S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖీర్

పాలు -
1లీటరు
చిన్న రవ్వ - 1
కప్పు
ఏలకులు - 6
కొబ్బరికోరు -
1 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
పంచదార - 1 కప్పు
జీడిపప్పులు - 12
కిస్‌మిస్ - 12
కుంకుమ పువ్వు - 1 చెంచా
బాదం పొడి - 2 చెంచాలు
విధానం:ముందుగా పాలు ఎసరుపెట్టి దానిలో బన్సీ రవ్వ వేసి ఉడికించాలి. పైన కొబ్బరి కోరు, నెయ్యి, పంచదార వేసి మరగనివ్వాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపొడి, కుంకుమపువ్వు చేర్చి దింపాలి. రుచికరమైన ఖీర్ రెడీ!

అప్పాలు

గోధుమ బన్సీ రవ్వ బరకది - 2 కప్పులు
బెల్లం - 2
కప్పులు
కొబ్బరి కోరు -
1 కప్పు
ఏలకులు - 6
నూనె - 250 గ్రా.
గసగసాలు - 1/2 కప్పు
ఉప్పు - చిటికెడు
పాలు - 1 కప్పు
నాలుగు కప్పుల నీరు, పాలు కలిపి మరగనివచ్చి రవ్వ పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇది మెత్తబడ్డాక బెల్లం, కొబ్బరి, ఏలకుల పొడి వేసి కలిపి ఉడకనిచ్చి దింపాలి. ఇప్పుడు నూనె కాగనిచ్చి ప్లాస్టిక్ పేపర్‌పై వడలుగా తట్టి నూనెలో వేయించాలి. ఇవి బంగారు వనె్న వచ్చాక నూనె వాడ్చి పళ్ళెంలో పెట్టండి. ఇలా మొత్తం పిండి అంతా చెయ్యాలి. ఇవి మంచి రుచిగా బలవర్థకంగా వుంటాయి.

- వాణిప్రభాకరి

అందరికీ నచ్చేలా తను వచ్చెనంట

తేజ కాకుమాను, రేష్మిగౌతమ్, ధన్య బాలకృష్ణన్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘తను వచ్చెనంట’. అచ్యుత్ ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెలాఖరుకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. చిత్ర లోగోను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు విడుదల చేశారు. పాటలను బి.ఎ.రాజు, కె.రాఘవేంద్రరెడ్డి, జర్నలిస్టు శీను విడుదల చేశారు.

గౌతమ్ దర్శకత్వంలో కార్తీక్

‘టిప్పు’, ‘పడేసావే’ చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందిన కార్తీక్‌రాజు తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతమ్ దర్శకుడిగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చే నెల 11న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కార్తీక్‌రాజు మాట్లాడుతూ- తొలి చిత్రాలలో కనిపించినట్లు కాకుండా బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా వుండడానికి ఫిజిక్‌పరంగా, లుక్ పరంగా అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రంలో నటించడానికి ముందుకు వచ్చానని, ఓ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని అన్నారు.

సైతాన్‌గా బిచ్చగాడు

బిచ్చగాడుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని తాజా చిత్రం ‘సైతాన్’కు సంబంధించిన టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో విజయ్ ఆంటోని కన్పించనున్నాడు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. చారుహసన్, అరుంధతి నాయర్, మీరాకృష్ణన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమాకు హీరోగా నటిస్తున్న విజయ్ ఆంటోనినే సంగీతం అందిస్తున్నారు.

గడుసుపిల్ల

హీరోయిన్లకి తరచుగా ఎదురయ్యే అతిక్లిష్టమైన ప్రశ్నలేంటో తెలుసా? మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎవరితో కలిసి సినిమా చేయాలనుంది? అనేవి. ఆ ప్రశ్నలు అడగ్గానే హీరోయిన్లు తలకొట్టుకొంటుంటారు. అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేదే వీలైనంతమంది కథానాయకులతో కలిసి నటించాలని. మరి ప్రత్యేకంగా ఏ హీరో ఇష్టం? ఎవరితో కలిసి నటించాలనుందని అడిగితే వాళ్లుమాత్రం ఏమని ఆన్సర్ ఇస్తారు? నిజంగా ఎవరిపైనైనా ప్రత్యేకమైన ఇష్టమున్నప్పటికీ వాళ్ల ఒకరి పేరు చెబితే ఇంకొకరు ఏమనుకొంటారో అనే భయం వెంటాడుతుంటుంది. అందుకే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా దాటేస్తూ సింపుల్‌గా తప్పించుకొంటుంటారు హీరోయిన్లు.

పాత ఫార్ములా!

పెళ్ళయ్యాక కథానాయికల తీరు మారుతుంది. అంతకుముందులా గ్లామర్‌గా కనిపించలేరు. ఎవరేమనుకొంటారో అనే ఫీలింగ్. పాత్రల విషయంలోనూ కొన్ని షరతులు విధించాల్సి వస్తుంటుంది. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా హుందాతనంతో కూడిన పాత్రలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. పెళ్ళయ్యాక అమలాపాల్ ప్రయాణం కూడా ఇంచుమించు అలాగే సాగింది. ఎక్కడా హద్దులు దాటి కనిపించినట్టు అనిపించలేదు. సినిమాల్లోనే కాదు, బయట ఫంక్షన్లకీ ఆమె పద్ధతిగానే తయారై వచ్చేది. అయితే ఇటీవల ఆమె వివాహబంధం దెబ్బతింది. డైవర్స్‌కి అప్లై చేసింది. ఇకపై మళ్లీ మునుపటిలాగా కెరీర్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకొంది. అవకాశాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

10 మంది ఉగ్రవాదులు ఖతం : భారత ఆర్మీ గుళ్ల వర్షం

యూరీ : 18 మంది సైనికులను కోల్పోయి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత సైనికులు 10 మంది పాక్ము ష్కురులను మట్టుబెట్టారు. యూరీ సెక్టార్‌లోని లచిపొరాలో పాక్ మంగళవారం మధ్యాహ్నం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. భారత శిబిరాలపై గుళ్లవర్షం కురిపించింది. దీంతో స్పందించిన భారత ఆర్మీ పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. మరికొందరు ముష్కరులు తిరిగి పాక్‌లోకి పరుగులంకించుకున్నారు. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపించాలనుకున్న పాక్ ఆటలను భారత దళాలు సాగనివ్వలేదు.

తెలంగాణ గ్రూప్‌-2 షెడ్యూల్‌లో మార్పులు

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్‌ 12వ తేదీన ఐఎఫ్‌ఎస్‌ రాత పరీక్ష కారణంగా తొలి పరీక్షను 11వ తేదీకి మార్చినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ముందుగా నవంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించగా, ప్రస్తుత షెడ్యూల్‌లోనవంబర్‌ 11, 13 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

బీసీలకు నాణ్యమైన విద్య : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: బీసీ కులాల భావితరాలకు మంచి భవిష్యత్‌ అందించేందుకు కృషి చేస్తున్నామని, బీసీలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ మంగళవారం తెలిపారు. వచ్చే ఏడాదిలో 119 బీసీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగం పొందేలా బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Pages