S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో నగర నీటి సరఫరా వీక్షణం

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 23: నగర వ్యాప్తంగా విజయవాడ నగర పాలక సంస్థ ద్వారా ప్రజలకు సరఫరా అవుతున్న నీటి తీరును ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. ఈసందర్భంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మోనటరింగ్ (స్కాడా) వైబ్‌సైట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు.

ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తవుతుంది?

విజయవాడ, నవంబర్ 23: కనకదుర్గపై వంతెన పనులు నత్తనడకగా జరగడం పట్ల కాంట్రాక్టర్లు, అధికారులపై కల్టెర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ సలోని సిదానా, డిఆర్‌వో సిహెచ్ రంగయ్య, ఆర్‌అండ్‌బి, పిఆర్, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్‌హెచ్, ఇంజనీర్లు, సంబంధిత కాంట్రాక్టర్లతో దుర్గగుడి పైవంతెన పనులపై సమీక్షించారు. పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ పనులు జాప్యం పట్ల సహించేది లేదని కాంట్రాక్టర్లకు కలెక్టర్ స్పష్టం చేశారు.

కృష్ణాలో నగదురహిత లావాదేవీలకు పెద్దఎత్తున ఈ-పోస్ మిషన్లు

విజయవాడ, నవంబర్ 23: జిల్లాలో నగదురహిత లావాదేవీలు అమలు జరిపే విధంగా పెద్ద ఎత్తున ఈ-పోస్ మిషన్లు ప్రవేశపెట్టటానికి కార్యక్రమం రూపొందించటం జరిగిందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్‌లో సబ్-కలెక్టర్ సలోని సిదాన, డిఎస్‌ఓ వి రవికిరణ్, ఎల్‌డియం వెంకటేశ్వరరెడ్డితో ఇ-పాస్ మిషన్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వర్తకుల వివరాలను సేకరించి వారికి ఈ-పోస్ మిషన్‌లు పంపిణీ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో గ్రామాలవారీగా ఎంతమంది వర్తకులు ఉన్నారు.

అదనపు ఏర్పాట్లతో తీరని అవసరాలు

హైదరాబాద్, నవంబర్ 23: పెద్దనోట్లను రద్దు చేయటంతో నగదు మార్పిడి, చిల్లర కోసం సామాన్యులెదుర్కొంటున్న సమస్యను నివారించేందుకు బ్యాంకులు చేస్తున్న అదనపు ఏర్పాట్లు, ఏ మాత్రం ప్రజల అవసరాలను తీర్చటం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో వికలాంగులు, వయోవృద్ధులు, మహిళల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసినా, రైతుబజార్ వంటి ప్రాంతాల్లో పాయింట్ ఆఫ్ సేల్ మొబైల్ వాహనాల ద్వారా డెబిట్ కార్డున్న వారికి రోజుకి రూ. 2వేల విలువైన వంద నోట్లను పంపిణీ చేస్తున్నా, ప్రజల అవసరాలు పూర్తి స్థాయిలో తీరటం లేదు. పాత వెయ్యి, 500 నోట్లను మార్కెట్లో మార్చుకునే గడువు నేటితో ముగియనుంది.

పార్కుల నిర్వాహణకు ‘కార్పొరేట్’ భాగస్వామ్యం

హైదరాబాద్, నవంబర్ 23: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యానికి అనుకూలంగా పచ్ఛదనాన్ని పెంపొందించే దిశగా జిహెచ్‌ఎంసి దృష్టి సారించింది. ఏటా కోట్ల రూపాయలను వెచ్చించి పార్కులు, సెంట్రల్ మీడియా, కూడళ్లలోని పచ్ఛదనాన్ని పెంపొందించేందుకు, పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నా, సిబ్బంది వద్ధ జవాబుదారీతనం లేకపోవటం, చేపట్టిన చర్యలు ఫలించకపోవటంతో ఈ బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది.

