S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాహనసేవలతో పాటు సంతృప్తికరంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు

తిరుమల, సెప్టెంబర్ 22: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలో మాడ వీధులతోపాటు వాహనాల పార్కింగ్ ఏర్పాటుకోసం పలు ప్రాంతాలను జె ఇ ఓ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జె ఇ ఓ మీడియాతో మాట్లాడుతూ వాహనసేవలు వీక్షించేందుకు వచ్చే భక్తులకు మాడ వీధుల్లో గతేడాది తరహాలోనే గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మాడ వీధుల్లో ఐదు చోట్ల శాశ్వతంగా మరుగుదొడ్లు నిర్మించినట్లు చెప్పారు.

ప్రభుత్వాలకు ప్రజలే గుణపాఠం చెబుతారు

ఓజిలి, సెప్టెంబర్ 22: ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతా మోహన్ హెచ్చరించారు. మండల కేంద్రమైన ఓజిలిలో గురువారం చింతా మోహన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా నేటికీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన దానికి భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని విమర్శించారు.

అలరించిన అలకల దోపు

చిట్టమూరు, సెప్టెంబర్ 22: మండలంలోని మల్లాం గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి అలకల తోపు భక్తులను ఎంతగానో అలరించింది. రాజు వేటకు వెళ్లే సమయంలో దొంగలు నగలు దోచుకెళ్లడం, దొర దొంగలను పట్టించే విధానాన్ని వేదపండితుల మంత్రాలు, ప్రత్యేక వేషధారణలతో నాటకీయ ఫక్కీలో దొర దొంగలను తరిమికొట్టడం కోలాహలంగా జరిగింది. అనంతరం వల్లీ అమ్మవారి పరిణయం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీకాళహస్తికి చెందిన లాస్య తరంగిణి నృత్యాలయం మాస్టర్ బాలాజీ వారిచే భరతనాట్యం ఆహూతులను అలరించింది.

మత్స్యకారుల వలలో భారీ చేప

తడ, సెప్టెంబర్ 22: పులికాట్‌లో చేపల వేటకు వెళ్లిన జాలర్ల వలకు భారీ చేప చిక్కింది. సముద్రంలో ఉండే 150 కిలోల బరువు గల టేకి చేప వలకు చిక్కడంతో రామాపురం మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పట్టుబడిన చేపను ఒడ్డుకు చేర్చడంతో స్థానికులు, మత్స్యకారులు ఆసక్తిగా తిలకించారు.

మార్కెట్‌లోకి నకిలీ మందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి:కలెక్టర్

నెల్లూరు, సెప్టెంబర్ 22: వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, నకిలీ ఎరువులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో వ్యవసాయాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగం ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తుందని, నకిలీవి మార్కెట్‌లోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, నకిలీ ఎరువులు అమ్మితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

బురాన్‌పూర్‌లో ఇల్లు ధ్వంసం

వెంకటాచలం, సెప్టెంబర్ 22: మండల పరిధిలోని చెముడుగుంటకు చెందిన పామూరు కృష్ణారెడ్డి ఇంటిలోకి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి ధ్వంసం చేశారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గత కొద్ది నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు రవికుమార్ యాదవ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందుతుడిగా ఉన్న కృష్ణారెడ్డి పరారీలో ఉండగా అతని తల్లి, మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. రవికుమార్ యాదవ్ ఇంటిపక్కనే ఉన్న కృష్ణారెడ్డి ఇల్లు, అతని బాబాయి ఇంట్లో అప్పటి నుండి ఎవరూ లేరు.

దడ పుట్టిస్తున్న దోమలు

నెల్లూరు, సెప్టెంబర్ 22: ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు, తాగి పారేసిన కొబ్బరిబొండాల నిల్వలు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు, కాలువల ఆక్రమణలతో రహదారులపైనే మురుగునీరు ప్రవాహంతో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. ఈక్రమంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారడంతో దోమల సంతతి పెరిగిపోయి నెల్లూరు నగర ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. గత రెండేళ్లలో పారిశుద్ధ్యానికి రూ.కోట్లు నిధులు ఖర్చు చేశారు. కేంద్ర, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఈ జిల్లాకు చెందినవారే. వీరు ప్రజల సమస్యలు వింటారు. సానుకూలంగా స్పందిస్తారు. వచ్చిన చిక్కల్లా వర్షం ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడినప్పుడే నెల్లూరు అసలు రంగు బయటపడుతుంది.

స్వర్ణాల చెరువును తనిఖీ చేసిన మంత్రి నారాయణ

నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 22: బారాషాహిద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ సందర్భంగా స్వర్ణాల చెరువులో జరిగే ఘాట్ పనులను రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల నుండి కుల, మతాలకు అతీతంగా రొట్టెల పండుగకు దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అన్నారు. ఈ పండుగకు రాష్ట్ర గుర్తింపు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గోదావరి, కృష్ణ పుష్కరాలను ఎంతో శ్రద్ధగా చేశామన్నారు. ఇక్కడ కూడా అంతే శ్రద్ధతో పండుగ ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఖాదీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం

నెల్లూరుటౌన్, సెప్టెంబర్ 22 : దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖాదీ వస్త్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఖాదీ, గ్రామీణ పరిశ్రల దక్షిణ రాష్ట్రాల చైర్మన్ జి.చంద్రవౌళి పేర్కొన్నారు. నెల్లూరులోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చంద్రవౌళి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ నుంచి ఖాదీ అంటే ఎంతో మక్కువ అని, కాలక్రమేణ పాశ్చాత్య సంస్కృతి కారణంగా దేశంలో ఖాదీ వెనుకబడిపోయిందన్నారు.

దత్తత గ్రామాల కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి:కలెక్టర్

నెల్లూరు కలెక్టరేట్, సెప్టెంబర్ 22: జిల్లాలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమాల అమలులో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న తన ఛాంబర్‌లో ఆకర్షణీయ గ్రామాలు, వార్డుల కార్యక్రమాల అమలుపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిథులు దత్తత తీసుకున్న గ్రామాలలో ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు.

Pages