S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్‌ఫ్లుయెంజా

మామూలుగా జలుబు ప్రభావం శ్వాసావయవాల వరకే ఉంటుంది. ఒక్కోసారి దాని ప్రభావం శరీరమంతటా పడుతుంది. ఒక్కసారిగా వచ్చి శరీర ఉష్ణం పెరిగిపోతుంది. గొంతు రాసుకుపోతుంది. అలసిపోతారు. శరీరమంతా నొప్పులు, పొడి దగ్గు.. ఈ ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలు కొన్ని రోజులకి తగ్గుతాయి. ఒకటి రెండు వారాలు ఈ ఇన్‌ఫ్లుయెంజా ఇబ్బంది పెడుతుంది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అప్పుడప్పుడు ఇలా బాధిస్తుంటుంది. దీనికి రాకుండా వాక్సిన్ లేదు.

రాస్ట్

గడ అంటే రేడియో ఎలెరోసార్జెంట్ టెస్ట్. ఎలర్జీల గురించి తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్ష చేస్తారు. పెంపుడు జంతువుల వెంట్రుకలు, పుప్పొడి రేణువులు, ఆహారం, మందుల ద్వారా వచ్చే ఎలర్జీల గురించి ఈ పరీక్షలో తెలుస్తుంది. ఈ పరీక్ష చర్మపరీక్షలంత కచ్చితమైనదే!
చర్మరోగాలున్న వాళ్లలో ఎలర్జీ రియాక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ఈ రక్త పరీక్ష ఎంతగానో తోడ్పడుతుంది.
సెటోటాక్సిక్, సబ్ లింగ్వియల్ ప్రొవెకేషన్ పరీక్షలు కూడా ఎలర్జీల గురించి తెలుసుకోవడానికి సహకరిస్తాయి కానీ ఈ రెండు పరీక్షలు వివాదాస్పదమే. అందుకని ‘రాస్ట్’ రక్త పరీక్ష ఎలర్జీల గురించి తెలుసుకోవడానికి ఉత్తమం.

స్ట్రెస్ ఫ్రాక్చర్

ఎముకలు విరగడంలో రకరకాలుంటాయి. కాలి ఎముక మీద భారం ఎక్కువ పడినప్పుడు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఏర్పడుతుంటాయి. వీటినే స్ట్రెస్ ఫ్రాక్టర్ అంటారు.
సాధారణంగా ఆటలు ఆడేవాళ్లు ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవుతుంటాయి. ఎక్స్‌రేతో ఈ ఫ్రాక్చర్స్‌ని గుర్తించలేం. రెండు వారాల తర్వాత నిర్ధారించినా ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు గుర్తించడానికి బోన్ స్కాన్ అవసరం రావచ్చు.

పురుషార్థములు

అన్ని జన్మలకంటే మానవ జన్మ ఉన్నతమైనది. ఈ మానవ జీవితంలో మానవులు సాధించాల్సిన పురుషార్థములు నాలుగు ఉన్నాయని పెద్దలు చెపుతుంటారు. పెద్దల మాట సద్దిమూటలాంటిదిగదా! ఈ చతుర్విధ పురుషార్థములే ధర్మం, అర్థం, కామం, మోక్షం. చతుర్విధ పురుషార్థములు పూలుగా పూచిన పుణ్య భారతదేశం మనది. భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధించిన విధంగానే ఆధ్యాత్మిక రంగంలో కూడా మహోన్నతంగా ఎదిగింది. అయితే కొంతమంది ఆధ్యాత్మిక జీవనమునకు అర్థం, కామం ఆటంకం కలిగిస్తాయని అంటారు.

