S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల అక్రమరవాణాకు బ్రేకు

విశాఖ: పశ్చిమ బెంగాల్ నుంచి కర్నాటకలోని హుబ్లీకి పిల్లలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో విశాఖ రైల్వే స్టేషన్‌లో మంగళవారం నాడు హౌరా- యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. కోల్‌కత నుంచి హుబ్లీకి తీసుకువెళుతున్న 50 మంది పిల్లలను పోలీసులు రక్షించారు. పిల్లలను తీసుకువెళుతున్న వారిని పోలీసులు ప్రశ్నించగా వారు పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.

దొంగలను చితకబాదిన గ్రామస్థులు

విజయవాడ: పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించిన ఇద్దరు దొంగలకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో మంగళవారం ఈ ఘటన జరిగింది. పట్టుబడిన దొంగలను చితకబాదిన అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్ యువకుడు అమెరికాలో హత్య

హైదరాబాద్: నగరంలోని బడీచౌడి ప్రాంతానికి చెందిన సంకీర్త్ అనే 25 ఏళ్ల యువకుడు అమెరికాలోని టెక్సాస్ నగరంలో సోమవారం హత్యకు గురయ్యాడు. ఈమేరకు ఇక్కడి కుటుంబ సభ్యులకు ఈరోజు సమాచారం అందింది. ఎంఎస్ చదివి టెక్సాస్‌లో గత రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్న సంకీర్త్‌ను సాయిసందీప్ గౌడ్ అనే యువకుడు హత్య చేసినట్లు అక్కడి పోలీసులు అనుమానించి ప్రశ్నిస్తున్నారని తెలిసింది. రెండు వారాల క్రితం సందీప్ గౌడ్ సంకీర్త్ ఉంటున్న ఇంట్లో రూమ్‌మేట్‌గా చేరాడు. సంకీర్త్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

బోనాల కోసం పకడ్బందీ ఏర్పాట్లు

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాల ఉత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి మంగళవారం తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు జనార్దనరెడ్డి తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. బోనాల ఊరేగింపు సందర్భంగా భద్రత కోసం 3వేల మంది పోలీసులను నియమిస్తున్నామని, వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీసు కమిషనర్ చెప్పారు.

నేనెక్కడికీ పోను: సిథ్ధూ భార్య కౌర్

చండీగఢ్: తన భర్త బిజెపికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం బిజెపిలోనే ఉంటానని ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్ మంగళవారం స్పష్టం చేశారు. తన భర్త నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ బిజెపికి రాజీనామా చేసినంత మాత్రాన తాను కూడా పార్టీ మారతానని అనుకోవడంలో అర్థం లేదని ఆమె వివరించారు. పంజాబ్ కోసం పనిచేయాలన్న తపనతో తన భర్త ఎంపీ పదవికి రాజీనామా చేశారని, తాను మాత్రం బిజెపిలో ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజల కోసం కృషి చేస్తానని అన్నారు.

బలోచ్‌ సోదరుడిని క్షమించొద్దు ..

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మోడల్‌ కందిల్‌ బలోచ్‌ను హత్య చేసిన ఆమె సోదరుడిని కుటుంబ సభ్యులు క్షమించొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమ కుటుంబం పరువు తీస్తోందని బలోచ్‌ను హత్య చేసినట్లు ఆమె సోదరుడు మహమ్మద్‌ వసీం అంగీకరించాడు. పాకిస్థాన్‌లో పరువు హత్యలు అధికంగా జరుగుతుంటాయి. కుటుంబ సభ్యులు క్షమించడంతో నిందితులు శిక్ష పడకుండా బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ అధికారులు బలోచ్‌ కేసులో కుటుంబసభ్యులు నిందితుడైన ఆమె సోదరుడిని క్షమించడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. అతడు శిక్ష నుంచి తప్పించుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

635 కిలోల గంజాయి పట్టివేత

ఏలేశ్వరం : ఎర్రవరం దగ్గర పోలీసులు మంగళవారం 635 కిలోల గంజాయిని పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

విద్వేషాలు రెచ్చగొట్టే వెబ్‌సైట్ల‌పై కఠిన చర్యలు

ఢిల్లీ: గత మూడేళ్ళలో మతపరమైన విద్వేష కేసులు పెరిగినట్లు, విద్వేషాలు, మత కలహాలు రెచ్చగొట్టే వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోక్ సభలో తెలిపారు. దాద్రి వంటి ఘటనలపై కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం జరిగిందన్నారు. విద్వేషాలు, మత కలహాలు రెచ్చగొట్టే వ్యక్తులతో పాటు వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగినట్లు తెలిపారు. అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను తమ వైపు ఆకట్టుకుని నియామకాలు చేపడుతున్నాయని వివరించారు.

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలోని గుల్బర్గాలో మంగళవారం మధ్యాహ్నం కారును లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: నేడు స్వల్ప లాభాలతో దేశీయ మార్కెట్లు ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.16 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 27,787 వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 8,528 వద్ద ముగిసింది.

Pages