నిజమైన శక్తి (కథ)
Published Saturday, 24 September 2016‘ఓ ఐస్‌క్రీం కొనుక్కోరా!’ అని అమ్మమ్మ రాజుకి ఓ వంద కాగితం ఇచ్చింది.
రాజుకి వంద నోటు చూడగానే ఎలా ఖర్చు చేయాలో తెలియలేదు. ఏం చేద్దామా అని ఆలోచించాడు కాసేపు. వాడికి తిండి మీద కంటే ఆటల మీద ధ్యాస. ఆటలంటే అంత ఇష్టం. వంద నోటు జేబులో పెట్టుకుని పార్క్‌కి పరుగెత్తాడు. అక్కడ కాసేపు ఆడుకొని, టాయ్ ట్రైన్, మినీ జైంట్ వీల్ ఎక్కాలని ప్లాన్ వేసుకున్నాడు. పార్క్ గేటు వద్ద వాచ్‌మేన్ ఆపాడు. ‘టిక్కెట్ తీసుకొని రా...’ గట్టిగానే చెప్పాడు.
టికెట్ కౌంటర్ దగ్గర బాగా రష్‌గా ఉంది. తన ఎత్తుకి కౌంటర్‌లో వున్నతను కనపడలేదు. ‘వన్ టికెట్ ప్లీజ్!’ గట్టిగా అరిచాడు.