S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రతపై పుస్తకావిష్కరణ

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 22: దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో గురువారం ఆయన దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతపై ముద్రించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దోమలు, వ్యాధుల నివారణ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటంతో పాటు వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల సహకారంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధులను నిర్మూలించాలన్నారు. డెంగీ లక్షణాలు గల చోట్ల దోమల మందును పిచికారి చేయాలన్నారు. వారానికి ఒకసారి పాగింగ్, పరిసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

‘మరోసారి సిఎంఆర్ ధాన్యం దోపిడీకి రంగం సిద్ధం’

కోవూరు, సెప్టెంబర్ 22: సిఎంఆర్ ధాన్యం సేకరించిన మిల్లర్లు ఇంకా గత సీజన్‌కు సంబంధించి దాదాపు 25 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి బకాయి ఉన్నా వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని కోవూరు నియోజకవర్గ లోక్‌సత్తా పార్టీ ఇన్‌చార్జ్ నెల్లూరు నరసయ్య పేర్కొన్నారు. కోవూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రైతులతో కలసి ఆయన మాట్లాడుతూ ఈనేపథ్యంలో మరోమారు నెల్లూరు, కడప జిల్లాల మిల్లర్లు తమదైన శైలిలో అధికారులను ప్రసన్నం చేసుకొని ఎటువంటి బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం వారి మిల్లులకు తరలించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

వైభవంగా ముగిసిన పోలేరమ్మ జాతర

వెంకటగిరి, సెప్టెంబర్ 22: వేలాది భక్తకోటి మధ్య గురువారం సాయంత్రం వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ నిమజ్జనోత్సవం వైభవంగా ముగిసింది. ప్రతియేటా మాదిరిగా సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జాతర జరిగింది. బుధవారం రాత్రి అమ్మవారి ప్రతిమను పుట్టినిల్లయిన కుమ్మరివీధిలో తయారుచేసి అక్కడ రాత్రి పదకొండు గంటల వరకు ఉంచారు. అక్కడ నుంచి అమ్మవారిని అత్తవారి ఇల్లయిన జీనిగలవారి వీధికి నిరాడంబరంగా తీసుకెళ్లారు. సాంప్రదాయబద్ధంగా కాంపాళెం గాలిగంగలు రాగానే అమ్మవారికి కళ్లు, దిష్టిచుక్కు పెట్టి వేలాది మంది భక్తుల నడుమ అమ్మవారిని పట్టణ నడిబొడ్డునున్న ఆలయం వద్దకు తెల్లవారుజామున మూడు గంటలకు పోలేరమ్మను తీసుకొస్తారు.

‘పురం’లో ముగ్గురికి డెంగ్యూ!

హిందూపురం టౌన్, సెప్టెంబర్ 22 : పట్టణంలో ముగ్గురికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 మందికి, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఐదుగురికి డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పట్టణంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన ఒకరికి, మడకశిర ప్రాంతానికి చెందిన ఇద్దరికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అహ్మద్‌నగర్‌లో డెం గ్యూ వ్యాధి సోకినట్లు రుజువు కావడంతో అటు వైద్యాధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈసారైనా ‘్భసార’ ఫలితాలు సకాలంలో అందేనా!

అనంతపురం, సెప్టెంబర్ 22 : ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశెనగ పంట తొలగింపు పూర్తి కానున్న నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ఉచిత భూసార పరీక్షలు నిర్వహించేందుకు భూసార పరీక్ష కేంద్రం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈఏడాది డిసెంబర్ వరకూ 58వేల శ్యాంపిల్స్ (మట్టి నమూనాలు) పరీక్షించి ఇందుకు సంబంధించిన కార్డులు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నాటికి ఇందుకు సంబంధించిన ఫలితాల పత్రాల (సాయిల్ హెల్త్ కార్డ్స్)ను రైతులను అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం భూసార పరీక్షలు ఉచితంగా నిర్వహించి రైతులకు ప్రత్యేకంగా సాయిల్ హెల్త్ కార్డులను అందజేస్తోంది.

