చేసి, ఏ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్యానించి, అభిమానులను అయోమయానికి గురి చేశాడు. బాక్సింగ్ కెరీర్ గురించి ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటన చేయడం పాక్వియావోకు అలవాటుగా మారింది. ఇటీవల జెస్సీ వర్గాస్‌తో పోరుకు ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే ఏడాది గురించి తాను ఎలాంటి నిర్ణయాలకు రాలేనని స్పష్టం చేయడంతో, మేవెదర్‌తో అతని ఫైట్ ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.

విదేశాలలో విన్నర్

సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘విన్నర్’. విదేశాలలో షూటింగ్ పూర్తి చేసిన సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మాట్లాడారు. ఈ నెల 3 నుండి 20 వరకు ఉక్రెయిన్‌లో పాటల చిత్రీకరణ చేశామని, యాంకర్ అనసూయపై మరోపాటను చిత్రీకరించామని తెలిపారు. టర్కీ, ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్ సన్నివేశాలు చేశామని, బల్గేరియన్ ఫైటర్స్ పాల్గొన్నారని తెలిపారు. వచ్చే నెల 6 నుండి 22 రోజులపాటు ఊటీ, బెంగుళూరులో మరో షెడ్యూల్ చేస్తామని తెలిపారు.

పూర్ణకు లక్కీచాన్స్

తెలుగులో అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన నటి పూర్ణ తాజాగా కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్‌గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు తెలుగులో అవకాశాలు పెరుగుతున్నాయని అందరూ అభిప్రాయపడుతుండగా ఆమెను వెతుక్కుంటూ ఓ గోల్డెన్ చాన్స్ వచ్చింది. కానీ, అది తెలుగులో కాదు తమిళంలో. దర్శకుడు నిర్మల కుమార్ త్వరలో డైరెక్ట్ చేస్తున్న ‘శత్రుజ్ఞ వెట్టై-2’ సినిమాలో ఈమె నటుడు అరవిందస్వామికి జంటగా నటిస్తోంది. 2014లో వచ్చిన ‘శత్రుజ్ఞవెట్టై’ సినిమాకి సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రాన్ని మనోబాల నిర్మిస్తున్నారు.

చిన్న సినిమాలకు గుర్తింపు ఏదీ?

ఓ సినిమా తెలుగులోకి అనువాదం చేయాలనుకున్నపుడు ఆ సినిమా లైన్ ఎలా వుంది? ఏ జోనర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు? అనే అంశాలను గమనించి ఆ చిత్రాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఏ సినిమా అయినా డిఫరెంట్‌గానే అందించే ప్రయత్నం చేస్తాం. ఈ మూడు చిత్రాలు విడుదలయ్యాక మా సంస్థ గౌరవం పెరుగుతుందని భావిస్తున్నాం.

-యు

ధ్రువ ట్రైలర్స్ అదుర్స్

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ధ్రువ’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత అరవింద్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని 2వ తేదీనే విడుదల చేయాలనుకున్నా పెద్దనోట్ల రద్దువల్ల వాయిదా వేశామని, 9న అయితే బాగుంటుందని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని తెలిపారు.

2న అరకురోడ్డులో

శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా మేకా బాలసుబ్రహ్మ ణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకురోడ్డులో’. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ, ఈ సినిమాను ఇప్పటికే సెలబ్రిటీలకు ప్రదర్శించామని, సినిమా విజయంపై నమ్మకం పెరిగిందని తెలిపారు. ప్రభాస్ విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన వస్తోందని, పృథ్వీ చేసిన పాత్ర సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని వారు తెలిపారు.

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా?

జనతాగ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ తదుపరి సినిమా ఏమిటి? అనే ప్రశ్నకు ఇంకా సరైన జవాబు రాలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపినా కూడా ఏది ఫైనల్ కాలేదు.

Pages