S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల, జూలై 19: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. విశేషమైన గురుపౌర్ణమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న సుపర్ణునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎం.చిత్తరంజన్ గానం చేసిన అన్నమయ్య నామ సంకీర్తన వైభవం సిడిలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు, బోర్డు సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వసతిగృహాలు, చౌల్ట్రీల్లో 3రోజులు మించి ఉన్నవారిపై సమగ్ర సర్వే

తిరుమల, జూలై 19: తిరుమలలోని వసతి గృహాలు, చౌల్ట్రీలలో మూడు రోజులు, అంత కంటే ఎక్కువ రోజులు ఉన్న వారి వివరాలతో టిటిడి ఐటి, విజిలెన్స్, ప్రజా సంబంధాల విభాగాలు సమన్వయంతో సర్వే నిర్వహించాలని టిటిడి ఇ ఓ డాక్టర్ డి సాంబశివరావుఆదేశించారు. మంగళవారం తిరుమలలో జె ఇ ఓ శ్రీనివాసరాజుతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. తిరుమలలోని 7050 వసతిగృహాలు, చౌల్ట్రీలలో తాగునీరు, స్నానానికి వేడినీరు అందుబాటులో ఉండడంతో పాటు కొళాయిలు, వాష్‌బేసిన్‌లు విద్యుద్దీపాలు తదితరాల మరమ్మతులను పరిశీలించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇ ఓ ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల భవనంలోని అక్రమ కట్టడాల తొలగింపు

తిరుపతి, జూలై 19: దామినేడులో నిరుపేదల కోసం నిర్మించిన ఇందిరమ్మ గృహాల్లో 40వ బ్లాక్ నందు పై అంతస్తులో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్‌ను నగర పాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం తొలగించారు. మరిన్ని అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

కాపు కార్పొరేషన్ పేరుతో వంచన

వాల్మీకిపురం, జూలై 19: కాపు కార్పొరేషన్ పేరుతో రుణాలు మంజూరు చేయిస్తామని ఓ యువకుడు జనాన్ని నమ్మించి మోసం చేస్తున్న సంఘటనపై మంగళవారం పలువురు పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి. వాల్మీకిపురంలోని ఎంపిడివో, కాపు కార్పొరేషన్ అధికారులు తనకు బాగా తెలుసునని, తనకు 10 వేల రూపాయలు ఇస్తే బ్యాంకు రుణం మంజూరుచేయిస్తామని మోసం చేస్తున్న విషయాలు కూడా వెలుగుచూశాయి.

మూడవ విడత భగవత్ రామానుజుల సంచార రథం ప్రారంభం

తిరుపతి, జూలై 19: ప్రసిద్ధ శ్రీ వైష్ణవాచార్యులు భగవద్ రామానుజులవారి సహస్రాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మూడవ విడత సంచారరథం తిరుపతి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా 8 దివ్యదేశాలలో సంచార రథం పర్యటించనుంది. మే 10వ తేదీన తిరుమలలో సంచార రథం ప్రారంభించిన విషయం విదితమే. ఈ రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు, శ్రీరామానుజుల వారి విగ్రహం ఉంటాయి. ఈనెల 19వ తేదీ మంగళవారం ఉదయం 6.30 గంటలకు తిరుపతి నుంచి సంచార రథం బయలుదేరి ఉదయం 10 గంటలకు తమిళనాడు రాష్ట్రం వేలూరు, మధ్యాహ్నం 1 గంటలకు సేలం, రాత్రి 8.30 గంటలకు మధురై చేరుకుంటుంది.

