S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందకొడిగా సంస్కరణలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలో సంస్కరణల ప్రక్రియ మందకొడిగా సాగుతోందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్జన్సీ మూడీస్ అంటూ, సంస్కరణలు గనుక పరిగణించే విధంగా ఉన్నట్లయితే ఒకటి రెండేళ్లలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపింది. ప్రైవేట్ పెట్టుబడులు పెద్దగా పెరక్క పోవడం, బ్యాంకుల్లో పెరిగిపోతున్న నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఏ)లు ఇప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగానే ఉన్నాయని కూడా ఆ సంస్థ అభిప్రాయ పడింది.

ఈ ఏడాది 10 నగరాలకు ఐఎన్‌ఐ వ్యాపార విస్తరణ

ముంబయి, సెప్టెంబర్ 20: ప్రపంచంలో 21 దేశాలకు పండ్లను ఎగుమతి చేస్తున్న ప్రముఖ హార్టీకల్చర్ సంస్థ ఐఎన్‌ఐ ఫార్మ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 10 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జైపూర్, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, 2016-17 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాదాపు మరో 10 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నామని ఐఎన్‌ఐ ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ఖండేల్వాల్ ముంబయిలో పిటిఐ వార్తా సంస్థకు వివరించారు.

నిర్మాణ రంగ కార్మికులకు ఇఎస్‌ఐసి, ఇపిఎఫ్ ప్రయోజనాలు

భువనేశ్వర్, సెప్టెంబర్ 20: నిర్మాణ రంగ కార్మికులకు ఇసిఐఎస్, ఇపిఎఫ్ పథకాల ప్రయోజనాలు వర్తింపజేయాలని, అలాగే ఇసిఐఎస్ కింద సైకిల్-రిక్షా డ్రైవర్లతో పాటు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు దశల వారీగా లబ్ధి చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మంగళవారం ప్రారంభమైన జాతీయ కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే నిర్మాణ రంగం నుంచి సెస్సు రూపంలో భారీగా సొమ్ము వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను సక్రమంగా ఉపయోగించడం లేదని ఆయన ఆరోపించారు.

లోధా కమిటీ సిఫార్సులపై దాటవేత వైఖరి

ముంబయి, సెప్టెంబర్ 20: దేశంలో క్రికెట్‌ను ఒక గాడిలో పెట్టడానికి, పాలనా వ్యవహారాలను పారదర్శంగా ఉంచడానికి సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమవుతున్నప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని అనుసరించడంలేదు. సమస్యను దాటవేయడానికి ప్రయత్నిస్తున్నదని బుధవారం నాటి వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) అజెండా స్పష్టం చేస్తున్నది. వాస్తవానికి అక్టోబర్ మాసాంతంలోగా లోధా సిఫార్సులను బోర్డు అమలు చేయాల్సి ఉంది. కానీ, అందులోని పలు అంశాలు ఆచరణకు సాధ్యం కాదని బోర్డు వాదిస్తున్నది.

కివీస్‌పై స్పిన్ చార్జి

కాన్పూర్, సెప్టెంబర్ 20: న్యూజిలాండ్‌పై స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించి విజయాలను నమోదు చేయడానికి భారత క్రికెట్ జట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నది. పిచ్‌లను స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా తయారు చేసుకొని, స్వదేశంలో రెచ్చిపోవడం టీమిండియాకు అలవాటే. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల నుంచి జట్టు కోచ్, కెప్టెన్ వరకూ ప్రతి ఒక్కరూ క్యూరేటర్లపై ఒత్తిడి పెంచేవారే. సాధ్యమైనంత వరకూ పచ్చిక ఎక్కువగా ఉండేలా చూడడం ద్వారా స్పిన్నర్లు వేసే బంతులు సుడులు తిరుగుతూ దూసుకొచ్చి, బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడమే టీమిండియా వ్యూహం. చాలా దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతున్నది.

