S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరిగిన పసిడి ధర

దిల్లీ: నిన్న రూ.200 తగ్గి రెండు వారాలు కనిష్ఠానికి చేరుకున్న బంగారం ధర ఈరోజు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ పెరగడంతో పసిడి ధర పైకి వెళ్లింది. దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.30,750కి చేరింది. కేజీ వెండి ధర రూ.70 పెరిగి రూ.46,330కి చేరుకుంది.

ఆరెస్సెస్‌కు రాహుల్ క్షమాపణ చెప్పరు..

దిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌కు తమ పార్టీ యువనేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో తాము న్యాయపరంగా ముందుకు పోతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆరెస్సెస్‌కు క్షమాపణ చెబుతారా? లేక విచారణను ఎదుర్కొంటారా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించడంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఆరెస్సెస్ వేసిన పరువునష్టం కేసును న్యాయపరంగానే రాహుల్ ఎదుర్కొంటారని వారు వివరించారు.

వృద్ధురాలిపై దొంగల దాడి: ఏడుతులాల నగలు దోపిడీ

విశాఖ: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడిచేసి ఏడు తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకుపోయిన సంఘటన అనకాపల్లిలో జరిగింది. దేవుడమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని దొంగలు సోమవారం అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఆమె శరీరంపై ఉన్న ఏడు తులాల నగలను దోచుకుని వారు ఉడాయించారు. తీవ్రంగా గాయపడిన దేవుడమ్మను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.

వైకాపా ఓ పనికిమాలిన పార్టీ: చంద్రబాబు

విజయవాడ: రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని వైకాపా ఎంతగా ప్రయత్నించినా తాను మరింతగా దూసుకుపోతానని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. నిజానికి వైకాపా ఓ పనికిమాలిన పార్టీ అని ఆయన మంగళవారం ఘాటుగా విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు సాధ్యం కాదంటూ వైకాపా నేతలు ఎన్ని సమస్యలు సృష్టించినాసరే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపానని ఆయన అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలనుకునే వారికి జనమే గుణపాఠం చెబుతారన్నారు.

రైతులను బెదిరిస్తున్న మంత్రి హరీష్!

హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు భూ సేకరణ రైతుల పాలిట శాపంగా మారందని, నిర్వాసితులకు నష్టపరిహారంపై సిఎం కెసిఆర్ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. భూములు ఇచ్చితీరాల్సిందేనని మంత్రి హరీష్‌రావు రైతులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల కోసం పాదయాత్రలు చేసేవారిని పోలీసుల ద్వారా అణచివేస్తున్నారని తమ్మినేని అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తమ పార్టీ మహాధర్నా నిర్వహిస్తుందన్నారు.

మల్లన్నసాగర్‌పై నిపుణుల సూచనలు పాటించరా?

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ విషయంలో నీటిపారుదల రంగం నిపుణులు చేస్తున్న సూచనలను ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ ప్రశ్నించారు. నగరంలో మంగళవారం మల్లన్నసాగర్‌పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ రిజర్వాయర్ నిర్మాణం అవసరం లేదన్న అభిప్రాయాలను సైతం నిపుణులు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భూ సేకరణలో రైతులపై అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. రిజర్వాయర్ నిర్మాణం అనివార్యమైతే నిర్వాసిత రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

క్షమాపణ చెప్పకుంటే విచారణకు సిద్ధమా?

దిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ కారణమని గతంలో ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి సుప్రీం కోర్టు మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కోర్టు ఘాటుగా స్పందించింది. ఆరెస్సెస్‌కు క్షమాపణలు చెబుతారా? లేక పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటారా?- అని సుప్రీం కోర్టు కాంగ్రెస్ యువనేతను ప్రశ్నించింది. ఓ సంస్థపై అలాంటి నిందలు ఎలా వేస్తారని కోర్టు నిలదీసింది. ఈ విషయమై జూలై 27లోగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. 2014 మార్చి 6న భివాండిలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌ను విమర్శిస్తూ మాట్లాడారు.

నదుల అనుసంధానంతో ఎపికి మహర్దశ

విజయవాడ: గోదావరి,కృష్ణా నదుల అనుసంధానంతో ఎపికి ఇక తిరుగుండదని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నదుల సంగమ స్థలంలో పూజలు చేశారు. నదులను అనుసంధానం చేసిన ఘనత దేశం మొత్తమీద మన రాష్ట్రానికే దక్కిందన్నారు. నదులు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని, అలనాటు కాటన్ దొర కృషి ఫలితంగా ధవళేశ్వరం వద్ద బ్యారేజీని నిర్మించారని, దాంతో ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాయన్నారు. కొంతమంది ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, కృష్ణా-గోదావరి జలాల అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టును తాను పూర్తిచేయగలిగానని ఆయన వివరించారు. తనను అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే బుల్లెట్‌లా దూసుకుపోతానన్నారు.

మరో 4రోజుల పాటు వర్షాలు

విశాఖ : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు కురవనున్నాయి.

నాంపల్లి కోర్టుకు ఐసిస్ సానుభూతిపరులు

హైదరాబాద్: నగరంలో పట్టువడ్డ ఐసిస్ సానుభూతిపరుల కస్టడీ పిటిషన్ ముగియడంతో ఎన్ఐఏ వారిని నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపర్చింది. మరో ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది.

Pages