S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలుగులు పారుతున్న చెరువులు

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో మిషన్ కాకతీయ కింద చేపట్టిన పలు చెరువులు నీటితో నిండుకుండల్లాగా కనిపిస్తున్నాయి. మొదటి దశలో మిషన్ కాకతీయ కింద చేపట్టిన దాదాపు అన్ని చెరువుల్లో నీరు నిండి అలుగు పొర్లుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 2321 చెరువులు ఉండగా, వీటిలో 1239 చెరువులు అలుగు పోస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 5939 చెరువులకు గాను 400 చెరువులు నిండు కుండలా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 5550 చెరువులకు గాను 1129 చెరువులు, ఖమ్మం జిల్లాలో 4517 చెరువులకు గాను 443 చెరువులు అలుగు పోస్తున్నాయి.

గేట్లెత్తారు!

మేళ్లచెర్వు, కేతేపల్లి, సెప్టెంబర్ 22: భారీ వర్షాల వల్ల నల్లగొండ జిల్లాలోని డిండి, పులిచింతల ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మూసీ ప్రాజెక్టులో 7 క్రస్టుగేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 16,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఎడమకాల్వకు మరో 2వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. కాగా 14వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కుడి కాల్వకు కొత్తపేట వద్ద గండిపడగా మరమ్మతులు చేస్తున్నారు.
పులిచింతలలో..

జలవిలయం

విజయవాడ, గుంటూరు, సెప్టెంబర్ 22: బుధవారం రాత్రినుంచి కురిసిన భారీ వర్షాలకు కోస్తాంధ్ర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు జిల్లాలో ఐదుగురు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. గుంటూరు జిల్లాలో రైళ్లు, బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరిగింది. కాటన్ బ్యారేజీ వద్ద గురువారం 10.7 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 2,63,740 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు.

మరింత బలపడిన అల్పపీడనం

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం గురువారం మరింత బలపడింది. వాయుగుండంగా మారే అవకాశం లేనప్పటికీ, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షం కురుస్తుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తర కోస్తాలో తూర్పు దిశగా, దక్షిణ కోస్తాలో పశ్చిమ దిశగా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గురువారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం సత్తెనపల్లిలో నమోదైంది.

అప్రమత్తంగా ఉండండి

విజయవాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాల వల్ల ఏర్పడే ఎటువంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లు సన్నద్ధమై వుండాల్సిందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వలన వీలైనంతవరకూ ఆస్తి, ప్రాణ నష్టాలు తగ్గించేవిధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. స్థానిక పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వర్షాలు, వరదలపై వీడియో మరియు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాల పరిస్థితులను స్వయంగా సమీక్షించారు.

ఏజన్సీలో ఎడతెరిపి లేని వర్షం

కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 22: ఏజన్సీ ఏరియాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగి పోర్లుతుండటంతో రవాణా సౌకర్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుండాల మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కినె్నరసాని రిజర్వాయర్‌కు వరదనీరు పెద్ద ఎత్తున రావటంతో గురువారం జెన్‌కో అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేశారు.

మృత్యుంజయుడు వెంకటేశ్వర్లు

గుంటూరు, సెప్టెంబర్ 22: ఒకవైపు జోరువాన.. మరోవైపు ముంచెత్తిన వరదనీరు.. కుటుంబసభ్యులతో పాటు వరదనీటిలో కొట్టుకుపోతున్న అతనికి తాటిచెట్టే జీవనాధారమైంది. అదే అదనుగా చెట్టుపైకి ఎక్కి దాదాపు 8 గంటలకు పైగా ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి మృత్యుంజయుడుగా నిలిచాడు.. చిలకలూరిపేట సమీపంలోని గంగన్నపాలెం ఎత్తిపోతల పథకం వద్ద వెంకటేశ్వర్లు, తల్లిదండ్రులు చేవూరి కొండలు, సుబ్బులు, తన చిన్నాన్న కుమార్తె వనజ జీవిస్తున్నారు. గురువారం వరదనీరు ప్రవహిస్తున్నా పెద్దగా ప్రమాదం ఉండదని భావించారు. అయితే వాగు నీటి ప్రవాహం ఉద్ధృతం కావడంతో కుటుంబం యావత్తు నీటిలో కొట్టుకుపోయారు.

ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాడతాం

ఏలూరు, సెప్టెంబర్ 22: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, యువతరానికి ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా హోదా అత్యవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటం సాగిస్తామని, దీనికి యువతరం కలసిరావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో గురువారం వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపై విమర్శల వర్షం కురిపించారు.

నగరం మునకేసింది!

హైదరాబాద్ నగరం నిండా మునిగిపోయింది. భవనాలకు భవనాలే జల దిగ్బంధమయ్యాయి. బుధవారం కురిసిన భారీ వర్షం నుంచి కోలుకోక ముందే గురువారమూ ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురిసిన కుంభవృష్టితో నగరం అతలాకుతలమైంది. రహదారులు నదులనే తలపించాయి. కాలనీలు జలమయం కావడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్ వాసులకు ప్రభుత్వం రొట్టెలు, మంచినీటిని పంపిణీ చేసింది. మరోవైపు హుస్సేన్‌సాగర్ ఉప్పొంగుతోంది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 514 మీటర్లు కాగా, ఇప్పటికే 513 అడుగులకు చేరింది. వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువకు వదలుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను జిహెచ్‌ఎంసి అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

హై అలర్ట్

హైదరాబాద్, సెప్టెంబర్ 22: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ పరిధిలోని విద్యాసంస్థలకు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం నుంచి ఎప్పటికప్పుడు మంత్రి కెటిఆర్, రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిహెచ్‌ఎంసి కమిషనర్‌తో పరిస్థితిని సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. అవసరమైతే ఆర్మీ సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.

Pages