- జాధవ్ పుండలిక్‌రావు

అజీర్తిని ఎదుర్కోండి ఇలా..! (మీకు మీరే డాక్టర్)

ప్రసన్నలక్ష్మి.కె, చీరాల
ప్ర: ఆకలి పూర్తిగా తగ్గిపోయింది. కొద్దిగా తింటే చాలు కడుపు నిండిపోతోంది. గ్యాసు ఇబ్బంది పెడుతోంది. ఉపాయం చెప్తారా సార్?
జ: జీర్ణశక్తి జఠరాగ్నివలన కలుగుతుంది. జఠరాగ్ని మందగించటాన్ని అగ్నిమాద్యం (డిస్పెప్సియా) అంటారు. ఇది అకస్మాత్తుగా రావచ్చు. దీర్ఘకాలికంగానూ బాధించవచ్చు.
జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతినటంవలన డిస్పెప్సియా వస్తుంది. ఏమీ తినకుండానే కుత్తికబంటిగా తిన్నట్టు, మీది పొట్ట నిండిపోయినట్టు అనిపించటం దీనిలో కనిపించే ముఖ్య లక్షణం. గుండెలో మంట, వాంతి, వికారం, త్రేన్పులు, మీదిపొట్టలో నొప్పి లాంటి బాధలు తరచూ తిరగబెడుతుంటాయి.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, ఔఖూశ్ఘష్ద్ఘశజూపభఘౄజ.ష్యౄ

పురుషార్థములు

అన్ని జన్మలకంటే మానవ జన్మ ఉన్నతమైనది. ఈ మానవ జీవితంలో మానవులు సాధించాల్సిన పురుషార్థములు నాలుగు ఉన్నాయని పెద్దలు చెపుతుంటారు. పెద్దల మాట సద్దిమూటలాంటిదిగదా! ఈ చతుర్విధ పురుషార్థములే ధర్మం, అర్థం, కామం, మోక్షం. చతుర్విధ పురుషార్థములు పూలుగా పూచిన పుణ్య భారతదేశం మనది. భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధించిన విధంగానే ఆధ్యాత్మిక రంగంలో కూడా మహోన్నతంగా ఎదిగింది. అయితే కొంతమంది ఆధ్యాత్మిక జీవనమునకు అర్థం, కామం ఆటంకం కలిగిస్తాయని అంటారు.

- జాధవ్ పుండలిక్‌రావు

హరివంశం 189

ఆ మహాదనుజుడి అశేష సైన్యాన్ని దూదిపింజలలాగా తన బాణ కౌశలంతో చెల్లాచెదరుచేశాడు. అనిరుద్ధుణ్ణి ఎవరూ బంధించలేకపోయినారు! అసలీ పోరు ఎట్లా సంభవించిందో చెపుతా వినండి. బాణాసురుడికి ఒక చక్కని చుక్క ఉష అనే కూతురుంది. ఆ ఉష కృష్ణుడి మనవడిపై మనసుపడింది. అదంతా ఒక కథ. ఉష చెలికత్తె చిత్రరేఖ మాయా విద్యా ప్రవీణురాలు. ద్వారకకు వచ్చి ఉషానిరుద్ధులు పరస్పర ప్రేమబద్ధులై ఉన్నారని అనిరుద్ధుడి ద్వారా కూడా తెలుసుకుని, అనిరుద్ధుణ్ణి తన ఐంద్రజాలం ప్రదర్శించి ఉష దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ బాలకుణ్ణి అప్పగించింది.

-అక్కిరాజు రమాపతిరావు

శరవేగంగా ధ్రువ

రాంచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘ధ్రువ’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కాశ్మీర్‌లో షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ వివరాలు తెలియజేశారు. ‘ఇటీవలే కాశ్మీర్‌లో ఓ మెలోడీ సాంగ్‌ను చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుగుతోంది. రాంచరణ్ పాత్ర చాలా ఫ్యాషన్‌గా వుంటుంది. సురేందర్‌రెడ్డి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆయన స్టైలిష్ మేకింగ్ మరోసారి ఈసినిమాలో చూస్తారు.

కబాలి టార్గెట్ 500 కోట్లు

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కబాలి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువైంది. ప్రపంచ వ్యాప్తంగా కబాలి ప్రభంజనం మామూలుగా లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ స్వంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు.

Pages