S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటి ఇస్తాం.. తీసుకోండి

హైదరాబాద్, జూలై 4: కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఒక సహాయ మంత్రి పదవి అదనంగా ఇచ్చే అంశం మళ్లీ తెరపైకొచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బిజెపి నేత ఒకరు చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి, కేబినెట్‌లో సహాయ మంత్రి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అంతకంటే ముందు శివసేనకు ఒక మంత్రి పదవి అదనంగా ఇస్తామన్న బిజెపి ఆఫర్‌ను ఆ పార్టీ తిరస్కరించిందని, ఆ తర్వాతనే బిజెపి నేతలు బాబుకు ఫోన్ చేశారంటున్నారు.

ఏపి సర్కారులో మిత్రభేదం

హైదరాబాద్, జూలై 4: నవ్యాంధ్రలో మిత్రపక్షమయిన తెదేపా-్భజపా మధ్య కలహాలు ముదురుపాకాన పడుతున్నాయి. విజయవాడలో 45 దేవాలయాల కూల్చివేత వ్యవహారం రెండు పక్షాల మధ్య దూరం మరింతగా పెంచింది. కూల్చివేతలపై సంఘ్ రంగంలోకి దిగడం, వందల సంఖ్యలో స్వాములు రోడ్డుమీదకొచ్చి ధర్నా చేయడంతో రాగల ప్రమాదాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు, ఒకడుగు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. స్వాములతో భేటీ అయి, ఇకపై కూల్చివేతలుండవని, కూల్చిన వాటిని మళ్లీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఆగని పోరాటం

హైదరాబాద్, జూలై 4: న్యాయాధికారుల ఆందోళన విరమింపజేసేందుకు గవర్నర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. న్యాయమైన తమ డిమాండ్లు ఆమోదించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని న్యాయవాదులు తేల్చి చెప్పారు. ఆందోళన విరమించాలని, న్యాయమైన కోర్కెలకు పరిష్కారం లభిస్తుందని గవర్నర్ నరసింహాన్ న్యాయవాదులకు సూచించారు. దేశంలో తొలిసారిగా తెలంగాణలో న్యాయాధికారులు ఆందోళనకు దిగారు. దీనిపై కేంద్రంతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం స్పందించారు. సిజెఐని టి.న్యాయవాదుల ప్రతినిధి బృందం ఆదివారం ఢిల్లీలో కలిసిన తరువాత సమస్య పరిష్కారమైనట్టేనని అందరూ భావించారు.

యథావిధిగా ఆరోగ్యశ్రీ

హైదరాబాద్, జూలై 4 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళన విరమించారు. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర వైద్య మంత్రి సి. లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం జరిపిన చర్చలు ఫలించాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు నెలరోజుల్లోగా చెల్లిస్తామని వైద్యమంత్రి హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.

ఐటీలో దూసుకెళ్తున్నాం

హైదరాబాద్, జూలై 4: కొత్తరాష్ట్రం అయినా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని, ప్రపంచంలోని అనేక దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంపిక చేసుకుంటున్నారని ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో సోమవారం ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రం సాధించిన పారిశ్రామిక ప్రగతిని కెటిఆర్ వివరించారు. రెండేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్, ఐటి పరిశ్రమలు అనేక రంగాలకు సంబంధించి అనేక సందేహాలు ఉండేవని, సమర్ధవంతమైన పాలనతో సందేహాలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిలో దూసుకెళ్తున్నట్టు చెప్పారు.

హరిత చరితం!

హైదరాబాద్, జూలై 4: హరితహారం క్రతువును 8న సిఎం కెసిఆర్ నల్లగొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. అదేరోజు అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రహదారిపై నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సిఎం మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభిస్తారని సిఎంవో వెల్లడించింది. విజయవాడ జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దు వరకూ సుమారు 165 కిలోమీటర్ల దారి పొడవునా ఇరువైపుల 85వేల పూల, నీడ నిచ్చే మొక్కలు నాటాలని ప్రభుత్వం సంకల్పించింది.

కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ అరెస్టు

న్యూఢిల్లీ, జూలై 4: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్‌ను సోమవారం సీబిఐ అరెస్టు చేసింది. రూ.50 కోట్ల అవినీతి కేసులో రాజేంద్రకుమార్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ‘అరెస్టయిన వారిపై అవినీతి, అధికార దుర్వినియోగం అభియోగాలు ఉన్నాయి. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని గౌడ వివరించారు. రాజేంద్రకుమార్‌తో పాటు తరుణ్‌శర్మ, సందీప్ కుమార్, దినేశ్ గుప్తా, అశోక్‌కుమార్‌లు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ అయిదుగురిని మంగళవారం ఢిల్లీలోని పాటియాలా కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తారు.

యూపీకే పెద్దపీట?

న్యూఢిల్లీ, జూలై 4: ప్రధాని నరేంద్ర మోదీ జట్టులో మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు పూరె్తైంది. రాష్టప్రతి భవన్‌లో నేడు 11 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో నరేంద్ర మోదీ ఏడు నుంచి తొమ్మిది మంది కొత్త వారిని కేబినెట్‌లో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గం విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు పెద్దపీట వేస్తున్నట్టు సమాచారం. బిజెపి అధ్యక్షుడు అమిత షా కూడా మంగళవారం లేదా బుధవారం బిజెపి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. అయితే, కేబినెట్‌ను మోదీ పునర్వ్యవస్థీకరిస్తారా? విస్తరిస్తారా? అనేది ఇంకా స్పష్టం కావటం లేదు.

సౌదీలో పేలుళ్లు

రియాద్, జూలై 4: సౌదీ అరేబియా పట్టణాలైన మదీనా, ఖాటిఫ్, జెద్దాలు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత బాంబు పేలుళ్లతో దద్దరిల్లాయి. రంజాన్ ఉపవాస నెల చివరి రోజున ఈ దాడులు జరగటం తీవ్రస్థాయిలో ఆందోళనకు దారితీసింది. ఈ సంఘటనల్లో పలువురు మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో ఆయా మసీదుల వద్ద హాహాకారాలు మిన్నంటాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయని సాక్ష్యులు తెలిపారు. మొత్తం మూడు విస్ఫోటనాల శబ్దాలు తమకు వినిపించినట్లుగా వెల్లడించారు.

గుడుల జోలికొస్తే సహించం!

విజయవాడ, జూలై 4: విజయవాడలో రోడ్ల విస్తరణ పనుల పేరుతో అనేక ఆలయాలను తొలగించడం పట్ల హిందూ మత సంస్థలు, ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుడుల కూల్చివేతను ఖండిస్తూ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ సహా వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు సోమవారం సమావేశమై చర్చించారు. వీరిలో ఒక బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తరువాత వన్‌టౌన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో పలువురు మాట్లాడారు.

Pages