S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఎఫ్‌సి అండర్-16 నేడు ఇరాన్‌తో భారత్ మ్యాచ్

మార్గోవా, సెప్టెంబర్ 20: ఎఎఫ్‌సి అండర్-16 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత జట్టు బుధవారం అగ్ని పరీక్షను ఎదుర్కోనుంది. గ్రూప్ ‘ఎ’లో ఇరాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ ముందంజ వేస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ని కోల్పోతే, నిష్క్రమించక తప్పదు. స్వదేశంలో, సుమారు 4,000 మంది ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి, వారి మద్దతు భారత ఆటగాళ్లకు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. హోం అడ్వాంటేజ్‌ని సద్వినియోగం చేసుకొని, ఇరాన్‌ను ఓడించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

బలపడిన బలూచీలు..

బలూచీస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు బ్రహమ్ దహ్ బుగ్తీ మనదేశంలో ఆశ్రయం పొందాలని నిర్ణయించడం అంతర్జాతీయ బీభత్సకాండకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి లభించిన వ్యూహాత్మక విజయం. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదానికి బలవుతున్న వారందరూ సంఘటితం అవుతున్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న బ్రహమ్‌దహ్ బుగ్తీ కుటుంబం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండకు మూడు తరాలపాటు బలైంది. 1948లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచీస్థాన్ ప్రాంతంలోని నాలుగు సంస్థానాలను బలవంతంగా తమ దేశంలో కలుపుకున్నప్పటినుంచి బలూచీస్థాన్ స్వాతంత్య్ర ఘర్షణ కొనసాగుతూనే ఉన్నది.

కశ్మీర్ ‘నిప్పు’ను ఆరనివ్వని పాక్

కశ్మీర్ లోయలో రెండు నెలలకు పైగా జరుగుతున్న అల్లర్లలో 75 మందికి పైగా మృతిచెందారు. ప్రశాంతత నెలకొల్పడంకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తు న్న ప్రయత్నాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వడంలేదు. తాజాగా హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నాయకత్వంలో అఖిలపక్ష ప్రతినిధిబృందం రెండు రోజులపాటు కశ్మీర్‌లో పర్యటించి వచ్చినా చెప్పుకోదగిన మార్పు తీసుకురాలేకపోయారు. ఉగ్రవాది బుర్హన్ వనీని చంపిన అనంతరం పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరింత మెరుగుగా పరిష్కరించే ప్రయత్నం చేసి ఉండవలసిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని కలవడానికి వేర్పాటువాద నాయకులు తిరస్కరించారు.

- చలసాని నరేంద్ర

అర్థంకాని అభివృద్ధి లెక్కలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపాలనాకాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధిని, పారిశ్రామికాభివృద్ధినీ సాంకేతిక భాషలో చెబుతుంటారు. దేశంలో జిడిపి ఇంతగా పెరిగిందని, తలసరి ఆదాయం అంత పెరిగిందని చెబుతుంటారు. ఈ లెక్కలు సాధారణ ప్రజలకేమీ అర్థం కావు. విద్యావంతులక్కూడా అర్థం కావు. అసలు జిడిపి అంటే ఏమిటో, దానినెలా లెక్క కడతారో ప్రజలకర్ధమయ్యేలాగున ఒక్కరుగాని, ఒక్కసారి గాని చెప్పరు. ప్రభుత్వం జిడిపి పెరిగిందని చెబితే, ఆ లెక్కలు సరైనవి కావు. నిజానికది తగ్గిందని ప్రతిపక్షాలవారు విమర్శిస్తారు, పోనీ జిడిపిని ఇలా లెక్క కడతారు, కాని ప్రభుత్వం లెక్కలు మార్చి చూపిస్తున్నారు అని ప్రతిపక్షాలైనా చెప్పవు.

