S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్‌లో మహేష్

ప్రముఖ నటుడు మహేష్‌బాబు, దర్శకుడు మురగదాస్‌ల కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రం ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌లలో షెడ్యూళ్లు పూర్తిచేసుకుని ఈ రోజు అహ్మదాబాద్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ శుక్రవారం మొదలుకానుండగా మహేష్ మాత్రం 27వ తేదీ నుండి షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. సుమారు నెల రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కొన్ని రోజులు పూణెలోనూ షూటింగ్ జరుగుతుందట. మొదటి రెండు షెడ్యూల్స్ పూర్తయిన తరువాత లొకేషన్స్ కోసం మురగదస్ అహ్మదాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు.

ఒక్కడొచ్చాడు

విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ఎం.పురుషోత్తం సమర్పణలో సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందించిన చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 500, 1000 రూపాయల నోట్ల రద్దు చేసినందున చిత్రం విడుదల జరగలేదన్నారు. విశాల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌లో రూపొందించిన ఈ చిత్రం తమ సంస్థకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకం వుందన్నారు. జగపతిబాబు విలన్‌గా నటించిన ఈ చిత్రంలో సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

సింగం-3 సిద్ధం

సూర్య కథనాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న చిత్రం సింగం-3 స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా హరి దర్శకత్వంలో రూపొందిస్తుండగా, సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, కబాలి చిత్రం తరువాత ఎక్కువ వ్యూలు ఈ చిత్రానికి లభించాయని తెలిపారు. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను డిసెంబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

డబ్బుకోసం సత్యా గ్యాంగ్

ప్రత్యూష్ వి.ఆర్., హర్షిత పన్వర్ జంటగా సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ఎం.మహేష్ కన్నా రూపొందిస్తున్న సత్యాగ్యాంగ్ చిత్రం గురువారం ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. కాశీవిశ్వనాధ్ కెమెరా స్విచ్చాన్ చేయగా పద్మా దేవేందర్ రెడ్డి తొలి క్లాప్‌నిచ్చారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.మహేష్ కన్నా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఇది నచ్చుతుందని తెలిపారు. ఈ చిత్రంలో తాను సత్య పాత్రలో నటిస్తున్నానని కథానాయకుడు ప్రత్యూష్ అన్నారు.

అమీషా రీ ఎంట్రీ

పవన్‌కళ్యాణ్ హిట్ సినిమా ‘బద్రి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అమీషా పటేల్ ఆ తరువాత మహేష్‌బాబుతో నాని, న్టీఆర్‌తో నరసింహుడు వంటి సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది. 2011లో నందమూరి బాలకృష్ణతో పరమవీరచక్ర సినిమాలో నటించిన ఆమె ఆ తరువాత బాలీవుడ్‌వైపు వెళ్లిపోయింది. దాదాపు 5 సంవత్సరాల తరువాత ఇప్పుడామె తెలుగు సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ఒక ఐటెం సాంగ్‌తో కావడం విశేషం. ‘ఆకతాయి’ అనే సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ పాటలో మెప్పించనుంది అమీషా పటేల్. ఈ పాట చిత్రీకరణ సారథి స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్‌లో జరిగింది. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేశారు.

ఆరు పాటల నీలిమలై

ఆనంద్‌కృష్ణ, స్వరూప, బేబి హర్షిత ప్రధాన తారాగణంగా నీలిమా ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో ఆనంద్‌కృష్ణ రూపొందిస్తున్న చిత్రం నీలిమలై. దీనికి సంబంధించి షూటింగ్ వనపర్తి పరిసర ప్రాంతాల్లో పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్‌కృష్ణ మాట్లాడుతూ, కేరళలోని వివిధ లొకేషన్లలో 70 శాతం షూటింగ్ పూర్తిచేశామని, మిగిలిన షూటింగ్ పార్ట్ ఇక్కడ జరుపుతున్నామని తెలిపారు. దీన్ని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

సందేశంతో కారం దోసె

దర్శకుడు త్రివిక్రమ్ వీణావేదిక ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించే చిత్రం ‘కారం దోసె’. జి.శివరామచంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, చందన నాయికా నాయికలుగా నటించారు. దీన్ని వచ్చేనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, జీవితంలో ఏదో చేయాలని కలలు కనే నేటి యువతరం మాటలు తగ్గించి, చేతల్లో చూపించమని చెబుతూ ఈ చిత్రం సాగుతుందని, ఒళ్లు వంచి పనిచేస్తే తనకి, సమాజానికి అది మేలు చేస్తుందని చెప్పేలా చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ఆడియోకు, టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.

అల్లు అర్జున్‌తో వక్కంతం వంశీ

కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి పలు సూపర్‌హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ ఎప్పట్నుంచో దర్శకుడిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా మొదలవుతుందంటూ ప్రచారం రావడమే తప్ప ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికి అన్నీ కుదిరి వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు రంగం సిద్ధమైంది. అల్లు అర్జున్ హీరోగా వంశీ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిన ఈ సినిమాను లగడపాటి శ్రీ్ధర్, నాగబాబు నిర్మిస్తారు. అర్జున్‌కు సరిపడేలా వంశీ తయారుచేసిన కథ, క్యారెక్టరైజేషన్ హైలైట్స్‌గా నిలుస్తాయట.

నగరంలో తొలిసారిగా యుపిఎస్‌సి మెయిన్ పరీక్ష

విజయవాడ, నవంబర్ 23: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని విజయవాడలో మొదటి సారి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మెయిన్స్ పరీక్షను డిసెంబర్ 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 3న శనివారం పేపర్-1 ఎస్సే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.

కృష్ణాలో 620 ఎటిఎంలలో రూ.25కోట్లు విలువైన రూ.500ల నోట్లు

విజయవాడ, నవంబర్ 23: కృష్ణా జిల్లాలోని 620 ఎటిఎంలలో రూ.25 కోట్ల విలువైన రూ.500 నోట్లను అందుబాటులో ఉంచినట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ నెంబర్‌తో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ ముఖ్యమంత్రిని కోరారు. కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ బాబు ఎ పాల్గొన్నారు.

Pages