S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజల్ ప్రేమ ఎంతవరకు?

డి.కె. దర్శకత్వంలో జీవా, కాజల్ అగర్వాల్ జంటగా తమిళంలో రూపొందించిన చిత్రానికి తెలుగులో ‘ఎంత వరకు ఈ ప్రేమ’ అన్న పేరును ఖరారు చేశారు. డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగులో అనువదిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. కాజల్ అగర్వాల్ తమిళంలో నటించిన ఈ చిత్రంపై అక్కడ భారీ అంచనాలు నెలకొన్నాయని, తెలుగులో కథనుబట్టి ఎంత వరకు ఈ ప్రేమ అన్న పేరును నిర్ణయించామని, వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.

ప్రేమకు శ్రీరామరక్ష

రజిత్, షామిలి, నిషా ప్రధాన తారాగణంగా వశిష్ట సినీ అకాడమీ పతాకంపై రాము దర్శకత్వంలో ప్రభాత్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీరామరక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పూర్తిచేసి, పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించే ఈ చిత్రంలో సామాజిక బాధ్యతను యువతకు తెలియజేసే అంశాలను కూడా ప్రస్తావిస్తున్నామని, త్వరలోనే ఫస్ట్‌లుక్ విడుదల చేసి, ప్రేక్షకుల ముందుకు రానున్నామని తెలిపారు. ప్రేమికులకు ‘శ్రీరామరక్ష’గా నిలిచే అంశం ఏమిటి? అన్న కథనంతో సాగే ఈ చిత్రం యువతకు నచ్చుతుందని, పాటలకు మంచి క్లిక్స్ వస్తాయని వారు తెలిపారు.

పూర్వజన్మలో నాగభరణం

కోడి రామకృష్ణ దర్శకత్వంలో గతంలో వచ్చిన అమ్మోరు, అరుంధతి చిత్రాల స్థాయిలో రూపొందించిన మరో చిత్రం నాగభరణం. రమ్య ప్రధాన పాత్రలో కన్నడంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. విజువల్ వండర్‌గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగిస్తాయని, కన్నడంలో విజయవంతమైనట్లుగానే తెలుగులో కూడా సంచలనం సృష్టించడం ఖాయమని ఆయన అన్నారు. త్వరలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని, మకుట సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు.

ముంపు ప్రాంతాల్లో కేటీఆర్‌ పర్యటన

హైదరాబాద్‌: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. అల్వాల్‌లో స్థానికులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. అల్వాల్‌, మోత్కుంటలో చెరువులు, నాలాలను పరిశీలించారు. అధికారులు చేపడుతున్న సహాయచర్యలను సమీక్షించారు. ట్యాంక్‌బండ్‌ వద్ద హుస్సేన్‌సాగర్‌లో నీటి పరిస్థితిని పరిశీలించారు.

నల్లవాగులో చిక్కుకున్న రెండు లారీలు

నిజామాబాద్‌: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగరావుపల్లి వద్ద వంతెన పైనుంచి నల్లవాగు ఉరకలెత్తుతోంది. హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌ వెళ్తున్న రెండు లారీలు శుక్రవారం వంతెన దాటుతూ వరదలో చిక్కుకున్నాయి. లారీలలో ఉన్న నలుగురు వ్యక్తులు తమను కాపాడాలని హాహాకారాలు చేస్తున్నారు. అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇండిగో విమానంలో పేలిన సామ్‌సంగ్‌ ఫోన్‌

చెన్నై: సింగపూర్‌ నుంచి వస్తున్న ఇండిగో విమానం శుక్రవారం చెన్నైలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో సామ్‌సంగ్‌ నోట్‌2 ఫోన్‌ పేలడంతో విమానంలో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు పేర్కొన్నారు. వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు సామ్‌సంగ్‌ సంస్థకు సమన్లు జారీచేశారు. సామ్‌సంగ్‌ నోట్‌ ఫోన్లను అనుమతించొద్దని డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలకు సూచనలు జారీచేసింది.

రూ.20 లక్షల్లోపు టర్నోవర్‌ ఉన్నవారికి జీఎస్‌టీ నుంచి మినహాయింపు

దిల్లీ: దేశంలో వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) అమలుకు సంబంధించి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన రెండో రోజూ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఎంత ఆదాయ పరిమితిని విధించాలనే దానిపై చర్చించారు. ఆదాయ పరిమితిని రూ.20లక్షలుగా నిర్ణయించినట్లు జైట్లీ వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల్లో ఉన్న వారికి ఈ పరిమితిని రూ.10లక్షలుగా ఖరారు చేసినట్లు తెలిపారు. వ్యాపారుల వార్షిక ఆదాయం ఈ పరిమితి కన్నా తక్కువగా ఉంటే ప్రత్యక్ష పన్నుల పరిధిలోకిరారు. రూ.20లక్షల టర్నోవర్‌ పైబడిన వారికి జీఎస్‌టీ వర్తించనుంది.

ఏసీబీ వలలో పౌరసరఫరాల శాఖ అధికారి

కాకినాడ: రూ. 20 వేలు లంచం తీసుకుంటున్న పౌరసరఫరాలశాఖ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ రాజ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు మండలం పేకేరు గ్రామానికి చెందిన బలరామకృష్ణ బియ్యాన్ని ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు వర్క్‌ ఆర్డర్‌ కోసం కొద్దిరోజులుగా రాజ్‌కుమార్‌ను కలుస్తున్నాడు. వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వాలంటే రూ.30వేలు లంచం ఇవ్వాలని రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశాడు. రూ.20వేల ఇచ్చేందుకు అంగీకరించిన బలరామకృష్ణ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రాజ్‌కుమార్‌ను రేపు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీసు కస్టడీకి నయీం అనుచరులు

హైదరాబాద్‌: చర్లపల్లి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులు ఫహీం, మాజీ మావోయిస్టు టెక్‌మధును శంషాబాద్‌ విమానాశ్రయం పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి ఈనెల 29వరకు కస్టడీలోకి తీసుకుని, నయీం ఆయుధాల సరఫరాలపై వివరాలు సేకరించనున్నారు.

పోలీస్‌స్టేషన్‌ ఖాళీ చేయాలని నోటీసులు

హైదరాబాద్‌: శిథిలావస్థలో భవనం ఉన్నందున రామ్‌గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ను ఖాళీ చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాన్నిశుక్రవారం పరిశీలించారు. భవనం ఖాళీ చేయాలని పురపాలక శాఖ నోటీసులు జారీచేసింది.

Pages