సహేతు విమర్శలు చేసినపుడే జర్నలిజం వృత్తికి సార్థకత

తిరుపతి, జూలై 19: ఏ రంగంపై నైనా సహేతుమైన విమర్శలు చేసి వార్తాకథనాలను ప్రచురించినపుడే జర్నలిజం వృత్తికి సార్థకత చేకూరుతుందని అర్బన్ ఎస్పీ జయలక్ష్మి అన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శి గిరిబాబు, సుధీర్‌రెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియా, పోలీస్ వ్యవస్థలకు సమాజంలో ఉండాల్సిన బాధ్యతాయుతమైన అంశాలను నిర్మొహమాటంగా తెలిపారు. ఇందులో ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాపట్ల ప్రజల్లో అపారమైన నమ్మకాలున్నాయన్నారు. వాటని పరిరక్షించబడాలంటే పాత్రికేయులు వాస్తవాలతో కూడుకున్న వార్తాకథనాలు ప్రచురించాలన్నారు.

నియోజకవర్గాల వారీగా బిజెపి బలోపేతానికి శ్రీకారం..

కడప,జూలై 19: బిజెపి జిల్లాలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ఆపార్టీ అధిష్ఠానం జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి రాష్ట్ర,జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పార్టీ నుంచి బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సీమ జిల్లాల్లోని ముఖ్యనేతలంతా కడపను కేంద్రీకృతం చేసుకుని గత కొన్నిరోజులుగా సంప్రదింపులు చేస్తున్నారు. అంతేగాకుండా వచ్చేనెలలో సీమ జిల్లాల వ్యాప్తంగా కడపలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను రప్పించి భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అమిత్‌షా కూడా కడప బహిరంగ సభకు వస్తున్నట్లు ప్రకటించారు.

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

కడప,(కల్చరల్)జూలై 19: స్వస్తిశ్రీ ధుర్ముఖినామ సంవత్సరం ఆషాఢ శుద్ధిపూర్ణిమ (ఆషాఢవ్యాస పౌర్ణమి) పురస్కరించుకుని జిల్లాలో మంగళవారం శ్రీ సద్గురు సాయినాథునికి ఘనంగా పౌర్ణమి వేడుకలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రధానంగా నగరంలోని శ్రీ షిర్డిసాయిబాబా ఆలయాలతోపాటు కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో వెలసివున్న శ్రీ దత్తసాయి మందిరం, శ్రీషిర్డిసాయిబాబా ఆలయం, కో-ఆపరేటివ్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సాయినాథునికి ఉదయం 4గంటలకు కాగడ హారతి, 4.30గంటలకు అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చన, తీర్థప్రసాదాలు, మంగళహారతి ఇచ్చారు.

డ్వాక్రా మహిళలకు మొక్కలు పెంచే బాధ్యతలు

కడప,జూలై 19: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళలకు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. హరిత విప్లవం తీసుకురావడానికి జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు దాదాపు 4లక్షలు మొక్కలు పంపిణీ చేయనున్నారు. డిఆర్‌డిఏ, డ్వామా, మెప్మా, వెలుగు ప్రాజెక్టుల పర్యవేక్షణలో జియోట్యాగ్ పర్యవేక్షణ ద్వారా ఇంటింటా మొక్కలు పంపిణీ చేయనున్నారు.

కన్నుల వైభవంగా శ్రీ సౌమ్యనాథుని కల్యాణం

నందలూరు, జూలై 19:జిల్లాలోనే అతి ప్రాచీన, పురాతనమైందిగా ప్రసిద్ధికెక్కిన నందలూరు శ్రీ సౌమ్యనాథ ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన మంగళవారం జగత్ కల్యాణ చక్రవర్తియైన శ్రీ సౌమ్యనాథస్వామికి శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తుల కన్నుల విందుగా, చూచు వారికి చూడ ముచ్చటగా అంగ రంగ వైభవంగా కల్యాణ మహోత్సవం జరిగింది. తెల్లవారు జామునే సౌమ్యనాథునికి తిరుమంజనం కావించి అచ్చం పెళ్లికుమారుడులా అలంకరించారు. కళ్లు చెదిరే సౌందర్యవంతునిగా పట్టుబట్టలతో వెలుగులు చిందే అభరణాలతో అనంత కోటి సూర్యప్రభ తేజోమూర్తిగా భక్తజన కోటికి శ్రీవారు దర్శనమిచ్చారు.

Pages