S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ బలోపేతం

మెదక్, ఆగస్టు 28: గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని యూత్ కాంగ్రెస్ మెదక్ నియోజకవర్గ ఇంచార్జీ సంతోష్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం నాడు మెదక్ రహదారి బంగ్లాలో జరిగిన మెదక్ పార్లమెంటరి యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికినీ ఉద్యోగాలు లేక యువకులు రోడ్లపై పడ్డారని సంతోష్‌రెడ్డి తెలిపారు.

హత్నూర మండలాన్ని .. సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలి

హత్నూర, ఆగస్టు 28: ప్రభుత్వం ప్రకటించిన డ్రాప్ట్ ప్రకారం హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని దౌల్తాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిపాదనలు హత్నూర మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కొనసాగించేలా ప్రతిపాదించారని, కానీ ఇందుకు విరుద్దంగా కొందరూ రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం హత్నూర మండలాన్ని మెదక్ జిల్లాలో కొనసాగే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నారన్నారు.

చకచకా జిల్లాల ప్రక్రియ

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించి అందుకు సంబందించిన ముసాయిదాలను విడుదల చేయడమే కాకుండా జిల్లాల రూపురేఖలకు సంబందించిన నియోజకవర్గాలు, మండల కేంద్రాలతో కూడిన పటాలను కూడా విడుదల చేసింది. దిని ఆధారంగా ఇక జిల్లాల ప్రక్రియ చకచకగా సాగుతుందని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి సంకేతాలు ఇచ్చింది. అయితే ముందుగా మూడు జిల్లాలుగా రూపాంతరం చెందుతున్న మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ముందుగా పోలీసుశాఖ తమ కార్యాలయాలపై దృష్టి సారించింది.

విద్యుత్ కోతలు లేని తెలంగాణే లక్ష్యం

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో నిరంతరం విద్యుత్ కోతలు ఉండేవని స్వరాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ కోతలు లేని తెలంగాణగా నిర్మాణం చెందిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని జడ్పి కార్యాలయ సమీపంలో గల 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు.

సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

దేవరకద్ర, ఆగస్టు 28: సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్ర మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద కుడికాలువ 21వ తూంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకోసం కోట్ల రుపాయల నిధులు మంజూరు చేశారన్నారు. 2019 నాటికి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు అందించిన తర్వాతనే ప్రజలను ఓట్లు అడగాలనే సంకల్పంతో పని చేస్తున్నారని అన్నారు.

బంగారు తెలంగాణ సాధనకు కలిసొచ్చిన వారిని కలుపుకుంటాం

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇతర పార్టీల నుండి తెరాసలోకి కలిసోచ్చిన వారిని కలుపుకుంటామని అందరం తెలంగాణ బిడ్డలమనే బావనతో ముందడుగు వేస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాలకు సంబందించిన కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలకు సంబందించిన మండల, గ్రామస్థాయి నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు.

సమష్టి సహకారంతోనే తెలంగాణ అభివృద్ధి

కొత్తూరు, ఆగస్టు 28: ప్రజలందరి సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ద్ధి సాధ్యమవుతుందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఆదివారం కొత్తూరు మండలం చేగూరు గ్రామంలో నూతన ముదిరాజ్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయడంతో పాటు ప్రైవేట్ వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధ్దిలో ప్రజలందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ద్ధికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ స్వయం శక్తితో ముందుకు సాగాలని అన్నారు.

గద్వాల బంద్ విజయవంతం

గద్వాల, ఆగస్టు 28: అన్ని అర్హతలు ఉన్న గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మూడురోజుల బంద్ నడిగడ్డలో విజయవంతమైంది. మూడవ రోజు ఆదివారం ఉదయం నుంచే అఖిలపక్షం నేతలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసి డిపో ఎదుట ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించగా పెద్దఎత్తున పోలీసులు మోహరించి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన నిరసన జ్వాలలు వెల్లువడడంతో ఆర్టీసి అధికారులు బస్సులను నిలిపివేశారు. ప్రతిగ్రామాన పెద్దసంఖ్యలో యువకులు అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి గద్వాలను జిల్లా చేయాలని నినదించారు.

మన జెండాకు వందనం! (మనోగీతికలు)

ఎందరో మహానుభావుల త్యాగఫలం
మన త్రివర్ణ జెండా
అందుకే ప్రతి ఒక్క భారతీయుడిలో
ఉండాలి నిజమైన దేశభక్తి గుండె నిండా
మూడు రంగుల జెండాయే కదరా
సమస్త భారతీయులకు అండ
నీతి నిజాయితీలతో ప్రతి ఒక్కరు మెలగాలి
అప్పుడే కదా దేశఖ్యాతి పాకుతుంది
ఖండాంతరాల గుండా
దేశ గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడే
ఈ జెండాయే మనకు చల్లని నీటికుండ
మనమంతా ఒక్కటై బతకాలి
జాతి, మతం, కులం అని తిట్టుకోకుండా
తెలుగు తల్లికి మల్లెపూదండ
నేటి బాలలే రేపటి పౌరులు
వారే మన దేశానికి బంగారు కొండ

- నాగాస్త్రం నాగు,
సెల్ : 9966023970.

డబ్బుకు లోకం దాసోహం ( కథ)

జెన్నీ ఐ లవ్ యు రా! నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను తెలుసా! చేతుల్లోకి ఆమె మోము తీసుకుని నుదుటిపై చుంబించాడు రాహుల్. అతని వంక ఉదాసీనంగా చూస్తోంది జెన్నీఫర్.
‘ఏం మాట్లాడవేం! నీ బాధ నాతో షేర్ చేసుకో రాదా?
నేనేమన్నా పరాయివాడినా! త్వరలోనే గదా! మనం పెళ్లి చేసుకునేది! రాహుల్ ముఖంలో లాలన.
‘అబ్బే అదేంలేదు పొడిపొడిగా అంది.

Pages