S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణకే గుండెకాయ ‘ఎల్లంపల్లి’

కరీంనగర్, సెప్టెంబర్ 28: ఉత్తర తెలంగాణకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలాంటిదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టే కాక మరెన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ అనాదిగా కృషి చేస్తూనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చిందంటే కాంగ్రెస్ ఘనతేనని అన్నారు.

జీవిత కాలం జైలులోనే!

కర్నూలు, సెప్టెంబర్ 28: ఏడేళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు ఇక సభ్యసమాజంలో తిరుగాడే అర్హత కోల్పోయాడని, జీవించి ఉన్నంతకాలం జైలులోనే గడపాలని కర్నూలు కోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. కర్నూలు నగరానికి చెందిన పఠాన్ ఖాజాఖాన్(25)కు ఈమేరకు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి తీర్పుచెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఖడక్‌పూరావీధికి చెందిన పఠాన్ ఖాజాఖాన్ గత ఏడాది జూలై 18న పక్కింట్లో నివాసం ఉండే ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి వెంటతీసుకువెళ్లాడు. మూడు రోజులపాటు బాలికను మరోచోట నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నామంటే..!

విశాఖపట్నం, సెప్టెంబరు 28: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంది. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్నారు. విధిలేక ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు సరేనన్నారు. అయితే, ప్రతిపక్ష వైకాపాతోపాటు విపక్షాలన్నీ చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూనే, హోదాపై పోరు కొనసాగిస్తున్నాయి. సరైన సమయంలో ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ప్యాకేజీ తీసుకోవలసి వచ్చిందో జనానికి చెప్పడానికి చంద్రబాబు సమయం దొరికినప్పుడల్లా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు తాపత్రయాన్ని పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవడం లేదు. ప్యాకేజీపై ప్రచార బాధ్యతను తలకెత్తుకోడానికి సిద్ధంగా లేవు.

ఉమ్మడి సేద్యం.. దిగుబడి మంత్రం

సంగారెడ్డి, సెప్టెంబర్ 28: వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన తెలంగాణాలోని రైతులు వ్యక్తిగతంగా పంటలను సాగు, దిగుబడులు చేస్తున్నారని, కానీ సామూహికంగా కొనసాగిస్తే ఫలితం సత్వరమే వస్తుందని సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల రైతులకు పాడి, పంటలపై ప్రత్యేక పాఠాలు బోధించారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రవల్లి గ్రామంలో నిర్మించిన కమ్యూనిటిహాల్‌లో సభను నిర్వహించి ప్రధానంగా వ్యవసాయంపై హితోపదేశం చేసారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయని, అలాంటి సమయంలో పంటలకు నష్టం వాటిల్లి రైతులు నష్టాన్ని చవిచూస్తారని అన్నారు.

‘కమాండ్ కంట్రోల్’ క్రేజ్

హైదరాబాద్, సెప్టెంబర్ 28: ఒకప్పుడు కంట్రోల్‌రూమ్. ఇప్పుడు అది ఆధునికత, సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ రూమయింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వినిపిస్తోన్న మాట ఇది. ప్రభుత్వాధినేత స్వయంగా అక్కడే ఉండి, అన్నీ పర్యవేక్షించడం ద్వారా క్షేత్రస్థాయి అధికారులను పరుగులు పెట్టించి, వారిలో బాధ్యత పెంచే ఆధునిక పరిపాలనా ప్రక్రియ ఇది. తమకు కష్టం వచ్చినప్పుడు పాలకులు ఇల్లు విడిచి ఒకచోట కొలువుదీరి, తమకోసం పనిచేస్తున్నారనే భావన ప్రజల్లో కల్పించే ఈ సరికొత్త పాలనాప్రక్రియపై ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఈ ప్రయోగం తెలంగాణలోనూ అమలవుతోంది.

నడి సంద్రంలో ఆగిపోయిన ప్రయాణికుల నౌక

విశాఖపట్నం, సెప్టెంబర్ 28: విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్‌కు బయలుదేరిన ప్రయాణికుల నౌక ఎంవి హర్షవర్దనలో సాంకేతిక లోపం తలెత్తడంతో నడిసంద్రంలో నిలిచిపోయింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో విశాఖకు 14 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయిన ఈ నౌకకు మరమ్మతులు బుధవారం రాత్రికి కూడా కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. విశాఖకు తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉందని విశాఖపట్నం పోర్టు ట్రస్టు వర్గాలు భావిస్తున్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ నౌక అండమాన్‌లోని పోర్టు బ్లెయిర్‌కు ప్రయాణికులను చేరవేస్తుంది.

ఎస్పీ, బిఎస్పీలను తరిమేయండి

మథుర, సెప్టెంబర్ 28: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేసిందని, అభివృద్ధిని వేగవంతం చేయడంలో చాచా-్భతీజా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం దుయ్యబట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీలను పూర్తిగా తుడిచిపెట్టే విధంగా బిజెపిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. గత 15 ఏళ్లలో ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీలు ఒకదాని తర్వాత మరొకటి అధికారంలో ఉన్నాయని, ఈ 15 ఏళ్ల కాలంలో చాలా రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందితే యుపిలో మాత్రం ఎలాంటి అభివృద్ధీ జరగలేదని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు జయ కానుక!

చెన్నై, సెప్టెంబర్ 28: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం పండగ బోనస్ ప్రకటించారు. బోనస్‌వల్ల ప్రభుత్వంపై 476 కోట్ల రూపాయల భారం పడుతుంది. మొత్తం 3.67 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని సిఎం వెల్లడించారు. అర్హుడైన ఒక్కొక్క ఉద్యోగికి కనిష్ఠంగా 8,400, గరిష్ఠంగా 16,800 రూపాయల బోనస్ అందుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వ ఉద్యోగులు (పిఎస్‌యు)కు ఇరవై శాతం బోనస్ ప్రకటించారు. అందులో 8.33 శాతం బోనస్, 11.67 శాతం ఎక్స్‌గ్రేషియాగా పేర్కొన్నారు.

పారిస్ ఒప్పందాన్ని ఆమోదించనున్న భారత్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం అమలులోకి రావడానికి మార్గం సుగమం అయింది. భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఆమోదించాలని బుధవారం నిర్ణయించింది. అయితే మహాత్మా గాంధీ జన్మదినోత్సవమైన అక్టోబర్ రెండో తేదీన కేంద్ర మంత్రివర్గం దీన్ని లాంఛనంగా ఆమోదిస్తుంది. పారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రకాశ్ జవదేకర్ ఇక్కడ విలేఖరులకు వెల్లడించారు. పారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదించవలసి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కొన్ని రోజులకే కేంద్ర మంత్రివర్గం ఈ ఒప్పందాన్ని ఆమోదించాలని నిర్ణయం తీసుకుంది.

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: పండుగల సీజన్ ముందుండటంతో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విధంగా 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లించడం వరుసగా ఇది అయిదోసారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఇక్కడ సమావేశమైన కేంద్ర క్యాబినెట్ రైల్వేలో 2015-16 సంవత్సరానికి నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పత్తితో అనుసంధానమైన బోనస్ (పిఎల్‌బి)ను డెబ్బై ఎనిమిది రోజుల వేతనానికి సమానంగా చెల్లించాలనే ప్రతిపాదనను ఆమోదించింది. ప్రతి సంవత్సరం దసరా పండుగకు ముందు సుమారు పనె్నండు లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఈ బోనస్‌ను అందుకుంటారు.

Pages