S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాజెక్ట్ పనులను సకాలంలో పూర్తి చేయాలి

హైదరాబాద్, జూలై 3: నగర శివారు ప్రాంతాల్లో నీటి వ్యవస్థను మేరుగు పర్చేందుకు రూ.1900 కోట్లతో చేపడుతున్న పనులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యం చేపడుతున్న, చేపట్టనున్న పనులపై ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ ప్రాజెక్టు విభాగం డైరెక్టర్లు, సిజిఎం, జిఎంలో సమావేశమై పనుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల వద్ద తప్పకుండా సిసి కెమెరాలను ఏర్పాటు చేయలని ఎండి అధికారులను అదేశించారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

కెపిహెచ్‌బి కాలనీ, జూలై 3: పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆసుపత్రి వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. ఆదివారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కెపిహెచ్‌బికాలనీ రోడ్‌నెం.1లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ కంటి ఆసుపత్రిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలందించడంలో గ్లోబల్ హాస్పిటల్ ముందుందన్నారు. కెపిహెచ్‌బికాలనీలో గ్లోబల్ కంటి ఆసుపత్రిని ప్రారంభించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

శేరిలింగంపల్లి, జూలై 3: రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, హఫీజ్‌పేట కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో న్యూ హఫీజ్‌పేట లోని ఆదిత్యనగర్ ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అతిథులు సూచించారు.

కత్తితో గొంతుకోసి భార్యను కడతేర్చిన భర్త

కీసర, జూలై 3: భార్యపై అనుమానంతో గొంతుకోసి భర్త గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సిఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పోచారం గ్రామానికి చెందిన మద్దెల మహేశ్ (30) అదే మండలం రామావరం గ్రామానికి చెందిన రజిని (25)తో వివాహం జరిగింది. వీరికి సోమేశ్(6) సింధు(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం కీసర మండలం గోధుమకుంట అనుబంధ గ్రామమైన కుందన్‌పల్లికి వలస వచ్చారు. సుర్వి కృష్ణ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

అల్వాల్, జూలై 3: మానవత్వానికి మచ్చ తీసుకవచ్చిన ఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారిపై మానవ మృగం దాడి చేసి అత్యాచారం చేసి ఘోరంగా బండరాయితో మోది హత్య చేసిన కిరాతకున్ని అక్కడే ఉన్న మిలటరీ జవానులు పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. నగరంలోను ఘటన సంచలనం రేపింది. తల్లితండ్రుల పేదరికం, మద్యానికి అలవాటు చిన్నారి ప్రాణం మీదకు వచ్చింది. బొల్లారం ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మచ్చబొల్లారం కృష్ణనగర్ నివాసి అనిల్ పాత నేరస్థుడు. అతనిపైన ఎనిమిది క్రిమినల్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాయి.

వీరశైవులు సంఘటితం కావాలి

వికారాబాద్, జూలై 3: రంగారెడ్డి జిల్లాలో వీరశైవులను సంఘటితం చేయడానికి వీరశైవ లింగాయత్-లింగాయత్ బలిజ సంఘం కృషి చేస్తుందని జిల్లా గౌరవాధ్యక్షుడు నాగభూషణం అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ మల్లికార్జున భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతి మండలంలో కమిటీలను ఏర్పాటు చేసి, వీరశైవ ధర్మాన్ని వ్యాపింప జేస్తామని చెప్పారు. బసవేశ్వరుని బోధనలను ఆచరించాలని కోరారు. జిల్లా ప్రధానకార్యదర్శి బిచ్చిలింగం మాట్లాడుతూ బసవేశ్వరుని జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు.

పోలీసులకు సవాల్‌గా మారిన చైన్‌స్నాచర్లు

హైదరాబాద్, జూలై 3: నగరం, శివారు ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను వెంబడించి దాడిచేసి తప్పించుకు తిరుగుతున్న చైన్ దొంగలను పట్టుకోవడానికి పోలీసులకు సవాల్‌గా మారాయి.

కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందేలా చూడాలి

మహేశ్వరం, జూలై 3: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలోని లబ్దిదారులకు అందేలా కృషి చేస్తూ 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో బిజెపిని బలమైన శక్తిగా తయారు చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రేమ్‌రాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహేశ్వరం మండల కేంద్రంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాలులో మండల బిజెపి కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందేలా బిజెపి కార్యకర్తలు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.

అసమాన మార్గదర్శకుడు రామారావు

ముషీరాబాద్, జూలై 3: సామాన్య జీవన శైలితో అందరికీ దశ, దిశ నిర్దేశం చేసిన అసమాన మార్గదర్శకుడు దివంగత వి.రామారావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. గోపాల్‌రావు ఠాకూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడలోని కేశవ స్మారక పాఠశాలలో సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు స్మారకార్ధం ‘ఆదర్శ ప్రజప్రతినిధి వి.రామారావు’ పుస్తకావిష్కరణ , స్మారక ప్రసంగం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జస్టిస్ సివి రాములు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. జస్టిస్ సివి రాములు పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించి ప్రసంగిస్తూ జనసంఘ్ నుండి బిజెపి వరకు రామారావు పాత్ర అసమాన్యమైందని అన్నారు.

కష్టపడే రైతన్నల అభివృద్ధికి పాలకవర్గం పనిచేయాలి

శంకర్‌పల్లి, జూలై 3: కష్టపడి వ్యవసాయం చేసే రైతన్నల అభివృద్ధికి స్థానిక మార్కెట్ కమిటీ పాలకవర్గం అండగా ఉండి పనిచేయాలని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారంనాడు శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్.. రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 44 మార్కెట్ కమిటీల్లో ఆన్‌లైన్ సేవలు కొనసాగుతున్నాయని అన్నారు. తాండూరు, వికారాబాద్, శంకర్‌పల్లిలో సేవలందుతున్నాయని చెప్పారు. అభివృద్ధికి కోటి రూపాయలను మంజూరు చేయడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

Pages