S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటం కథల గుడారంలో కలుద్దాం

రేపు పనె్నండు పటం కథల ప్రదర్శన. కథాగాన కార్యక్రమం. 3 గజాలనుండి 12 గజాల పొడవు వెడల్పుగల పటాలను హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని సిడాస్ట్ ఒక్క చోటుకు తెప్పిస్తున్నది. ఇలాంటి కార్యక్రమం మునుపెన్నడూ జరుగలేదు. పటాలు పుట్టిన వేలేండ్ల నుండి కూడా ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదా? వచ్చికూడా ఒక చోట చేర్చి చూడాలని అనిపించలేదు.
ఎందువల్ల సాధ్యం కాలేదో?
కారణాలు బలీయంగానే ఉండి ఉంటాయి.
అలాంటి ఆ పటాల గురించి ఈ వారం మీతో..

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242

వరద బాధితుల గాథలు

‘‘ప్రపంచం చాలా మారిపోయిందన్నయ్యా!’’
‘‘ చిన్న వయసులో అంత వైరాగ్యం’’
‘‘మీడియాలో ఉన్నందుకు మనకు అన్నీ తెలుస్తాయనుకుంటాం. ఏ స్టోరీని ఎలా కవర్ చేయాలనుకుంటే ప్రపంచం అలానే ఉందనుకుంటాం. కానీ కాదన్నయ్యా ప్రపంచం చాలా మారిపోయింది.’’
‘‘ఏమైంది?’’

రామ బాణం

పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చివరకు కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వాదన ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ముందుగానే ఒక అంచనాకు వచ్చి మీడియా వార్తలపై ఆధారపడి దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. అయితే ఎవరూ ఊహించని విధంగా తమ వాదనకు మద్దతుగా చివరకు మోదీ ప్రసంగానే్న కెసిఆర్ ఉపయోగించుకోవడంతో అంతా విస్తుపోయారు. సాధారణ ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

కాశీ ఖండం..21

ఆమాట ఇప్పుడు వాస్తవం అయింది. నేను ఈ రీతిగా అశోక మనస్థితిలో వుండగా వూహించని విధంగా ఇదె గొప్ప విఘ్నములు కలిగాయి. విశే్వశ్వర స్వామి నా యెడ విముఖుడు అయాడు సుమా! అట్లు కాని పక్షంలో సకల జీవులకి మోక్ష సంపదకి నిలయం అయిన కాశీక్షేత్ర వియోగ రూప దుఃఖార్తి ఏ విధంగా సంభవిస్తుంది?
తన అరచేతి అన్నపు ముద్దను జారవిడిచి మోచేతిని నాకే వెంగలివిత్తు కూళ మాదిరిగా ఇహపర లోక భోగ మోక్షాలకి పుట్టిల్లు అయిన కాశీ క్షేత్రం వదలి నరుడు అన్య దేశం అరుగుతాడు?

శ్రీపాద కృష్ణమూర్తి

వినాశహేతువు

విదురుడు ధృతరాష్ట్రునితో ‘‘్ధర్మరాజు అజాతశత్రువు. మీరు దుశ్శాసనుణ్ణి పంపి ఆయనకు తమ పక్షాన క్షమాపణ కోరమని చెప్పండి. రాజ్యము సింహాసనము ధర్మరాజుకు అప్పగించండి’’ అని హితబోధ చేశాడు. పుత్ర ప్రేమకు వివశుడైన ధృతరాష్ట్రుడు ఎవరి సలహాలను వినే దశలో లేడు. ‘నీవు పాండవ అభిమానివి. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే నీవు కూడా అడవులకు వాళ్ళతోనే ఉండిపో’ అని అన్న మాటలకు కలత చెందిన విదురుడు కామాక్యవనం ప్రవేశించి ధర్మజునితో తనకు జరిగిన పరాభవాన్ని వివరించి కొద్దిరోజులు వారితో అక్కడే వుండిపోయాడు.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం

ఒయాసిస్- 31

ఆమె మరింత సామీప్యానికి వచ్చింది. కటి వస్తమ్రూ గాలికి ఎగిరిపోయింది. అయినా అందరూ బ్రహ్మ పాదాలపై నుంచి దృష్టి మళ్లించలేదు. రాజుగారు మాత్రం ఆమె నగ్న శరీరానే్న చూస్తున్నాడు. ఆ అపురూప సౌందర్యరాశి నిమోన్నతాలనూ, పృధు వక్షోజాలనూ, జఘనాలనూ చూస్తూ పరవశించిపోయాడు. ఊ కొట్టండి..’’
‘‘ఊ... ఊ...’’

శ్రీధర

నేర్చుకుందాం

క. ధృతిమెయి శతసంఖ్యయు దశ
శతసంఖ్యయు శతసహస్ర సంఖ్యయును శతా
యుత సంఖ్యయుఁగా దేవ
వ్రతు మీఁదను సాల్వుఁడేసి వాఁడి శరంబుల్

mataata

mataata

Pages