చంకలో పందిపిల్లతో ఏటీఎం వద్ద

హైదరాబాద్, నవంబర్ 23: చిత్ర పరిశ్రమలో ప్రతీ దర్శకుడికి ఓ స్టైల్ ఉంటుంది. అలా విభిన్నంగా చిత్రాలను తెరకెక్కించే దర్శకుల్లో రవిబాబుకు ఒక ప్రత్యేకత వుంది. ‘అల్లరి’ నుంచి ఆయన అనుసరిస్తున్నది కూడా అదే. సినిమాలు తీయడమే కాదు..వాటిని విస్తృతంగా ప్రచారం చేయడంలో కూడా రవిబాబు విభిన్నంగా ఆలోచిస్తారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అదిగో’. ఈ సినిమాలో ప్రధాన పాత్రను ఓ పందిపిల్ల పోషిస్తోంది. ఇందుకోసం రవిబాబు ఆయన పందిపిల్లలను పెంచుతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘అదిగో’ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకుసన్నాహలు చేస్తున్నారు రవిబాబు.

తెలుగు సంప్రదాయాలు ప్రతిబింబించే చిత్రాలు రావాలి

హైదరాబాద్, నవంబర్ 23: సినీ నిర్మాణం కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా సందేశాత్మకంగా కథలు వుండాలని, తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే మంచి చిత్రాలు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ జూనియర్ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తెలుగు సినిమా స్క్రీన్‌ప్లే’ పుస్తకాన్ని బుధవారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. డిస్కో నృత్యాలకు స్వస్తి చెప్పాలని, పాత శాస్ర్తియ నృత్య సంప్రదాయాలను కాపాడుకుంటూ పాత తరహా కుటుంబ కథ చిత్రాలకు ప్రాధాన్యత కల్పించండి సినీ వర్గానికి ఆయన సూచించారు.

‘ప్రణవ్’ చిన్నారుల నృత్యంతో ‘ముద్దుగారే యశోదా...!’

హైదరాబాద్, నవంబర్ 23: అన్నమాచార్య కీర్తనలలోని ‘ముద్దుగారె యశోద...’ కీర్తనను తనదైన శైలిలో ప్రముఖ నాట్యాచారిణి డా. జి. పద్మజారెడ్డి నేతృత్వంలో బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో చిన్నారులు కడురమ్యంగా ప్రదర్శించారు. ప్రణవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ సంస్థ 9వ వార్షికోత్సవంలో భాగంగా సుమారు నూట నలభై మంది శిష్యులతో వివిధ నృత్యాంశాలతో ఆడిటోరియంలో ప్రేక్షకులకు ఆనంద రసానుభూతి కలిగించారు. ‘అదివో అల్లదివో...’, అన్నమయ్య కీర్తన అనంతరం అర్ధనారీశ్వరం, తిల్లాన అంశాలను కూడా ప్రదర్శించారు. శ్రీ రాగంలో త్యాగరాజ కీర్తన ‘ఎందరో మహానుభావులు...’ అంశంలో చిన్నారులు ప్రత్యేకతను ప్రదర్శించారు.

నగరానికి పూర్వవైభవాన్ని తెస్తాం

హైదరాబాద్, నవంబర్ 23: నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు అధిక సంఖ్యలో పార్కులను అభివృద్ధిలోకి తెచ్చి, గార్డెన్ సిటీ, సరస్సుల నగరంగా పేరుగాంచిన సిటీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలియజేశారు. రాజేంద్రనగర్ హైదర్‌నగర్‌లో రూ. 63లక్షల వ్యయంతో నిర్మించిన పెద్దతాళ్లకుంట చెరువు పార్కును మేయర్ బొంతు రామ్మోహన్ కమిషనర్ జనార్దన్‌రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు.

సాహాకు గాయం పార్థీవ్‌కు స్థానం

మొహాలీ, నవంబర్ 23: భారత వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా, శనివారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. దీనితో అతని స్థానంలో పార్థీవ్ పటేల్‌ను సెలక్టర్లు ఆహ్వానించారు. 2002లో భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు, 17 ఏళ్ల వయసులో పార్థీవ్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతను చివరి టెస్టును శ్రీలంకతో కొలంబోలో 2008 ఆగస్టులో ఆడాడు. ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 31 ఏళ్ల పార్థీవ్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కడం విశేషం. అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించినప్పుడు ‘పాల బుగ్గల పసివాడు’ అని ముద్ర వేయించుకున్న పార్థీవ్ కెరీర్‌లో ఇప్పటి వరకూ 20 టెస్టులు ఆడాడు.

Pages