మొదటి టెస్టుకు ఇశాంత్ శర్మ దూరం

కాన్పూర్, సెప్టెంబర్ 20: అనారోగ్యంతో బాధపడుతున్న భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగే మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయాన్ని భారత జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతను వైరల్ జ్వరంతో బాధపడుతున్నాడని తెలిపింది. విశ్రాంతి అవసరం కాబట్టి, మొదటి టెస్టులో అతను ఆడే అవకాశం లేదని పేర్కొంది. అయితే, ఇశాంత్‌కు రీప్లేస్‌మెంట్‌ను భారత కోచ్ అనీల్ కుంబ్లే కోరడం లేదు. దీనితో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
స్పిన్ పిచ్‌ని కోరలేదు: కుంబ్లే

పాక్‌పై ప్రశ్నకు ఇదా సమయం

ముంబయి, సెప్టెంబర్ 20: ప్రపంచ కప్ కబడ్డీలో పాకిస్తాన్‌ను ఎందుకు ఆహ్వానించడం లేదన్న ప్రశ్నపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ తీవ్రంగా స్పందించాడు. పాక్‌పై ప్రశ్న వేయడానికి సమయం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్టోబర్ 7 నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యే మూడో ప్రపంచ కప్ కబడ్డీలో పాల్గొనే భారత జట్టు ధరించే జెర్సీని మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కపిల్ ఆవిష్కరించాడు. భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న అనూప్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం కపిల్ మాట్లాడుతూ దేశంలో క్రీడలకు ఆదరణ పెరుగుతున్నదని అన్నాడు.

జపాన్ ఓపెన్ బాడ్మింటన్ మెయిన్ డ్రాకు కశ్యప్

టోక్యో, సెప్టెంబర్ 20: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. మంగళవారం అతను రెండో క్వాలిఫయింగ్‌లో డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ అన్టోనె్సన్‌ను 21-18, 21-12 తేడాతో ఓడించాడు. కాలి గాయంతో బాధపడుతూ ఇటీవల కాలంలో టోర్నీలకు దూరమైన కారణంగా కశ్యప్ క్వాలిఫయర్స్‌లో పోటీపడాల్సి వచ్చింది. ఈ అడ్డంకిని సునాయాసంగా అధిగమించిన అతను మెయిన్ డ్రాలో అతను మొదటి రౌండ్‌లోనే కిడాంబి శ్రీకాంత్‌ను ఢీకొనాల్సి ఉంది. ఇద్దరు భారత ఆటగాళ్లు తొలి రౌండ్‌లో తలపడడం భారత్‌కు ఎదురుదెబ్బ అని చెప్పాలి.

చిత్రం.. పారుపల్లి కశ్యప్

సెలక్షన్ కమిటీకి రేసులో వెంకటేశ్ ప్రసాద్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: జాతీయ సెలక్షన్ కమిటీకి ఎంపిక జరుపుతామంటూ భార త్ క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) దరఖాస్తులను ఆహ్వానించడంతో, మాజీ క్రికెట ర్లు రేసులోకి దిగుతున్నారు. ఇంతకు ముందు చీఫ్ కోచ్ పదవికి పోటీపడిన మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఇప్పుడు సెలక్టర్‌గా ఉండేందుకు ఆసక్తిని చూపుతున్నాడు. అత నితోపాటు మాజీ బౌలర్లు ఆశిష్ కపూర్, మనీందర్ సింగ్ కూడా సెలక్షన్ కమిటీ సభ్య త్వం కోసం దరఖాస్తు చేకున్నారు. పదవీ కాలం పూర్తయన కమిటీలో సభ్యులైన ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడా కేవలం ఏడాది పదవీకాలాన్ని మాత్రమే పూర్తి చేశారు. కాబట్టి వారు కూడా పోటీలో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఆసియా బీచ్ గేమ్స్‌కు భారత్ భారీ బృందం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: వియత్నాంలోని డనాంగ్‌లో జరిగే ఐదవ ఆసియా బీచ్ గేమ్స్‌కు 208 మందితో కూడిన భారీ బృందాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ఎంపిక చేసింది. 2014లో ఈ పోటీలు ఫకెట్‌లో జరిగాయి. అందులో రెండు స్వర్ణం, ఒక రజతం, 7 కాంస్య పతకాలు లభించాయి. కాగా, తాజా పోటీలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయ.

Pages