S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం

విజయవాడ, సెప్టెంబర్ 22: బిసిల్లో వేల మందిని యువ పారిశ్రామికవేత్తలుగా తయారుచేయటానికి 25 లక్షల రూపాయలతో చిన్న యూనిట్లను నెలకొల్పటానికి అవకాశం కల్పిస్తున్నట్లు బిసి సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సంచార జాతులకు చెందిన 26 కులాలను ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సాధికార సర్వే పూర్తిచేసిన తరువాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10వేల రూపాయలు లబ్ధి అందే విధంగా కృషి చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

కోటిన్నర టర్నోవర్ దాటే పరిశ్రమలపై రాష్ట్రాలకే పెత్తనం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: సంవత్సరానికి కోటిన్నర రూపాయిల టర్నోవర్ ఉన్న పరిశ్రమలు, సంస్థలన్నింటిపైనా రాష్ట్రాలకే నియంత్రణ ఉండాలని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి స్పష్టం చేశారు. గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఈటల రాజేందర్ హాజరైయ్యారు. జీఎస్టీ కౌన్సిల్ అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక మంత్రి ఉన్నందున ఉపాధ్యక్ష పదవిని ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తికి కేటాయించాలని కోరామన్నారు.

జిఎస్‌టి రేటు 20శాతానికి పెంచండి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జీఎస్టీ రేటు పరిధిని 18 శాతం నుంచి 20 శాతం ఉండేలా చూడాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్వర్యంలో జరిగిన జీఎస్టీ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరైయ్యారు. ఈ సమావేశంలో మూఖ్యంగా జీఎస్టీ రేటులో మినహాయింపులు ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు ఆయన తెలిపారు. కోటిన్నరకు పైగా వ్యాపార లావాదేవీలు జరిపే వ్యాపారుల నుంచి పన్ను వసూలు చేసుకోనే అధికారం పూర్తిగా రాష్ట్రాలకే ఉండాలని, ఈ విషయంలో కేంద్రం జోక్యం తగదని చెప్పామన్నారు.

ఆంధ్రాలో డిజిటల్ విప్లవం

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అవినీతి, అక్రమాలను , దళారీ వ్యవస్థను నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. పౌర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. మరో పక్క భూమి రికార్డులను డిజిటలైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఎవరి భూమి వారికే చెందేలా రాష్ట్రప్రభుత్వం మీ ఇంటికి మీ భూమి, ఈ పాస్ పుస్తకాల ప్రక్రియను ప్రారంభించింది. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. రాష్టవ్య్రాప్తంగా మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమం కింద 13 జిల్లాల్లోని భూమి ఓనర్లకు భూముల పట్టాలను అందిస్తోంది.

పాతభవనాల కూల్చివేత సాధ్యమేనా?

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ప్రభుత్వ ముందస్తు కార్యాచరణ, శాఖల మధ్య సమన్వయలోపం కలసి వెరసి పురాతన భవనాల్లో నివసిస్తున్న వారికి శాపంగా పరిణమించింది. వర్షాకాలంలో భారీ వర్షాలు పడ్డప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు హడావిడి చేయడం, తర్వాత మర్చిపోవడం తంతుగా మారింది. ఎప్పుడు కూలిపోతాయో తెలియని అత్యంత పురాతన భవనాలను ఖాళీ చేయించే అంశంలో జీహెచ్‌ఎంసీ-రెవిన్యూ శాఖల మధ్య కొనసాగుతున్న సమన్వయ లోపం సమస్యలు సృష్టిస్తోంది. పర్యవసానంగా ఆ భవంతుల్లోని కుటుంబాల్లో చావుడప్పులు మోగుతున్నాయి.

కొత్త జిల్లాలు యథాతథం

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పునర్విభజనపై జారీ చేసిన ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించడానికి విధించిన గడువు 21న సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. ఇక తుది నోటిఫికేషన్ విడుదల చేయడం ఒక్కటే తరువాయి. దీన్ని ఆమోదించడానికి ఈ నెల 26న మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. మంత్రివర్గం ఆమోదం పొందిన మరుసటి రోజునే(ఈనెల 27) తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

పాక్ ఉగ్రవాద దేశమే

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 22: కరడుగట్టిన ఉగ్రవాది, హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ బుర్హాన్ వనీని ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీలో కీర్తించిన పాకిస్తాన్‌పై భారత్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇంతకుముందెన్నడూ ఉపయోగించనంత ఘాటు పదజాలాన్ని వినియోగిస్తూ తన విమర్శలకు పదునుపెట్టింది. అసలు పాకిస్తానే ఒక ‘ఉగ్రవాద దేశం’ అని తెగేసి చెప్పింది. పాకిస్తాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటూ ‘యుద్ధ నేరాల’కు పాల్పడుతోందని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.

ముంబయి తీరంలో హై అలర్ట్

ముంబయి, సెప్టెంబర్ 22: ఉరీ ఘటన మరువకముందే ముంబయి తీరంలో మరో అలజడి చోటుచేసుకుంది. సైనిక దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఉరాన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో అటు కోస్ట్‌గార్డ్, ఇటు మహారాష్ట్ర పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముంబయికి 47 కి.మీ దూరంలోని ఉరాన్, కరంజా ప్రాంతంలో సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు సంచరించడాన్ని నలుగురు పాఠశాల విద్యార్థులు గుర్తించి సమాచారం అందించారు. దీంతో ఉన్నతస్థాయి యంత్రాంగం అప్రమత్తమైంది. వారికోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మీరే తేల్చుకోండి

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 22: కాశ్మీర్ అంశం సహా భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఏ వివాదంలోనూ జోక్యం చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిరాకరించింది. ఉభయ దేశాలు ద్వైపాక్షిక చర్చలద్వారా తమ మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించింది. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పదేపదే చేసిన విజ్ఞప్తులను ఐరాస సెక్రెటరి జనరల్ బాన్ కి మూన్ నిర్ద్వందంగా తోసిపుచ్చారు. భారత్, పాకిస్తాన్ కాశ్మీర్ అంశంసహా తమ మధ్య ఉన్న అన్ని వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన షరీఫ్‌కు సూచించారు.

మా స్నేహం విడదీయలేనిది

న్యూయార్క్, సెప్టెంబర్ 22: ఉరి ఘటన నేపథ్యంలో ఓ వైపు ఐరాసలో భారత్ పాక్‌పై దుమ్మెత్తి పోయడం, మరోవైపు ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలుస్తుండడం లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే చైనా మాత్రం పాకిస్తాన్ తమకు చిరకాల మిత్ర దేశమని, తమ బంధం విడదీయలేనిదని చెబుతూ ఉండడం గమనార్హం.

Pages