S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.25 లక్షల పరిహారం చెల్లించండి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన ఎడమ కాలికి 40 శాతం వైకల్యాన్ని పొంది బాధపడుతున్న ఒక రోగికి రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఒక ప్రైవేటు ఆసుపత్రిని, అందులో పనిచేస్తున్న ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులను ఢిల్లీ వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. లలిత్ సయాల్ అనే రోగికి రూ.15 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఉత్తర ఢిల్లీలోని అశోక్ విహార్ ఫేజ్-3లో గల సుందర్‌లాల్ జైన్ ఆసుపత్రిని, రూ. అయిదు లక్షల చొప్పున చెల్లించాలని చికిత్స చేసిన ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులను ప్రెసిడెంట్ జస్టిస్ వీణా బిర్దాల్, సభ్యుడు సల్మా నూర్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది.

సిబిఐ అధికారులు చిత్రహింసలు పెట్టారు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కొంతమంది సిబిఐ అధికారులు తనను, తన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారని కుమారుడితోసహా ఆత్మహత్య చేసుకున్న కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బికె బన్సల్ తన సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ వాఖలో అదనపు కార్యదర్శి ర్యాంక్ అధికారి అయిన బన్సల్‌ను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీనుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణపై గత జూలై 16న అరెస్టు చేయడం తెలిసిందే. కాగా, బన్సల్, ఆయన కుమారుడు యోగేష్ రాసిన సూసైడ్ నోట్‌లో సంచలన వివరాలు వెల్లడయ్యాయి.

ఉద్రిక్తతలను తగ్గించుకోవాలి

వాషింగ్టన్, సెప్టెంబర్ 28: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని, ఇరు దేశాలు వౌఖికంగా, రాతపూర్వకంగా వ్యక్తం చేసే అభిప్రాయాలు సామరస్యపూర్వకంగా ఉండాలని అమెరికా పిలుపునిచ్చింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ పూరితంగా, గొప్పగా సమాచార మార్పిడి జరగాలని, మరింత సమన్వయం సాధించాలని పేర్కొంది. ‘మేము చాలాసార్లు ఉన్నత స్థాయి వేదికపైనుంచి చెప్పిన అంశం ఏంటంటే, ఇరు దేశాల మధ్య సన్నిహితమైన, సాధారణ సంబంధాలను చూడాలని కోరుకుంటున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. దీనివల్ల ఆ రీజియన్‌కే ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

ఏదో ఒక రోజు దేవుడికి సమాధానం చెప్పుకోవాల్సిందే

వాటికన్ సిటీ, సెప్టెంబర్ 28: అలెప్పోలో బాంబు దాడులకు పాల్పడిన వ్యక్తులు ఏదో ఒక రోజు దేవునికి సమాధానం చెప్పుకోవల్సి ఉంటుందని పోప్ ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు. హింసకు పాల్పడడం, ప్రోత్సహించడం రెండూ తీవ్రమైన తప్పిదాలేనని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ మాట్లాడుతూ ‘బాంబుదాడికి ఎవరైతే బాధ్యులో వారు దేవుడికి సమాధానం చెప్పుకోల్సి ఉంటుంది’ అని అన్నారు. సిరియా, రష్యా దేశాల పేరు ఎక్కడా ప్రస్తావించని ఫ్రాన్సిస్ అలెప్పో దాడిపై స్పందించారు. బాంబు దాడి తనను ఎంతో బాధకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని పెరెస్ కన్నుమూత

టెల్‌అవీవ్, సెప్టెంబర్ 28: పాలస్తీనాతో దశాబ్దాలుగా సాగిన సంఘర్షణలకు స్వస్తిపలికి ఇరుదేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు విశ్వప్రయత్నం చేసిన ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత షిమన్ పెరెస్ (93) బుధవారం కన్నుమూశారు. మంగళవారం ఆయన శారీరక అవయవాలన్నీ విఫలమయ్యాయని, అంతకుముందు వచ్చిన జబ్బువల్ల మెదడుకూడా చికిత్స చేయలేనంతగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. పెరెస్ నిద్రలోనే కన్నుమూశారని వారన్నారు. పెరెస్ రెండు పర్యాయాలు ఇజ్రాయెల్ ప్రధానిగా, తొమ్మిదో అధ్యక్షుడుగా పనిచేశారు.

