S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న - జవాబు

* మనం ఎలాంటి సందర్భాలలో వైద్యుణ్ణి కలుసుకోవడం అవసరం?
- శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి. అంతకన్నా ఎక్కువ వుంటే జ్వరంతో బాధపడుతున్నట్లే. సాధారణంగా శరీరోష్ణత పెరగడం ఇన్‌ఫెక్షన్స్‌కి గురైనట్లే. అలాగే మనం శ్వాసించడంలో కూడా మార్పు రాకూడదు. సాధారణంగా నిముషానికి 12 నుంచి 20 సార్లు శ్వాసించాలి. వ్యాయామానంతరం శ్వాసించే రేటు పెరగవచ్చు. మామూలప్పుడు అంతకన్నా ఎక్కువున్నా, తక్కువున్నా జాగ్రత్తపడాలి. అలాగే గుండె కొట్టుకునే రేట్ పెరిగి దడగా ఉన్నా వెంటనే వైద్యుణ్ణి కలవడం అవసరం.
* గుండె కొట్టుకునే రేట్‌ని ఎలా గురిస్తారు?

-డా రవికుమార్ ఆలూరి గుండె, రక్తనాళాల వైద్య నిపుణులు కిమ్స్, కొండాపూర్, హైదరాబాద్.. 9848024638

మలబధ్ధకం పోయేదెలా..?

నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండాపోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్రరూపందాల్చుతుంది.
మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు మలబద్ధకమే మూలకారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కలదు.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646

కాఫీ కాలకూటమే! (మీకు మీరే డాక్టర్)

ప్ర: కాఫీ ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు. నిజమేనా? ఎంత త్రాగవచ్చు?
-నళినీ మనోహర్, జగిత్యాల
జ: తెలుగువారిది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ప్రొద్దునపూట మజ్జిగ (చల్ల) అన్నం, మధ్యాహ్నం ఘనాహారం, రాత్రికి స్వల్పాహారం తరతరాలుగా మన ఆహారపు అలవాటు. స్వల్పాహారం వేరు, అల్పాహారం వేరు. స్వల్పాహారం అంటే తేలికగా అరిగే పదార్థాలతో ఆకలి తీర్చుకోవటం. అల్పాహారం అంటే ఇడ్లీ, పూరీ, ఉప్మా, బజ్జీ, పునుగు లాంటి వాటితో కలిపి కాఫీ టీలు త్రాగి ఆకలిని చంపుకోవటం. ఆకలి తీర్చటం మంచిదా? చంపటం మంచిదా?

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

mataata

రామనామం

త్రేతాయుగానికి సంబంధించిన రామరాజ్యమే నేటికి జనులు ఇష్టప డుతుంటారు. రాక్షసులెందరినో మట్టుపెట్టి అర్జునుడికి గీతను బోధించిన ద్వాపర యుగంలోని కృష్ణుని కన్నా అందరి నోట్లో రామ రామ అనే పదమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ రామ అన్న పదం ధర్మానికి మారుపేరుగా ఉంటుంది. రామరాజ్యము ధర్మరాజ్యం. అక్కడ అవినీతి అధర్మము, అవిద్య అజ్ఞానము ఇలాంటి వాటికి చోటు లేదు. ఆ రాజ్యములోని అందరూ చదువుకున్నవారే. నాగరికత నేర్చినవారే. ఒకరిది కావాలని ఆశపడేవాళ్లు లేరు. ఒకరికి దానం చేసే స్థాయ ఉన్నవారే కాని ఒకరి సంపదను అన్యాయంగానో, అక్రమంగానో లాక్కొని అనుభవించాలని అనుకునేవారు కాదు.

- సాయకృష్ణ

కాశీ ఖండం.. 69

ఇది ఏ లోకం? మిక్కుటంగా అచ్చెరువు గొల్పుతూ వుంది?’’ అని ప్రశ్నించాడు. అంత విష్ణ్భుటులు సుశీల పుణ్యశీలురు శివశర్మతో ఈ పగిది వచింపసాగారు.
‘‘మధురాపట్టణం ద్విజప్రవరా! శివశర్మా! వేదములు, షట్ఛాస్త్రాలు, ఆగమాలు అనే జలధికి చంద్రోదయా! ఇది చంద్రలోకం. ఈ ప్రోలుని చంద్రుడు తన కిరణాంకూర శిఖా నిర్గత సుధానిధులతో భాస్కర తీక్షణ కిరణ సంతప్తమైన ఈ విశ్వాన్ని రక్షిస్తూ ఏలుతూ వుంటాడు.

-శ్రీపాద కృష్ణమూర్తి

నేర్చుకుందాం

జలకంబుల్ రసముల్ ప్రసూనములు వాచాబంధముల్ వాద్యముల్
కలశబ్ద్ధ్వనులంచి తంబర మలంకారంబు దీప్తుల్ మెఱుం
గులు నైవేద్యము మాధురీ మహిమగా గొల్తున్ నినున్ భక్తి రం
జల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా!

కొత్త స్నేహితులు 23

సాహిత్య వైపు అమాయకురాలిని చూసినట్టుగా చూసి, ‘‘్భలేవారే.. ‘ఇంట్లో బుద్ధిమంతుడు- వీధిలో బడాచోర్’ సీరియల్‌లో పెళ్లాం దగ్గర ప్రేమ ఒలకబోసే మగాడి అసలు రూపం ఎలా బయటపెట్టాలో వివరంగా చూపించడం లేదూ?!
‘సింగినాదం-జీలకర్ర’ సీరియల్‌లో పెళ్లాన్ని పుట్టింటికి పంపించి ఎవరో వగలాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే మగాడి గుట్టు ఎలా రట్టయిందో స్పష్టంగా చూపించలేదూ?
ఒక రకంగా చెప్పాలంటే మహిళా సంఘాలవాళ్లకంటే.. ఆడవాళ్లు తలచుకోవాలేగానీ మగాళ్లను మూడు చెరువుల నీళ్లెలా తాగించగలరో వివరంగా చూపిస్తోన్న సీరియల్స్ వల్లే నిజంగా స్ర్తిలకు తమ హక్కులేవిటో తెలిసొస్తున్నాయి. అందుకే అటువంటి సీరియల్స్ ఉంటే నాకు ఇష్టం.

సీతాసత్య

సలలిత రాగ సుధారస సారం..

‘వౌనమే నీ భాష ఓ మూగమనసా..’ ఇప్పటికీ ఈ పాట వింటే ఎవరి మనసైనా భావోద్వేగాలతో నిండిపోతుంది. మదిని హాయి గొలుపుతూ తనదైన గాత్రంతో ఆకట్టుకోవడంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణది ప్రత్యేక శైలి. కర్నాటక సంగీతాన్ని తనదైన గాత్రంతో సామాన్యుడికి సైతం దగ్గర చేసింది మురళీ గానమే. సంగీతాన్ని ఔపోసన పట్టిన మహా వాగ్గేయకారుడు, కర్నాటక సంగీతానికి ఖండాంతరాల ఖ్యాతితెచ్చిన తెలుగుతేజం మంగళంపల్లి. ఆ గొంతు మూగబోయిందని తెలిశాక తెలుగు చలనచిత్ర సీమ దిగ్భ్రాంతి చెందింది.

Pages