S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టిఎంయు

వినాయక్‌నగర్, జూలై 19: గడిచిన పక్షం రోజుల నుండి నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మంగళవారం నాటితో ముగిసింది. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగగా, తదనంతరం కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టిఎంయు తన సత్తాను చాటుకుంది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం ఆరు డిపోలు ఉండగా, నిజామాబాద్-2 డిపో మినహా మిగతా ఐదు డిపోలలో టిఎంయు భారీ మెజార్టీతో విజయాలు నమోదు చేసింది. అయితే నిజామాబాద్-2 డిపోలో మాత్రం 13ఓట్ల ఆధిక్యతతో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించింది.

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం

బాన్సువాడ, జూలై 19: గడిచిన రెండుమూడు సంవత్సరాల్లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు పర్యావరణ సమతూల్యతను పెంచేందుకు నడుంభిగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. బాన్సువాడ పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో సుమారు 2వేల మొక్కలు నాటిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

గ్రామ సంఘాలకు మొక్కల సంరక్షణ బాధ్యత

నిజామాబాద్, జూలై 19: హరితహారం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ఈ బాధ్యతను గ్రామ సంఘాలకు అప్పగిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తున్నామని, ఇప్పటికే 40గ్రామాల్లో మొక్కల సంరక్షణ బాధ్యతలను సంబంధిత గ్రామ సంఘాలకు అప్పగించామని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మొక్కల సంరక్షణకు చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ యోగితారాణా వారి దృష్టికి తెచ్చారు.

వర్షాకాలం.. రోగాలమయం

విరేచనాలు ప్రధానంగా రెండు కారణాల వల్ల వస్తుంటాయి. బాక్టీరియా కారణంతో కలిగే బాసిలరీ డిసెంట్రి ఒక రకం. అమీబియావల్ల వచ్చే అమీబియాసిస్ రెండోరకం. ప్రారంభ దశలో రెండు రకాల విరేచనాలు ఒకేవిధంగా ఉంటాయి. చికిత్స చేయించడానికి ఏ రకమైన విరేచనాలు అన్న విషయం తెలుసుకోవడం అవసరం.
అమీబియాసిస్‌లో విరేచనాలు ఎడతెగకుండా అలా అవుతునే ఉంటాయి. బరువు తగ్గుతారు. విరేచనాలు వాసన కొడుతుంటాయి. కడుపులో ఉబ్బరం. అమీబియాతో లివర్, లంగ్స్‌లో చీము పట్టవచ్చు. రెండవ రకం గయార్డయాసిస్ ఆహారం ద్వారా కన్నా నీటి ద్వారా వ్యాపిస్తుంటుంది. కారణాన్ని గుర్తిస్తే ఈ రెండు రకాల విరేచనాలను అరికట్టవచ్చు.

-డా.గోవింద్ ఆర్.వర్మ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్, 8885095601

ప్రోస్టేట్ గ్రంథి వాపుతో యాతనే!

ప్రోస్టేట్ సమస్య 40 సంవత్సరాలు పైబడినవారిలో ఎక్కువగా కనబడుతుంది. ప్రోస్టేట్ గ్రంథి పెద్దది కావడంవల్ల ఈ సమస్య వస్తుంది. దీనిని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుకోవాల్సి వుంటుంది.
కారణాలు
- ప్రోస్టేట్ సమస్య అనేది లైంగిక వ్యాధులవల్ల.
- గాయాలు అవటంవల్ల.
- గౌట్ సమస్యవల్ల వస్తుంటుంది.
లక్షణాలు
- మూత్రంలో మంట రావడం
- ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదలవల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి మూత్రం వచ్చుటకు ఆటంకం ఏర్పడుతుంది.
- మూత్రాశయం బాగా నిండినపుడు కొద్ది కొద్దిగా చుక్కల మాదిరిగా బయటకు వస్తుంది.
- మూత్రంలో రక్తం పడుట

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646

కడుపులో పుళ్లకు...?

కడుపులో పుళ్లున్నవాళ్లు పాలని తాగడం మంచిదనే నమ్మిక ఉంది. మరీ ఎక్కువ పాలు తాగడం కూడా మంచిది కాదు. ఎక్కువ పాలని తాగడంవల్ల కడుపులో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి.
ఎక్కువ ఆల్కహాల్ తాగితే ఆహార నాళం లోపల ఉండే పొర దెబ్బ తింటుంది. అలాగే ఖాళీ కడుపు మీద కాఫీ తాగడం కూడా మంచిది కాదు. కాఫిన్ యాసిడ్ ఉత్పత్తిని అధికం చేస్తుంది.
అందుకే ఇప్పుడు వైద్యులు ఏ ఆహారం, డ్రింక్‌వల్ల మీకు ఇబ్బంది కలుగుతున్నట్లనిపిస్తుందో వాటికి దూరంగా ఉండండి అంటున్నారు.

ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటే...?

ముఖంలో ఉండే ట్రైజెమినల్ నరం స్పందనల వల్ల కలిగే ఇబ్బందిని ట్రైజెమినల్ న్యూరాల్జియా అంటారు. దీనినే డిలోరెక్స్ అని కూడా అంటారు. ముఖంమీద తాకినా, వేడి చల్లదనాలవల్ల నొప్పి కలుగుతుంటుంది. కారణాలు తెలీదు కానీ ఈ నరంనుంచి స్పందనలు అతిగా కేంద్ర నాడీ వ్యవస్థకి చేరడంతో ఈ నొప్పి వస్తుంది. నొప్పి ఒకే స్థాయిలో ఉండదు. వచ్చి తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. ట్రైజెమినల్ నరం అతి స్పందనలు నొప్పిగా మారతాయి. దీన్ని తగ్గించడానికి కొన్ని మందుల్ని వాడతారు. ఇవి నొప్పి నివారణకు సరికాదు. ట్రైజెమినల్ నరం ప్రసారం చేసే స్పందనలనుంచి నొప్పి కలగకుండా రక్షణకోసం.

హెర్నియా

మన శరీరంలో కండరాలు పలుచబడినప్పుడు, లోపలి అవయవాలు చర్మాన్ని ముందుకు తోస్తూ బుడిపెలా కనిపించేవాటిని ‘హెర్నియా’ అంటారు. ఇలాంటి ఇబ్బంది వంశపారంపర్యంగా రావచ్చు.
గజ్జలో వచ్చే హెర్నియా ‘ఇంగ్వినల్ హెర్నియా’ అంటారు. ఇది మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఆడవాళ్లలో ‘్ఫమోరల్ హెర్నియా’ ఎక్కువగా వస్తుంటుంది. డయాఫ్రమ్ దగ్గర ‘హియాటిస్ హెర్నియా’ వస్తుంది. ఇలా రకరకాల ప్రాంతాలలో హెర్నియా వస్తుంది. ఎక్కడ హెర్నియా వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుడికి చూపించుకోవాలి. లేకపోతే కొన్ని సందర్భాలలో హెర్నియా పెరిగి, చర్మం చిట్లి, అవయవాలు బయటికొచ్చి ప్రమాదం వాటిల్లుతుంది.

Pages