S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయినాథుని దీవెనలతో ప్రజలు వర్ధిల్లాలి

సిద్దవటం,జూలై 19: సద్గురు సాయినాథుని దీవెనలతో ప్రజలు వర్ధిల్లాలని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను వేడుకున్నారు. మండలంలో ని భాకరాపేట సమీపంలో ఉన్న 11వ ఎపిఎస్‌పి బెటాలియన్ సమీపంలోని షిర్డిసాయిబాబా ఆలయంలో మంగళవారం జరిగిన గురుపౌర్ణమి మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన సాయినాథునికి అభిషేకాలు తదితర పూజలుచేసి అన్నదాన కార్యక్రమాన్ని ఆయనతోపాటు బెటాలియన్ కమాండెంట్ సామ్యూల్ జాన్సల్‌లు ప్రారంభించారు. అలాగే క్వార్టర్స్‌లో సాయినాథుని గ్రామోత్సవం వైభవంగా జరిగింది.

డంపింగ్‌యార్డు ప్రారంభించిన కలెక్టర్

సంబేపల్లె, జూలై 19: మండల కేంద్రంలోని డంపింగ్‌యార్డును మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 21 డంపింగ్‌యార్డులను మంజూరు చేయగా వాటిలో 9 పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఒక్కొక్క డంపింగ్‌యార్డు రూ.4.50 లక్షలు మంజూరు చేశారన్నారు. ప్రతి మండలంలో డంపింగ్‌యార్డు తప్పనిసరిగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. చెత్త నుండి సంపద పొందాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న చెత్తాచెదారాలను ఇక్కడికి తెచ్చి యార్డులో పోయాలన్నారు. ఈ ప్రాంతపు రైతులకు వాణిజ్యపరంగా వివిధ పంటలపై హార్టికల్చర్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

జగన్‌వి పగటి కలలు : రెడ్యం

ఖాజీపేట,జూలై 19: వైకాపా అధినేత జగన్ ఒకటి రెండు సంవత్సరాల్లో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటూ ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.

నిహారికకు నర్తనబాల అవార్డు ప్రదానం

కడప,(కల్చరల్)జూలై 19: కడప నగరానికి చెందిన స్పందన డ్యాన్స్ అకాడమి చిన్నారి నిహారికకు కులపతి నాట్యాచార్య ఘంటాకనకారావు స్మారక 3నర్తనబాల అవార్డు2ను అందుకుంది. కాగా అభినయ నృత్యభారతి ఏలూరు వారిచే నిర్వహించిన సిద్దేంద్రయోగి జాతీయ స్థాయి బాలల నృత్యోత్సవాల్లో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి నిహారిక నర్తనబాల అవార్డు అందుకుంది. మూడవ తరగతి చదువుతున్న నిహారికను తల్లిదండ్రులు మురళి, లక్ష్మీసృజన, అలాగే భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, నాట్యశిక్షకురాలు స్పందనకుమారి, సరోజలు నిహారికను అభినందించారు.

పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించండి : ఎంఇఓ

చెన్నూరు,జూలై 19: ఈనెల 26వ తేదీన చెన్నూరు మండలంలోని ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు పకడ్బంధీగా నిర్వహించాలని ఎంఇఓ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎంఇఓ మాట్లాడుతూ ఆయా పాఠశాలలకు సంబంధించి విద్యాకమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఈనెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారని, 26న మండలంలో అన్ని పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

చైన్ స్నాచింగ్ దొంగల అరెస్టు

కడప,(క్రైమ్)జూలై 19: కడప నగరంలోని మహిళల మెడలలో నుంచి గొలుసుదొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు, వారు అమ్మిన వ్యక్తి నుంచి రూ.10లక్షలు విలువచేసే బంగారు గొలుసులు, మంగళసూత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కడప డిఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్పీ ఆదేశానుసారం వన్‌టౌన్ సిఐ కె.రమేష్ నేతృత్వంలో ఎస్‌ఐ నాగరాజు, పిఎస్‌ఐలు భాస్కరరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌ఐ నౌషద్‌బాషా, పోలీసులను కోటిరెడ్డి సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేసేందుకు ఆదేశించినట్లు తెలిపారు.

ఘనంగా సాయినాథునికి గురుపౌర్ణమి పూజలు

చెన్నూరు,జూలై 19: గురుపౌర్ణమి పురస్కరించుకుని స్థానిక బ్రాహ్మణవీధిలో వెలసిన శ్రీషిరిడిసాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో సాయిబాబా ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచి సాయినాథునికి అభిషేక పూజలు చేశారు. హోమం, గణపతి పూజ, పలు పూజలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయినాథుని భక్తులు దర్శించుకునేందుకు ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు పూలాభిషేకం నిర్వహించారు. పరమటి వీధిలో వెలసిన సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సారుూ భగవాన్..

అనంతపురం కల్చరల్, జూలై 19: నగరంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా మంగళవారం షిర్డీ సాయిబాబా మందిరాలకు భక్తులు బారులుతీరి సద్గురు సాయినాథ్‌ను దర్శించుకున్నారు. ఆలయాల్లో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, సాయి సత్య వ్రతములు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆషాడ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా, గురుపౌర్ణమి జరుపుకోవడం భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇందులో భాగంగా వివిధ ఆధ్యాత్మిక సంస్థలు, సంప్రదాయాలకు చెందినవారు తమతమ గురువులను పూజిస్తారు.

జగన్‌వి పగటి కలలు...

అనంతపురం కల్చరల్, జూలై 19: వైకాపా నాయకుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్ సిఎం కావాలనే భ్రమలో పగటి కలలు కంటున్నాడని, అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని మంత్రి డా.పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు ఆయన మంగళవారం నగరంలోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా చేపట్టిన గడప గడపకు కార్యక్రమాన్ని బహిష్కరించాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన జగన్ ఏ ఉద్దేశ్యంతో గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని చేపట్టాడో ముందుగా ప్రజలకు తెలపాలని ప్రశ్నించారు.

14న ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

అనంతపురం, జూలై 19 : పంద్రాగస్టు వేడుకలు అనంతలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ముందుగానే ఈనెల 14న జిల్లాకు రానున్నారు. ఆరోజు ఉదయమే అనంతపురం చేరుకుంటారని అధికారులకు సూచన ప్రాయంగా సమాచారం అందింది. ఈ సందర్భంగా జిల్లాలో జరిగే వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హంద్రీనీవా, హెచ్చెల్సీ ఆధునీకరణ, నీరు-చెట్లు, మైనర్ ఇరిగేషన్, వ్యవసాయంపై సమీక్ష ఉండవచ్చని అనుకుంటున్నారు. అలాగే పార్టీ నేతలతో సమావేశం ఉండవచ్చని భావిస్తున్నారు.

Pages