S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎత్తిపోతల ద్వారా 2.34 లక్షల ఎకరాలకు నీరు

హైదరాబాద్, సెప్టెంబర్ 28: చిన్న తరహా ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఏడాది 2 లక్షల 34 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడిసి) అధికారులను ఆ శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఆదేశించారు. ఐడిసి కార్యాలయంలో బుధవారం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. టిఎస్‌పి పథకం కింద కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రూ. 18 కోట్ల వ్యయంతో చేపట్టిన 55 ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.

వ్యవసాయ విద్యలో మార్పులు

హైదరాబాద్/రాజేంద్రనగర్, సెప్టెంబర్ 28: భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ విద్యలో తగిన మార్పులు అవసరమని భారత వ్యవసాయ పరిశోధనా మండలి, విద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్ ఎస్ రాథోర్ అన్నారు. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘం (ఐఎయుఏ) సంయుక్తంగా ‘యూత్ అండ్ స్మార్ట్ అగ్రికల్చర్ - సవాళ్లు, అవకాశాలు’ అన్న అంశంపై రెండు రోజులపాటు హైదరాబాద్ నిర్వహించిన మేధోమథన సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిర్వాసితులను ఆదుకునే బాధ్యత సర్కారుదే

హైదరాబాద్, సెప్టెంబర్ 28: మల్లన్నసాగర్ ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల కింద జీవో 123 కింద సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసితులకు చేపట్టిన సహాయక చర్యలపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించి పలువురు భూ యజమానులు జీవో 123ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని 2013 భూసేకరణ చట్టం కింద భూములు కోల్పోయిన, భూమి లేని వారు ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది.

ఇంగ్లీషు పుస్తకం ఆవిష్కరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 28: పేద విద్యార్థుల కోసం కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ముద్రించిన ‘టు ఇన్ వన్ స్పోకెన్ ఇంగ్లీష్’ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి , మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు పుస్తకాలను ఎమ్మెల్యే కోణప్ప పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.
అమెరికా వర్శిటీలతో గీతం అవగాహన

ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుతామని రాష్ట్ర పర్యాటక మంత్రి ఎం. చందూలాల్ తెలిపారు. బతుకమ్మ సంబురాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కార్యక్రమాలను సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన వివరించారు. ఈ నెల 30 నుండి అక్టోబర్ 9 వరకు పదిరోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు పాతజిల్లాల్లో ఒక్కో జిల్లాకు 10 లక్షల రూపాయలు, కొత్తగా ఏర్పడే జిల్లా ఒక్కోదానికి ఐదులక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు.

మళ్లీ ఆగిన కావేరి జలాలు!

న్యూఢిల్లీ/బెంగళూరు, సెప్టెంబర్ 28: తమిళనాడుకు బుధవారం నుంచి రోజుకు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున శుక్రవారం వరకూ కావేరీ జలాలను అందించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశం అమలును కర్నాటక గురువారం వరకూ వాయిదా వేసింది. రేపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ముఖ్యమంత్రుల సమావేశం ఫలితాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మొదట అఖిల పక్ష సమావేశం, అనంతరం సుదీర్ఘ కేబినెట్ భేటీ జరిగింది. వీటి వివరాలను మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి ఢిల్లీలో జరిగే ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశంలో వాస్తవ పరిస్థితులను వివరిస్తామన్నారు.

డిస్కాంల బలోపేతంపై నేడు ఢిల్లీలో సదస్సు

హైదరాబాద్, సెప్టెంబర్ 28: జాతీయ స్ధాయిలో వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్ డిస్కాంలను ఆర్ధికంగా బలోపేతం చేయడం, పనితీరును మెరుగుపరచడం అనే అంశంపై గురువారం ఢిల్లీలో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి. భవానీ ప్రసాద్ ప్రారంభిస్తారు. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఫోరమ్ ఫర్ రెగ్యులేటర్స్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. విద్యుత్ నియంత్రణ మండళ్ల మధ్య సమన్వయం సాధించేందుకు, జాతీయ స్ధాయిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసే విషయమై ఈ సదస్సులో ప్రణాళికను ఖరారు చేస్తారని అజయ్ జైన్ చెప్పారు.

‘బి’ కేటగిరి సీట్ల భర్తీకి కౌనె్సలింగ్ నిర్వహించండి

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ వైద్య కళాశాలలు ‘బి’కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్లకోసం రెండవ కౌనె్సలింగ్ నిర్వహించాలని ఏపి ప్రైవేట్ వైద్య కళాశాలల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. కొత్త వైద్య కళాశాలల్లో 142 బి కేటగిరీ సీట్లున్నాయని, కౌనె్సలింగ్‌ను నిర్వహించడానికి ప్రైవేట్ వైద్యకళాశాలలు ముందుకు రావడం లేదని హిమవర్ష తదితర పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.

భలే బ్యాలెట్ తీర్పు బాసూ!

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ప్రత్యేక హోదా పేరుతో జనాలకు చేరువయేందుకు విపక్షాలు వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనకు ప్రజల నుంచి ఆశించిన స్పందన లభిస్తున్నట్లు కనిపించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి జనస్పందన లేక, కార్యకర్తలే దిక్కయ్యారు. మాజీమంత్రులు అప్పట్లో కూరగాయల మార్కెట్లకు వెళ్లినా సంతకం చేసేవారే కరవయ్యారు. దానితో ఓటరు లిస్టుతో కార్యకర్తలే సంతకాల సేకరణ ముగించారు. ఇప్పుడు మళ్లీ హోదాపై కాంగ్రెస్, సిపిఐ చేపడుతున్న బ్యాలెట్ బాక్సుల ఓటింగు కార్యక్రమానికి జనం నుంచి స్పందన లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

అనంతఫురం నుండి అమరావతికి ఎక్స్‌ప్రెస్ హైవే

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చుట్టూ రహదారులు నిర్మించడంతోపాటు, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుండి రాజధానికి అతి తక్కువ సమయంలో చేరుకునేలా రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా అనంతపురం నుండి అమరావతికి 371 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తారు. ఈ రహదారిలో 33 మేజర్ బ్రిడ్జిలను నిర్మిస్తారు. నాలుగు రైల్వే బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంటుంది. 14 ఇంటర్ ఛేంజెస్ ఉంటాయి. రహదారి మధ్యలో 10 కిలోమీటర్లు మేర కొండలు, సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఈ రహదారి నిర్మాణానికి రూ.17,111 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

Pages