అంతా పాక్ వల్లే

ఢాకా, సెప్టెంబర్ 28: ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఎనిమిది దేశాల సార్క్ సదస్సు నిర్వహణ దాదాపు అనుమానంలో పడింది. సదస్సులో భాగస్వామ్యం కావటం లేదంటూ భారత్ ప్రకటించిన కొద్ది గంటల్లోపే పాకిస్తాన్ మినహా మిగతా ఆరు దేశాలూ స్పందించాయి. బంగ్లాదేశ్, భూటాన్‌లతోసహా అన్ని సభ్య దేశాలూ పాకిస్తాన్ వైఖరినే తప్పుపట్టాయి. తాము సదస్సును బహిష్కరించటానికి పాకిస్తానే కారణమని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ధనిక నగరాల్లో ముంబయి టాప్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దేశంలోని సంపన్న నగరాల జాబితాలో వాణిజ్య రాజధాని ముంబయి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 820 బిలియన్ డాలర్ల సంపదను కలిగివున్న ముంబయిలో 28 మంది బిలియనీర్లు, మరో 45 వేల మంది మిలియనీర్లు ఉన్నట్లు ఒక నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని అత్యంత సంపన్న నగరాల్లో ముంబయి తర్వాత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వరుసగా రెండవ, మూడవ, నాలుగవ స్థానాలను దక్కించుకున్నాయి.

విస్తరిస్తున్న హోటల్ పరిశ్రమ

విజయవాడ, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతుండటంతో హోటల్ పరిశ్రమ భారీ స్థాయిలో విస్తరిస్తోంది. ప్రభుత్వం రోడ్లు, రవాణా, విమానయానం వంటి వౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ వహించడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ హోటళ్లు, బోట్ హౌస్‌లు, ఎంఐసిఈ (మీటింగ్, ఇన్ సెంటివ్స్, కాన్పరెనె్సస్, ఎగ్జిబిషన్స్) సెంటర్లు రిస్టార్స్, బీచ్ రిసార్ట్స్, రోడ్ సైడ్ ఎమినీటీస్ (రోడ్డు పక్కన సదుపాయాలు) సెంటర్లు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.407 కోట్లతో ఇటువంటి 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు.

6 వేల కోట్లతో బయోటెక్ పార్కులు

హైదరాబాద్, సెప్టెంబర్ 28: బయోటెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాచరణ రూపొందించారు. వచ్చే ఐదేళ్లలో కనీసం ఆరు వేల కోట్ల రూపాయిల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఐదు వేల మంది నిపుణులకు ఉద్యోగావశాకాలు కల్పించనున్నారు. బయోటెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు బాతుగా మార్చుకోవాలని చూస్తోంది. ఫార్మాస్యుటికల్, డయోగ్నస్టిక్స్, అగ్రికల్చర్, పర్యావరణం సహా పలు రంగాలతో పాటు పారిశ్రామికాభివృద్ధిలోనూ బయోటెక్నాలజీ కీలకమైన పాత్ర పోషిస్తోంది.

అంతర్జాతీయ రోమింగ్‌లో అపరిమితంగా ఉచిత కాల్స్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన సెల్యులార్ సంస్థ రిలయన్స్ జియో వాణిజ్య పరమైన సేవలను ప్రారంభించడానికి ముందే పెను సంచలనాలను సృష్టిస్తుండటంతో దేశీయ టెలికామ్ మార్కెట్లో ధరల యుద్ధానికి తెర లేచింది. దీంతో అమెరికా, కెనడా, బ్రిటన్, సింగపూర్ తదితర ప్రముఖ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు తమ ఖాతాదారులకు అంతర్జాతీయ రోమింగ్‌లో ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అగ్రగామి సెల్యులార్ ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది.

Pages