S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలియానా గుర్రం.. అక్షయ్ కళ్ళెం..

అందాలభామ ఇలియాన స్వారీ చేస్తున్న గుర్రం అదుపుతప్పితే అక్షయ్‌కుమార్ కళ్లెం వేసి కట్టడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్షయ్‌కుమార్, ఇలియానా కలిసి నటిస్తోన్న హిందీ ‘రుస్తుం’ చిత్రం షూటింగ్ ఈమధ్య లండన్‌లో చేశారు. ఆ చిత్రంలో ఓ సన్నివేశంలో ఇలియానా గుర్రంపై స్వారీ చేస్తూండాలి. షూటింగ్ మొదలైన వెంటనే గుర్రం బెదిరిపోయింది. ఇలియానా గందరగోళానికి గురై పడిపోయే సమయంలో అక్కడే ఉన్న హీరో అక్షయ్ స్పందించి కళ్లాన్ని అందుకుని గుర్రాన్ని అదుపుచేశాడు. నిజానికి ఇది సినిమాకోసం చేసిన గందరగోళం కాదు. నిజంగా జరిగినదే.

అరుణోదయం

అరుణిమ సిన్హా మరో విజయశిఖరాన్ని అధిరోహించింది. శరీరం గడ్డకట్టుకుపోయే చలిలో ఆమె సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. కొండంత బలంతో ఎవరెస్ట్‌ను అధిరోహించి ‘‘ ప్రపంచంలో ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వికలాంగ మహిళ’ రికార్డును సొంతం చేసుకున్న ఆమె ఇపుడు ఇండోనేషియాలో అతి ఎత్తయిన పర్వత శిఖరమైన కర్టెన్జ్ పిరమిడ్‌పై మరో కీర్తిపతాక ఎగురవేసింది. ఆ చల్లటి పర్వతం ‘అరుణిమ’దాల్చింది. నిరంతరం వర్షాలు కురిసే అటవీప్రాంతం, మరోవైపు చుట్టూ మంచుతో కప్పబడిన ఈ పర్వతాన్ని ఎక్కటం సవాల్‌తో కూడుకున్నది.

ఏటేటా ఎదగాలి!

పిల్లలు ఏటేటా ఎదిగితేనే కన్నవారికి సంతోషం. ఆరోగ్యకరమైన జాతి సంపద సమాజానికి ఎంతో అవసరం. కాని దురదృష్టవశాత్తు మనదేశంలో పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలలో పిల్లల ఎదుగుదల సమస్య రానురాను తీవ్రరూపు దాల్చుతోంది. ఈ దేశాలనే ఱ్గన్ళిడ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) అని పిలుస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు 61.8 మిలియన్ల మంది ఉంటే వీరిలో 39శాతం మందిలో వారి వయసుకు తగ్గట్టు ఎదుగుదల లోపిస్తుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ హెచ్చరిస్తున్నారు. ఇందులో భారతదేశం వాటా 24శాతం.

క్యాన్సర్‌పై నీలమ్ పోరాటం..

‘టు క్యాన్సర్ విత్ లవ్’ పుస్తకం బాధితులకు మార్గదర్శి
బౌద్ధమత గురువు నిచీరిన్ డైషోనిన్ బోధనతో ప్రేరణ

బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తాను కీమోథెరపీకి వెళ్ళే ప్రతిసారీ ఈ పుస్తకాన్ని తనతో తీసుకువెళ్ళడంవలన, తప్పక క్యాన్సర్‌ను జయిస్తాను అనే నమ్మకం తనకు కలుగుతున్నదని పేర్కొన్నారు. దీన్నిబట్టి నీలమ్‌కుమార్ రచించిన టు క్యాన్సర్ విత్ లవ్ పుస్తకం పాఠకులను ఏ విధంగా ఆకట్టుకుందో ఇట్టే అవగతం అవుతున్నది.