- మనె్న సత్యనారాయణ సెల్: 9989076150

అర్చకుల అరణ్యరోదన

భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తలైన అర్చకులు ‘‘అర్చక నిధి చంద్రశేఖరా’’అంటూ మొత్తుకుంటున్నారు. భక్తి ఎక్కువగా ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమస్యలు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. గతంలో తెలంగాణ వ్యాప్తంగా ధూప దీప నైవేద్యాలు నిలిపేసి, అర్చకులు ఆందోళన చేసినప్పటికి వారి సమస్యల పరిష్కారం ఇంకా ‘‘ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉంది’అన్నట్లు ఉంది. అర్చకుల గోస తెలుగు రాష్ట్రాల పాలకుల చెవులకు ఎక్కడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్.పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడిచిపోయినా వారి సమస్యలకు ఇంకా పరిష్కారం లభించలేదు.

- రావుల రాజేశం

అద్భుతాలు హిందూ సన్యాసి చేస్తే..

‘మదర్’ని సెయింట్‌గా ప్రకటించడానికి రెండు అద్భుతాలు అవసరం. ఆ అద్భుతాలేమిటో పత్రికల్లో వచ్చాయి. మాకూ ఒక ఆలోచన వచ్చింది. ఆవిధమైన అద్భుతాలు ఏ హిందూ సన్యాసి అయినా ప్రదర్శిస్తే మన సోదర వామపక్ష మేధావులు, హేతువాద కార్యశూరులూ ఎంత ఎద్దేవా చేసేవారో? ఇంక డాక్టర్లెందుకు? ఆస్పత్రులు మూసేసి ఆశ్రమాలు ప్రారంభించండి అంటూ ఎంత హేళన చేసేవారో. చానళ్లలో నిరంతరాయంగా ఎన్ని వెటకార చర్చలు జరిగేవో. కాని ‘మదర్’ అదృష్టం. ఇప్పుడు మాత్రం మన సోదరుల నోళ్లు మూతపడ్డాయి. హేతువాదులు పెదవి విప్పితే ఒట్టు! చానల్స్ కిక్కురుమనలేదు.
- జ్ఞానబుద్ధ, సిద్దార్థనగర్, తూ.గో.జిల్లా

కాశీఖండం 17

ఏ ప్రణవ పంచాక్షర బ్రహ్మ విద్యోపనిషత్తు నీ అరచేతి ఉసిరక. ఇంతటి ప్రశస్తికెక్కిన నిన్ను బ్రహ్మదేవుడి ఆన చేత వేడికొనడము కోసరం ఈ కాశికా నగరానికి ఇంత మందిమి కట్టకట్టుకొని వచ్చాము. భువన సంక్షోభకారి అయి ఒక మహోత్పాతం పుట్టుకువచ్చింది. ఆ ఉపద్రవం తొలగిపోయేటట్లు నువ్వు చేసి పెట్టాలి.
బృహస్పతి లోపాముద్రకి పతివ్రతా ధర్మాలు తెలుపుట
తల్లీ! నీకు కుశలమేనా? సాధ్వీ! నీకు ఆరోగ్యమే కదా! దేవీ! నీకు మంగళమే కదా! పూబోడీ! నీకు లెస్సలా? శ్రేష్ఠమూ, సర్వతిశాయి అయిన పతివ్రతాచార వైభవ రాజ్యం నీకు కొనసాగుతున్నది కదా!

నిత్య శోభితం

ఈ రోజు జరుగుతున్నదంతా నిన్న వూహించింది ఎంతమాత్రం కాదు. రేపు జరుగబోయేదంతా ఈరోజు అంచనా వేస్తున్నదో, జరగాలని బలంగా కోరుకుంటున్నదో ఎంతమాత్రం కాదు. ఎవరికివారు తమలో తామెంత తెలివికలవారమని అనుకుంటున్నా ఎక్కువ సందర్భాల్లో అనుకునేదానికి జరిగేదానికి పొంతన కనిపించదు. అలాగని అనుక్షణం మనిషి ఊహల్లో ఊరేగడం మానడం లేదు. స్వప్నలోకాల్లో తేలిపోవడం ఆపడంలేదు. మరుక్షణం జరగనుందేమిటో పసిగట్టలేకపోయినా తాననుకునేది భక్తితోనో, శక్తితోనో, యుక్తితోనో సాధించి తీరాలని తపిస్తూనే ఉన్నాడు.

- కొల్లు రంగారావు

Pages