S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెలుగొండప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి’

ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 19: పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ఈసందర్భంగా జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి ఇవ్వాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేయాలని, ఎకరాలకు 19లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, నిర్వాసితులకు డబుల్‌బెడ్ రూం ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట

పాతపట్నం, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని ఎంపి రామ్మోహన్‌నాయుడు అన్నారు. సోమవారం నూతన వ్యవసాయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా రైతాంగం ఆధునిక వ్యవసాయ విధానాలను పాటిస్తూ ప్రకృతి సేద్యంలో దేశంలోనే ముందంజలో ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన రెండున్నరేళ్లలో రైతులకు సేద్యానికై సకాలంలో రుణాలు మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతీ మండల కేంద్రంలో వ్యవసాయ కార్యాలయానికి నూతన భవనం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

4.55 మందికి లబ్ధిదారులకు రేషన్ కార్డులు

శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో 4.55లక్షలు రేషన్‌కార్డులు అర్హులైన వారందరికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత స్పష్టంచేశారు. సోమవారం ఆకస్మికంగా జిల్లాలో పర్యటించి మెళియాపుట్టి మండల కేంద్రంలో జరిగిన గిరిజన దర్బార్‌లో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే జరుగుతోందని అందులో రేషన్‌కార్డుల అవసరాలు గుర్తించి వాటిని కూడా జారీ చేస్తామని తెలిపారు. బియ్యంలో అరకిలో తక్కువ తూకం వస్తోందని ఒక ఫిర్యాదు అందిందని దానిపై సంబంధిత అధికారులను విచారించాలని ఆదేశించామన్నారు.

ఆ గన్ ఏది?

శ్రీకాకుళం: ఒకప్పుడు శాంతిభద్రతలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా. కక్షలు, కార్పణ్యాలు కన్పించవు. ముఠా తగాదాలు అంతకంటే ఉండవు. గ్రామాల్లో జరిగే కొట్లాట్లన్నీ కుటుంబ కలహాలే తప్ప గన్ సంస్కృతి లేనేలేదు. అటువంటి సిక్కోల్‌లో హత్యలు, దోపిడీలు, దందాలు, బెదిరింపులు, భూకబ్జాలు పెద్దఎత్తున కొనే్నళ్ళుగా చోటుచేసుకున్నాయి. ఇవన్నీ మితిమీరిపోతున్నాయనే ఎస్పీ బ్రహ్మారెడ్డి రౌడీషీట్లు నమోదు చేసి పోలీసు స్టేషన్ హౌస్‌లలో వారి ఫోటోలు, వివరాల ఫెక్సీలు తగించేలా చర్యలు తీసుకున్నారు.

విద్యతోనే ప్రగతి

లావేరు, సెప్టెంబర్ 19: విద్యతోనే దేశ ప్రగతి ముడిపడి ఉందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. మండలంలో మెట్టవలస గ్రామంలో రూ.19లక్షల వ్యయంతో నిర్మించిన హైస్కూల్ అదనపు భవనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈఢ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఈ రంగంలో పురోగతికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల అక్షరాస్యతా శాతం తక్కువగా ఉందని ఆ శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఆర్ అండ్ ఆర్ నిబంధనల వర్తింపు కోరుతూ ధర్నా

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 19: వంశధార నిర్వాశితుల సమస్యలు పరిష్కరించిన తరువాతనే ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని కోరుతూ వంశధార నిర్వాశితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఈ ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేస్తూ సిపిఎం పార్టీకి చెందిన ముఖ్యనేతలను అరెస్టు చేశారు. ఇదిలావుంటే శాంతియుతంగా ధర్నా చేసుకుంటున్న నేతలను అరెస్టు చేయడమే కాకుండా విచక్షణా రహితంగా ఆందోళనకారులు కూర్చొన్న టెంట్‌లను పోలీసులు పీకేశారు.

సిక్కోలు కార్పొరేషన్ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండండి

బలగ, సెప్టెంబర్ 19: త్వరలో జరగనున్న శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో సోమవారం కార్పొరేషన్ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎప్పుడూ శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు వైసిపికి అనుకూలంగా ఉన్నాయని అందువల్లే ఎన్నికలకు వెళ్లేందుకు తెలుగుదేశంపార్టీ బయపడుతుందని ఆయన ఆరోపించారు.

బెల్ట్ షాపులు తొలగించండి

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 19: జిల్లాలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు వెలిశాయని, అధికారులు చోద్యం చూడకుండా తక్షణమే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని వంగర మండలం మగ్గూరు గ్రామానికి చెందిన జి.ఖగేంద్రనాయుడు కోరారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు ఫోన్‌లో వినతులు స్వీకరించారు. హిరమండలం చిన కొల్లివలస గ్రామం నుండి బి.తవిటయ్య ఫోన్‌చేస్తూ వంశధార ప్రాజెక్టులో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. మందస మండలం బేతాళపురం నుండి కె.కరుణ వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని కోరారు.

శునకాల నియంత్రణకు చర్యలు

నరసన్నపేట, సెప్టెంబర్ 19: స్థానిక మేజర్ పంచాయతీలోశునకాలు నానాటికీ పెరిగిపోతుండంతో నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామని పంచాయతీ కార్యనిర్వహణాధికారి మధుసూధనరావు తెలిపారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మూడు రోజులుగా శునకాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇంకా రెండు వేల శునకాలు పట్టణంలో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులను గురిచేస్తున్నాయని దీంతో పిచ్చికుక్కల స్వైరవిహారంలో పలువురికి గాయాలయినట్టు తెలిపారు.

అభివృద్ధి పనుల పరిశీలన

శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: నగరంలో సుమారు రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. సోమవారం ఉదయం మెలియాపుట్టి మండలంలో చేపట్టిన గిరిజన దర్బార్ అనంతరం ఆమె నగరంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక పాత హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 12 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణంను ఆమె ప్రారంభించారు. అక్కడనుండి జిల్లా పరిషత్ సమావేశ మందిరం వెనుకభాగాన ఉన్న మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా తుమ్మావీధిలో సులాభ్ కాంప్లెక్సును పరిశీలించి పరిసరాల్లో మొక్కలు నాటారు.

Pages