- పి.హైమావతి

ఎంసెట్-2 లీకేజీపై సమగ్ర విచారణ జరిపిస్తాం

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు విచారణలో తేలితే దోషులపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం తెలిపారు. లీకేజీ ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఎంసెట్-2 పరీక్ష జరగడానికి వారం రోజులు ముందే కోచింగ్ సెంటర్లకు కొందరు విద్యార్థులు గైర్హాజరయ్యారని, లీక్ అయిన పేపర్‌తో వారు ఇంటివద్ద ప్రిపేర్ అయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కోచింగ్ సెంటర్‌లో ప్రతిభ చూపని వారికి ఎంసెట్-2 లో మంచి ర్యాంకులు ఎలా వచ్చాయని కొందరు తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

5 మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లు

విజయవాడ: ఎపిలో ఎన్నికలు జరగని అయిదు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కడప, కర్నూలు, గుంటూరు, ఒంగోలు, తిరుపతి నగర పాలక సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కందుకూరు, రాజంపేట మున్సిపాలిటీలకు కూడా స్పెషలాఫీసర్లను నియమిస్తారు.

టర్కీలో 42 సైనిక హెలికాప్టర్లు అదృశ్యం!

అంకారా : టర్కీలో గత వారం జరిగిన సైనిక తిరుగుబాటు నుంచి 42 సైనిక హెలికాప్టర్లు జాడ తెలియకుండా పోయిందని అధికారవర్గాలు తెలిపాయి. మరో సారి తిరుగుబాటు తలెత్తే అవకాశం లేకపోలేదని కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత వారం సైనిక తిరుగుబాటులో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరో మూడువేల మంది గాయపడిన విషయం తెలిసిందే.

బీకే బన్సల్‌ భార్య, కుమార్తె ఆత్మహత్య

దిల్లీ: అవినీతి ఆరోపణలతో అరెస్టయిన కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ బీకే బన్సల్‌ భార్య, కుమార్తె దిల్లీలోని మయూర్‌ విహార్‌లో తమ ఇంట్లో మంగళవారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. బన్సల్‌ను అవినీతి ఆరోపణలతో జులై 16న సీబీఐ అరెస్ట్‌ చేసింది. బన్సల్‌ ప్రస్తుతం పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఓ వ్యక్తి నుంచి రూ.9లక్షలు లంచం తీసుకుంటుండగా బన్సల్‌ను పట్టుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.

బిజెపికి కీర్తి అజాద్ భార్య గుడ్‌బై..?

దిల్లీ: బిజెపి దిల్లీ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ క్రికెటర్, ఎంపి కీర్తి అజాద్ భార్య పూనమ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజ్యసభకు, బిజెపికి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో కీర్తి అజాద్ భార్య కూడా బిజెపికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకు ఎంపీ కీర్తి అజాద్‌ను గత ఏడాదే బిజెపి నుంచి బహిష్కరించారు. కాగా, బిజెపికి తన భార్య పూనమ్ గుడ్‌బై చెబుతారా? అన్న విషయమై వ్యాఖ్యనించేందుకు కీర్తి అజాద్ నిరాకరించారు.

అశాస్ర్తియ పద్ధతుల్లో ప్రాజెక్టుల నిర్మాణం

హైదరాబాద్: నిపుణుల సలహాలు తీసుకోకుండా అశాస్ర్తియ పద్ధతుల్లో తెలంగాణ సర్కారు సాగునీటి ప్రాజెక్టులను చేపడుతోందని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డిలతో కలిసి మంగళవారం మధ్యాహ్నం సాగునీటి ప్రాజెక్టులపై మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిపుణుల సూచనలు, శాస్ర్తియ అంచనాలు, అధ్యయనాలు లేకుండానే ప్రాజెక్టుల పేరిట వేలాది కోట్ల రూపాయలను కెసిఆర్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం తగదన్నారు. విపక్షాలు లేఖలు రాసినా, ఆందోళనలు చేసినా సిఎం కెసిఆర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

Pages