S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిపక్ష నేతగా జగన్ తగడు

కడప, సెప్టెంబర్ 19: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా తగడని కడప జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జగన్ స్థానంలో అనుభవం ఉన్న సీనియర్ ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని వైకాపా నాయకులకు సూచించారు. సోమవారం కడపలో మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డిఇ అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా పోయిందన్నారు. ఆయనకు ఎంతసేపు రౌడీయిజం, బెదిరింపులకు పాల్పడడమే తప్ప సభాహక్కులు కాపాడాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందన్నారు. అనుభవరాహిత్యం వల్లే జగన్ ఇలా ప్రవరిస్తున్నాడన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం జగన్ నైజంగా మారిందాన్నారు.

రాజంపేట పురపాలక సంఘం ఎన్నికలపై టిడిపి దృష్టి!

కడప,సెప్టెంబర్ 19: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించని నగర పాలక సంస్థలకు,పురపాలక సంఘాలకు మరో రెండుమాసాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం కాగా, జిల్లాలో ఎన్నికలు జరగని రాజంపేట పురపాలక సంఘం ఎన్నికపై టిడిపి అధిష్ఠానం దృష్టిసారించింది. ఇప్పటికే జిల్లాలో పలుమార్లు పర్యటించిన అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌లు రాజంపేట నేతలతో ఈ ఎన్నికలపై పలుమార్లు ప్రస్తావించారు.

చేనేత సంఘాల్లో అక్రమార్కులు!

కడప,సెప్టెంబర్ 19: జిల్లా పరపతి కలిగి పనిచేయని చేనేత సహకార సంఘాల నేతలు అధికార పార్టీనేతల అండదండలతో కోట్లాదిరూపాయలు భోంచేస్తూ పనిచేసే సహకార పరపతి సంఘాలు, చేనేత కార్మికుల పొట్ట కొడుతున్నారు. కేంద్రప్రభుత్వం చేనేత సహకార సంఘాలను, చేనేత కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లరూపాయలు ఖర్చు చేస్తోంది. జిల్లాలో 110 చేనేత సహకార పరపతి సంఘాలున్నా పదుల సంఖ్యలో పనిచేస్తున్నాయి.

రాజంపేటలో టిడిపి జెండా ఎగురేద్దాం..

రాజంపేట, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి రాజంపేట మున్సిపాలిటీపై వైకాపా ఆశలు పెట్టుకొని ఉందని, పార్టీ నేతలు ఐకమత్యంతో మెలిగి వైకాపా ఆశలకు గండికొట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో మున్సిపాలిటీలోని టిడిపి నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైకాపా పార్టీ పరంగా రాష్టవ్య్రాపితంగా చేసుకున్న సర్వేలో ఒక రాజంపేట మున్సిపాలిటీపై ఆశలు పెట్టుకుందన్నారు.

మంత్రి గంటా మార్నింగ్ వాక్

రాజంపేట, సెప్టెంబర్ 19: రాజంపేట పట్టణం ఉస్మాన్‌నగర్, మన్నూరు, న్యూబోయనపల్లె, ప్రధాన మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాల్లో విప్ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం మార్నింగ్‌వాక్ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యలోపంపై మున్సిపల్ అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తపరిచారు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. మురికికాలువలు మురికినీటిని తీసుకెళ్ళేందుకు వీలుగాలేవని, అవసరమైనచోట డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధిపరచాల్సిన అవసరాన్ని గుర్తించారు.

వైకాపా గాలి!

కడప,సెప్టెంబర్ 19: ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రత్యేక పురపాలక సంఘమైన రాజంపేట పురపాలక సంఘానికి మరోరెండునెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో వైసిపి అధిష్ఠానం ఇటీవల సర్వే నిర్వహించినట్లు తెలిసింది. ఆ సర్వేలో వైసిపిచే అనుకూల పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు, వైసిపి నేత పివి మిథున్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు రాజంపేటలో పర్యటనలు జరిపి తనకువచ్చే పార్లమెంట్ అభివృద్ధి నిధులు రాజంపేటకే అధికపీట వేసినట్లు తెలుస్తోంది.

వరిపైరును పరిశీలించిన ఏఓ

సంబేపల్లె, సెప్టెంబర్ 19: మండల పరిధిలోని ప్రకాష్‌నగర్‌కాలనీ, మిన్నమరెడ్డిగారిపల్లెలో సాగు చేసిన వరిపైరును వ్యవసాయాధికారి రమేష్‌బాబురావు సోమవారం పరిశీలించారు. వరిపైరును మైల్స్ తెగులు ఆశించిందని, దీని నివారణకు ఒబెరామ్ అనే మందును ఒక లీటర్ నీటిలో 0.5 మిలీల నుంచి 1 మిలీ వరకు కలిపి పైరుపై పిచికారీ చేయాలన్నారు. అలాగే వరిలో కాలిబాటలు వేయడం వలన దోమకాటును నివారించవచ్చన్నారు. రైతులకు వరిపైరుపై పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రామాంజులరెడ్డి, సుబ్బరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

కమలాపురం, సెప్టెంబర్ 19: ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి చూపాలని ఎమీవో జాఫర్‌సాదిక్ కోరారు. ఆయన సోమవారం మండల పరిధిలోని పెద్దచెప్పల్లి హైస్కూల్ గ్రౌండ్స్‌లో యర్రగుంట్ల జోన్ యస్ జి యఫ్ కోకో,కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దచెప్పల్లి పాఠశాలలో ఈ ఏడాది ఈ పోటీలు నిర్వహించడం స్వాగతించ విషయమన్నారు. ఇందు వల్ల గ్రామీణప్రజలు కూడా జోనల్‌స్థాయిపోటీలు చూసే అవకాశం ఏర్పడిందన్నారు. ఇక్కడ గెలుపొందే విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు. క్రీడల వల్ల విద్యార్థులు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.

ప్రజాసేవలో ఖైదీల పెట్రోలు బంకు

కడప,(క్రైమ్)సెప్టెంబర్ 19: కడప సెంట్రల్ జైల్ ఆవరణలో ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోలు బంకు 5సంవత్సరాల క్రితం ఏర్పాటైందని, ఇది దేశంలోనే మొట్టమొదటి ఖైదీలు నిర్వహించే పెట్రోలు బంకు అని కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ లక్ష్మినరసయ్య అన్నారు. సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖైదీల సంక్షేమం కోసం పెట్రోలు బంకు ఏర్పాటు చేశామని స్వచ్చతకు మారుపేరుగా నిర్వహిస్తున్నామన్నారు.

పేదల సమస్యలు పరిష్కరించాలి

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 19: మీ కోసం కార్యక్రమంలో న్యాయం జరుగుతుందని సుదూర ప్రాంతాల నుంచి పేదప్రజలు వస్తారని వారికి సత్వరమే న్యాయం చేసి వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ జిల్లా అధికారులకు తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీకోసం భవన్‌లో డయల్ యువర్ కలెక్టర్, మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా ముసలి, దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. వారి సమస్యలు పరిష్కారం కాకుంటే తిరిగి వ్యయప్రయాసాల కోర్చు ఇక్కడికి వస్తారన్నారు. పరిష్కారం చూపిస్తే ఇక్కడికి వారు రారని చెప్పారు.

Pages