S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాధుల భయం

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నగరంలో కురుస్తోన్న వర్షాల కారణంగా నాలాలు, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలు కాలనీ రోడ్లు, మెయిన్ రోడ్లలోనూ మురుగు నీరు నిల్చి ఉండటంతో దోమల వృద్ధి చెంది ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయోనన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత మాసం కూడా అడపాదడపా కురిసిన వర్షాల కారణంగా వాతారణం చల్లబడి డెంగీ, స్వైన్‌ఫ్లూ, మలేరియా, డయేరియా వ్యాధుల అనుమానిత లక్షణాలతో ప్రతి ప్రాంతంలో వందల సంఖ్యలో ప్రజలు అనార్యోం బారిన పడిన సంగతి తెలిసిందే!

ప్రజాభిప్రాయం మేరకే కొత్త జిల్లాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుందని రవాణా శాఖా మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో గత కొద్ది రోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల చేర్పుల మార్పులపై జరుగుతున్న ఆందోళనలకు స్వస్తి పలికేవిధంగా మంత్రి స్పష్టత ఇచ్చారు.

సమన్వయంతో నిరంతరం అప్రమత్తం

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మహానగరానికి భారీ వర్షాలు సూచన ఉండటంతో ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి సిఎం కెసిఆర్‌కు వివరించారు.
భారీ వర్షాలు ప్రారంభమైన బుధవారం ఉదయం నుంచి దిల్లీలో ఉన్న కెసిఆర్ ప్రతి రెండు గంటలకు ఓ సారి మున్సిపల్ మంత్రి కెటిఆర్, కమిషనర్ జనార్దన్ రెడ్డిలకు ఫోన్ చేస్తూ ఎప్పటికపుడు సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం కూడా సిఎం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆయనకు ఫోన్‌లో పలు చర్యల గురించి వివరించారు.

రోడ్డు సేఫ్టీకి ప్రత్యేక సెల్

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రోడ్డు రవాణా శాఖలో దళారుల వ్యవస్థను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను ప్రారంభించిందని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ డిల్లీలో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రితో పలు అంశాలపై చర్చించామని, రవాణా శాఖ పని తీరుపై తెలంగాణ సర్కార్‌కు ఘన సన్మానం లభించిందని అన్నారు.

సురక్షిత ప్రాంతాలకు తరలండి

హైదరాబాద్/ జీడిమెట్ల, సెప్టెంబర్ 22: ప్రకృతి విపత్తుతో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి 72 గంటల సమయం పడుతుందని, ప్రజలు సహకరించి అపార్ట్‌మెంట్‌ల నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జలమయమైన నిజాంపేట్ గ్రామం బండారి లేఅవుట్ కాలనీలో గురువారం మంత్రి గంటన్నర సేపునకు పైగా పర్యటించారు.

వైద్య సిబ్బంది అప్రమత్తం

హైదరాబాద్ : వర్షాల వల్ల అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి సూచించారు. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా అన్ని విధాలుగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్ని వైద్య శాలల్లో ఔట్ పేషెంట్ కౌంటర్లను పెంచాలని చెప్పారు. అదే విధంగా ఔట్ పేషెంట్ కౌంటర్లలో పని వేళలలను కూడా పెంచాలని సూచించారు. ఓపిలో చివరి పేషంట్ వరకు వైద్య సేవ అందించాలని చెప్పారు. మందుల కొరత లేదని, వైద్య శాలల వారిగా అవసరమైన మందులను వెంటనే తెప్పించుకోవాలని లక్ష్మారెడ్డి సూచించారు.

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

హైదరాబాద్, సెప్టెంబర్ 22: భారీ వర్షం గురువారం కూడా నగరాన్ని అతలాకుతలం చేసింది. గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజలను అతలాకుతలం చేశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోందని, హైదరాబాద్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిజాంపేటలో పలు అపార్ట్‌మెంట్లు నీటిలో మునిగిపోయాయి. సెల్లార్ వరకు నీటితో మునిగిపోవడంతో అపార్ట్‌మెంట్‌పై అంతస్తుల్లో ఉన్నవారు కిందికి రాలేకపోయారు.

క్షణ క్షణం..ఉత్కంఠ

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌కు వరద నీటి ప్రవాహం పెరిగింది. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తుండటంతో పాటు తాజాగా గురువారం కురిసిన వర్షాల కారణంగా నీటి ఉద్ధృతి మరింత పెరిగింది. కూకట్‌పల్లి, పికెట్ నాలాలతో పాటు దుర్గం చెరువు నుంచి వచ్చే నాలాల వల్ల సాగర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరటంతో చెరువు దిగువ ప్రాంతాలైన అశోక్‌నగర్, అరుంధతినగర్, గాంధీనగర్, ఫీవర్ ఆసుపత్రి, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల ప్రజల్లో క్షణ క్షణం ఉత్కంఠ నెలకొంది.

‘నైరుతి ఉద్ధృతం’

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నైరుతీ రుతుపవనాలు తెలంగాణలో ఉద్ధృతంగానూ, ఆంధ్రప్రదేశ్‌లో చురుగ్గానూ ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఐఎండి శాస్తవ్రేత్త బిపి యాదవ్ పేరుతో గురువారం ఒక బులెటిన్ జారీ అయింది. కోస్తాంధ్రలో అల్పపీడన ప్రభావం స్థిరంగా ఉందని, 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల తుపాను ద్రోణి ఏర్పడి ఉందని, ఇది ఆగ్నేయదిశగా కదులుతోందని వివరించారు. ఈ పరిస్థితిలో తెలంగాణలో వచ్చే రెండురోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఆ తర్వాత మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

వర్షాల హోరు... కష్టాల జోరు

కరీంనగర్/ వరంగల్/ మహబూబ్‌నగర్/ నిజామాబాద్/ సంగారెడ్డి/ నల్గొండ, సెప్టెంబర్ 22: తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడం, నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిసేపు ముసురు, ఉన్నట్లుండి వర్షం కురుస్తూండటంతో ప్రజాజీవనం అస్తవ్యస్తం అవుతోంది. పంట పొలాలు, లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జిల్లాల వారీగా వర్షాకాలం కష్టాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాలో...

Pages