S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో వ్యవసాయానికి అదనంగా విద్యుత్

హైదరాబాద్, ఆగస్టు 28: రాష్ట్రంలో రైతాంగానికి ఏడు గంటల కంటే ఎక్కువగా అదనంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోనివ్వమని ఆయన చెప్పారు. ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖలు ఉమ్మడిగా కృషి చేసి రైతుల ప్రయోజనం కోసం కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రెయిన్‌గన్స్,బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పంటల రక్షణకు రెయిన్ గన్స్‌ను వినియోగిస్తున్నామన్నారు.

ఏపికి కొత్త పురావస్తు శాఖ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలి

హైదరాబాద్, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా కొత్తగా పురావస్తు శాఖను ఏర్పాటు చేయాలని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన జరిగి మూడు సంవత్సరాలు గడచినా, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా పురావస్తు సర్కిల్‌ను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కాని హైదరాబాద్‌లోని ప్రస్తుత ఉమ్మడి సర్కిల్ కార్యాలయాధికారి మాత్రం ఈ ఆదేశాలను అమలు చేయడంలేదన్నారు. ఈ ఆదేశాల ప్రకారం సిబ్బందిని, ఆస్తులను సర్దుబాటు చేయాలన్నారు.

ఏపికి హోదా ఇవ్వాల్సిందే

విజయవాడ, ఆగస్టు 28: రాష్ట్ర విభజన వల్ల సుందరమైన హైదరాబాద్ వంటి మహోన్నత నగరాన్ని కోల్పోయామనే బాధ ఏ ఒక్కరికీ వలదు... ప్రపంచంలోనే పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానం, బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఆంధ్రప్రదేశ్‌కు దక్కాయని, ఇంతకంటే ఏం కావాలని మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ అన్నారు. నగరంలో రాశిక్‌జెమ్స్ జ్యూయలరీ షోరూమ్‌ను ప్రారంభించడానికి వచ్చిన దేవెగౌడ కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలన్నింటితో పాటు నాడు పార్లమెంట్ సాక్షిగా యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనంటూ ఆయన స్పష్టం చేశారు.

ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం వద్దు

విశాఖపట్నం/ హైదరాబాద్, ఆగస్టు 28: హిందూదేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఖరాఖండీగా పేర్కొన్నారు. దేవాలయ వ్యవస్థపై దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విధానాలపై ఆదివారం రుషీకేష్‌లో జరిగిన సమావేశంలో స్వామీజీ మాట్లాడారు. రాజ్యసభ సభ్యు డు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో స్వామి స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, దేవాలయాలపై పభుత్వం ఆజమాయిషీ చేయాలే తప్ప, పెత్తనం చేయవద్దన్నారు.

పొట్టపై నుండి వంద బైక్‌లు

రాజమహేంద్రవరం, ఆగస్టు 28: రాజమహేంద్రవరానికి చెందిన ఒక యువకుడు వంద బైక్‌లు (బుల్లెట్) తన పొట్టపై నుంచి నడిపించుకుని రికార్డు సృష్టించాడు. ఈ విన్యాసాన్ని గిన్నిస్ పుస్తకంలో నమోదుకు పంపారు. కరాటే, బాక్సింగ్, తైక్వాండోలో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన 21వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మా శ్రీనివాసరావు కుమారుడు ఉజ్వల్ స్థానిక పుష్కరాల రేవువద్ద ఆదివారం ఈ విన్యాసంచేశారు.

అభివృద్ధి నమూనాకు టిజెఎసి ‘నక్షా’

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ సమగ్ర అభివృద్ధికోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి (టిజెఎసి) కృషి చేస్తుందని ఈ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. టిజెఎసి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అభివృద్ధి నమూనా- టిజెఎసి ఆలోచన’ అన్న అంశంపై ఆదివారం హైదరాబాద్ (నాచారంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్)లో సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు పూర్తయిన తర్వాత వివరాలను కోదండరాం మీడియా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ‘నక్షా’ (ప్రణాళిక) రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.

అనకాపల్లి బిడ్డను కావడం గర్వంగా ఉంది

అనకాపల్లి, ఆగస్టు 28: సాహితీ పరిమళాలు వెదజల్లే అనకాపల్లి బిడ్డను కావడం పట్ల తనకెంతో గర్వంగా ఉందని, ఇక్కడ పెరిగిన వాతావరణమే తనను ఇంతటి స్థాయికి తీసుకెళ్లగలిగిందని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ అన్నారు. స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో ప్రముఖ సాహితీ సంస్థ డైమండ్ హిట్స్ ఆధ్వర్యంలో పద చక్రవర్తి అవార్డు ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. తనకు జరిగిన సత్కారానికి సిరివెనె్నల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐదు దశాబ్దాలుగా సాహితీ సేవలందిస్తున్న డైమండ్ హిట్స్ సంస్థ ద్వారా సత్కారం పొందడం తాను గర్వంగా భావిస్తున్నానన్నారు.

చత్తీస్‌గఢ్ నుంచే క్రాంతిసేన లేఖ?

హైదరాబాద్, ఆగస్టు 28: గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ బూటకమని, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వదలిపెట్టమని హెచ్చరిస్తూ ఇటీవల క్రాంతిసేన పేరుతో విడుదలైన పత్రికా ప్రకటన చత్తీస్‌గఢ్ నుంచే వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. క్రాంతిసేన కేంద్ర కమిటీ సభ్యులు జగత్ పట్నాయక్ (ఒడిశా), మధు (మహారాష్ట్ర) పేరిట ఒక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖ లెటర్‌హెడ్‌లో కాకుండా తెల్లకాగితంపై రాసి ఉండడం, ఎన్‌కౌంటర్ జరిగిన పది రోజుల తరువాత (ఆగస్టు 18) వారి సంతకాలతో కూడి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు క్రాంతిసేన లేఖపై దర్యాప్తు చేపట్టారు.

వాహనాల స్క్రాపింగ్ పాలసీ

న్యూఢిల్లీ, ఆగస్టు 28: పదిహేను సంవత్సరాలు, అంతకు పైబడిన దాదాపు 15 లక్షల భారీ వాహనాలను మొదటి దశలో రద్దుగా మార్చడానికి ఉద్దేశించిన వాహనాల రద్దు విధానం ముసాయిదా 15 రోజుల్లో సిద్ధమవుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అపతిపాదిత వలంటరీ వెసికిల్ ఫ్లీట్ మోడరనైజేషన్ ప్రోగ్రామ్(వి-విఎంపి) పథకం తొలి దశ కింద 12నుంచి 15 లక్షల దాకా 15 ఏళ్లకు పైబడిన భారీ వాహనాలను రద్దు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ పిటిఐకి చెప్పారు.

‘బోగస్’ ఐటి ఉద్యోగాలు?

హైదరాబాద్, ఆగస్టు 28: హైదరాబాద్ హైటెక్ నగరంగా వ్యాపిస్తున్న తరుణంలో ఐటి ఉద్యోగాలు కూడా బోగస్‌గా మారుతున్నాయి. అమాయక విద్యావంతులు ఉద్యోగాల కోసం బ్రోకర్ల చేతిలో మోసపోతున్నారు.

Pages