S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలో అమ్మడు!

ఈ ఫొటోను పరీక్షగా చూడండి. అందమైన బొమ్మలో..అందులోని రంగులనే మేనికి వేసుకుని కలసిపోయినట్లు ఫోజిచ్చిన ఓ అమ్మడు కన్పిస్తుంది. ఔనా! జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్టిస్ట్ షిగెకి మత్సుయమ ఈ చిత్రాన్ని వేశారు. ‘రూమ్స్33’ సంస్థ సారథ్యంలో ప్రతి ఆరునెలలకు ఓమారు నిర్వహించే ఫ్యాషన్ అండ్ డిజైన్ ట్రేడ్ షోలో ఇలాంటి ఎగ్జిబిట్స్ వందల్లో వస్తాయి. ఈసారి టోక్యోలో నిర్వహించిన షోలో 500 ఎగ్జిబిట్స్ రాగా షిగెకి ‘నార్సిస్సిజమ్’ పేరుతో ప్రదర్శించిన పై చిత్రం అందరినీ ఆకట్టుకుంది. అన్నట్లు ఈ షోకు దాదాపు 20వేలమంది సందర్శకులు వచ్చారంటే దీని ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది.

భారతి

ఎడారిలో ఆనందం

సాంకేతికత, కళాత్మకత కలగలసిన అందమైన రూపాలు అక్కడ దర్శనమిస్తాయి. అమెరికాలోని నెవెడ ఎడారి ప్రాంతంలో ప్రతి ఆగస్టు చివరి సోమవారం, సెప్టెంబర్ మొదటి సోమవారం మధ్య జరిగే జాతరలో ఈ అపురూపమైన కళాకృతులు కనువిందు చేస్తాయి. ఏటా నెవెడాలో జరిగే ‘బర్నింగ్‌మ్యాన్’ వేడుకకు ఈసారి 70వేలమంది హాజరయ్యారు. ఇటలీలో ఎప్పుడో మూడు శతాబ్దాల క్రితం సామాజిక, సాంకేతిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు కారణమైన అంశాలను ప్రతిబింబించేలా ఈసారి కళాకృతులు రూపొందించారు. అలనాటి సంస్కృతీ వైభవాన్ని చాటేలా కళాకారులు తమ ప్రతిభను చాటారు. అలాంటివాటిలో ఎక్కువమందిని ఆకర్షించిన ఈ బ్లూవేల్ ఒకటి.

భారతి

ఎలా వుందీ వారం? (సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 1 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
స్వశక్తితో కార్యానుకూలత. వృత్తి, వ్యాపార, ప్రయాణ సాధనాల ఏజెన్సీలు, సాంకేతిక రంగాల వారు ఉల్లాసంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాదులందు కదలికలుంటాయి. ప్రయాణాలలో సౌకర్యాల లేమి ఉన్నప్పటికీ ప్రయోజనాలుంటాయి. వెంటాడే సన్నిహితులను ఒక కంట కనిపెట్టండి. నూతన వ్యాపారపు భావనలు వాయిదా వేసుకోవాలి. తగుమాత్రం ఆదాయం ఉంటుంది. అదనపు ఖర్చులకై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు శ్రమపై అనుకున్నవి అందుకుంటారు. అవసరమైన వస్తువులను సమకూర్చుకుంటారు.
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855

మహావిజేత.. 22

చంద్రహాసుడు లేఖను స్వీకరించి బయలుదేరాడు.
చంద్రహాసుడు - ఆకాశవాయు తత్త్వ సమ్మిళిత స్వభావం కలవాడు. శక్తి సామర్థ్యాలూ, చింతనా, శాంతం వంటి గుణ విశేషాలు - ఆ స్వభావం కలవారి అంతస్సత్యాలు! అవే వారి పురోగమనానికి చోదకశక్తి!
చంద్రహాసుని జననాశ్వం కుంతలపురి వైపు ఉత్సాహంగా పరుగులు తీస్తోంది!
58
ఆశ్వయుజ బహుళ తదియ!

-విహారి 98480 25600

ప్చ్..శ్రీయ!