ముమ్మరం కానున్న గడపగడపకూ వైకాపా

అనంతపురం, సెప్టెంబర్ 22 : ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇప్పటికే కార్యక్రమం అమలులో ఉన్నా నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిల్లో నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా పార్టీ శ్రేణులు ఆశించిన మేరకు పాల్గొనడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న మున్సిపల్, స్థానిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీని సమాయత్తం చేయడమే ‘గడపగడపకూ’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పటి వరకు కార్యక్రమం చాలాచోట్ల మందకొడిగా సాగుతోంది.

ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరుకు నివేదికలు పంపండి..

అనంతపురంటౌన్, సెప్టెంబర్ 22: వరుస కరవులకుతోడు వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీకై నివేదికలు పంపి ఆదుకునేలా చర్యలు చేపట్టాలని వ్యవసా య స్థారుూ సంఘ తాత్కాలిక అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి కోరారు. గురువారం జడ్.పి హాలులో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహి ంచారు. ఇతర స్థారుూ సంఘాలకు జడ్.పి చైర్మన్ చమన్ అధ్యక్షత వహించారు. వ్యవసాయ స్థారుూ సంఘం లో రెయిన్‌గన్లపై చర్చ జరిగింది. వ్యవసాయ శాఖ జె.డి రామ్మూర్తి మాట్లాడుతూ జిల్లాకు 11 వేల రెయిన్‌గన్లకై ప్రతిపాదనలు పంపామన్నారు. రెయిన్‌గన్లతో పంటలు ఎండిపోకుండా కా పాడేందుకు చర్యలు చేపట్టామన్నారు.

రైల్వేల పరిరక్షణకు నిరంతర కృషి

గుంతకల్లు, సెప్టెంబర్ 22 : రైల్వే ఆస్థుల పరిరక్షణ, ప్రయాణికులకు భద్రత కోసం రైల్వే రక్షక దళం నిరంతరం ఎనలేని సేవలు అందిస్తోందని గుంతకల్లు డివిజినల్ రైల్వే మేనేజర్ అమితాబ్‌ఓజా అన్నారు. గురువారం స్థానిక రైల్వే గ్రౌండ్‌లో ఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఎం ఆర్పీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్పీఎఫ్ సిబ్బంది రైళ్లలో రాత్రింబవళ్లు గస్తీ నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు నేరస్థులు పట్ల ప్రయాణికులను అప్రమత్తం చేయడంతోపాటు నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారన్నారు.

హోటళ్లు, శుద్ధిజలాల ప్లాంట్లపై దాడులు

ధర్మవరం, సెప్టెంబర్ 22: జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో మున్సిపల్ ఛైర్మన్ బీరే గోపాలకృష్ణ, వైస్ ఛైర్మన్ శ్రీనివాసులుతోపాటు కమిషనర్ నాగమోహన్, సిబ్బంది గురువారం పట్టణంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చికెన్ సెంటర్లు, హోటళ్లు, శుద్ధి జలాల ప్లాంట్లను తనిఖీ చేసి పరిశుభ్రతపై వారిని హెచ్చరించి పరిశుభ్రత లోపిస్తే మూసివేయిస్తామని హెచ్చరించారు.

గ్రామాల్లో ఎమ్మెల్యే జెసి పర్యటన

పెద్దవడుగూరు, సెప్టెంబర్ 22 : మండలంలోని కాసేపల్లి, గుత్తిఅనంతపురం, ఆవులాంపల్లి, కొత్తపల్లి, విరుపాపురం, జి వెంకటాంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే జెసిప్రభాకర్‌రెడ్డి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంటలను కాపాడుకోవడానికి రైతులు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఎఓ రూపత్‌రొనాల్డ్‌ను ఆదేశించారు. అవులాంపల్లిలో మహిళలు మరుగుదొడ్ల నిర్మాణం బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా బిల్లులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.

Pages