అంటున్నారంతా. అందుకు కారణం లేకపోలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించడమేగాక, ఆయా భాషల్లో అగ్ర నటులతో ఆడిపాడింది శ్రీయ. అయితే చాలా కాలం తర్వాత శ్రీయ బాలయ్య సరసన ఓ క్యారెక్టర్ చేస్తుండడమే ఇందుకు కారణమైంది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య టైటిల్ పాత్రలో రూపుదిద్దుకుంటున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతో చారిత్రాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన వశిష్టీదేవి పాత్రను శ్రీయ పోషిస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా దర్శకుడు అనుష్కను, నయనతారను సంప్రదించారు. వాళ్లిద్దరూ ఈ పాత్రను పోషించేందుకు ససేమిరా అన్నారట.

-సమీర్

నిలదొక్కుకుంటా!

బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటానంటోంది అందాల తార తాప్సీ. టాలీవుడ్, కోలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో అందర్నీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ తాప్సీ టార్గెట్ బాలీవుడ్డేనట. వినడానికి ఆశ్చర్యంగా వున్నా..ఇది నిజమేనట. తెలుగులో ముఖ్యంగా తన గ్లామర్‌తో యువతను కట్టిపడేసిన ఈ సుందరాంగి కెరీర్ చూస్తున్నంతలోనే అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా బాలీవుడ్‌లో ‘పింక్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో బిగ్‌బి అమితాబ్ నటిస్తున్నారు. ‘‘తెలుగులో మంచి పాత్రలు చేశాను. నటనతో అందర్నీ గెలుచుకున్నా. అలాగే బాలీవుడ్‌లో ఎలాగైనా నెట్టుకొస్తానన్న గట్టి నమ్మకం నాకుంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నా.

-సమీర్

వైవిధ్యమే రక్ష!

టాలీవుడ్‌లో లావణ్య త్రిపాఠి బిజీ బిజీగా మారబోతోంది. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలున్నాయి. మరో రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. టాలీవుడ్‌లో ప్రవేశిస్తున్న తారలంతా ముందుగా గ్లామర్ పాత్రలవైపే చూస్తున్నారు. గ్లామరే కెరీర్‌ను రక్షిస్తుందని కలలు కూడా కంటున్నారు. కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే గ్లామర్‌తో యువతను కట్టిపడేయాలనుకుంటున్నారు. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అంటోందిట. ఈ విషయం గురించే చెబుతూ- ‘‘ఏ నటి అయినా కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే వైవిధ్యమైన పాత్రలు చేయాలి. అలాంటప్పుడే నటికి భవిష్యత్తు వుంటుంది. కెరీర్‌లో ఎదిగేందుకు అలాంటి పాత్రలే దోహదపడతాయి.

-సమీర్

రైల్వేజోన్ కోసం విశాఖలో భారీ ర్యాలీ

విశాఖ : ప్రత్యేక రైల్వే జోన్‌ కోసం శనివారం విశాఖలో అక్కయ్యపాలెం నుంచి రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగానే విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కేంద్రంతో చర్చించి విశాఖకు రైల్వే జోన్ వచ్చేందుకు కృషి చేయాలని వారు కోరారు.

వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్‌ సర్వే

విజయవాడ: గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విహంగ వీక్షణం చేశారు. అనంతరం గురజాల, పెదకూరపాడు, నరసరావుపేట, మాచర్లలో పర్యటించారు. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులను, రెడ్డిగూడెం వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం గుంటూరు కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

జిందగీ ఛానల్‌లో పాకిస్థానీ షోలు నిలిపివేసే యోచన

దిల్లీ: జిందగీ ఛానల్‌లో అన్ని పాకిస్థానీ షోలు నిలిపివేసే యోచనలో ఉన్నామని జీ మీడియా, ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర గోయెల్‌ ట్వీట్‌ చేశారు. ఉరీలో ఉగ్రవాద దాడి ఘటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున భారత్‌లోని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన జిందగీ ఛానల్‌లో పాకిస్థానీ షోలు నిలిపి వేసే యోచనలో ఉంది. పాకిస్థాన్‌ ఆర్టిస్ట్‌లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన అన్నారు.

Pages