S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మణ్‌కు బిజెపి శ్రేణుల శుభాకాంక్షలు

రాజేంద్రనగర్, జూలై 3: భారతీయ జనత పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ జన్మదినాన్ని పురస్కరించుకోని రాజేంద్రనగర్ భాజపా నాయకులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా మజ్థూర్ మోర్చ అధ్యక్షుడు అడికె రాజు ఆధ్వర్యంలో భాజపా శ్రేణులు రాజేంద్రనగర్ నుండి తరలివెళ్ళి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడి రాంచంద్రారెడ్డి, కడియం సుధాకర్, అడికె జనార్థన్, సత్యనారాయణ ముదిరాజ్, సోమారం రాజ్‌కుమార్, రావుల భాస్కర్, నవారు మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.
సరూర్‌నగర్‌లో..

సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, కవితపై భగ్గుమన్న బిజెపి

హయత్‌నగర్, జూలై 3: భారత దేశాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా అభివృద్ది చేసేందుకు పాటుపడుతున్న ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, ఆయన తనయుడు కేటిఆర్, ఎంపి కవిత కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బిజెపి జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. హయత్‌నగర్ మండల బిజెపి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం కమ్మగూడలోని సామ శ్రీనివాస్‌రెడ్డి గార్డెన్‌లో నిర్వహించారు.

అశ్లీల వెబ్‌సైట్‌లోకి పెళ్లికి ముందు వీడియో చిత్రాలు

హైదరాబాద్, జూలై 3: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రూపేష్ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ మాదాపూర్‌లో కార్ వాష్ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఓ యువతి రూపేష్ క్లాస్‌మేట్స్.. ఇద్దరు బిటెక్‌లో చేరారు. ఫస్టియర్‌లో ఏర్పడిన పరిచయం కాస్త, సెకండియర్‌లో ఇష్టంగా మారి హద్దులు దాటింది. పెళ్లికి ముందు చేయని తప్పులన్నీ చేసేశారు. ఫైనల్ ఇయర్ పూర్తయ్యేసరికి వారి ప్రేమ టైమ్‌పాస్‌గా సాగింది. ఆ ఇద్దరు ఒకరినొకరు రాజీ పడి విడిపోగా ఆ యువతికి పెళ్లయింది. పెళ్లికి ముందు తనను ఇబ్బంది పెట్టకూడదని ఇద్దరూ చేసుకున్న బాసలు చెదిరిపోయాయి. ఆమెకు మాటిచ్చిన రూపేష్ మాటపై నిలబడలేదు.

డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్.. 28 మందిపై కేసులు నమోదు

ఖైరతాబాద్, జూలై 3: నగర ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 28మందిపై కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఏసిపి పరిధిలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలుప్రాంతాల్లో ఈ తనిఖీలను నిర్వహించారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారిని బ్రీత్ ఎనలైజర్ ద్వారా గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 10 ద్విచక్రవాహనాలు, రెండు లారీలు, కార్లు ఉన్నాయి. వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామని ఏసిపి మాసూమ్‌బాషా తెలిపారు.

మజ్లిస్ వ్యాఖ్యలపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి

సైదాబాద్, జూలై 3: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ అరెస్టు చేసిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామన్న మజ్లిస్ పార్టీ నాయకుల వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం సైదాబాద్‌లోని వైదేహి ఆశ్రమంలోని అనాథ బాలికల మధ్య ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు హైదరాబాద్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని అన్నారు.

గోల్కొండ బోనాలకు విస్తృత ఏర్పాట్లు

నార్సింగి, జూలై 3: చారిత్రత్మకమైన గోల్కొండ కోట బోనాల జాతర పండుగ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అదివారం గోల్కొండ కోటలో శ్రీజగదాంభిక మహాంకాళీ దేవాలయం చైర్మన్ కోయిల్‌కర్ గోవింద్‌రాజ్ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాల బోనాల జాతర సమీక్ష సమావేశం నిర్వహించారు. బోనాల ఉత్సవాలను ఇప్పటికే నిర్వహించినట్లు తెలిపారు. మరింత గొప్పగా బోనాల పండుగను నిర్వహించుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారని మంత్రి అన్నారు. ఏడవ తేదీ గురువారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవువుతాయని పేర్కొన్నారు.

ఓర్వకల్లుకు చైనా సంస్థలు!

కర్నూలు, జూలై 3: కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడలో 3 చైనా కంపెనీలకు భూమిని కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఇటీవల చైనాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కంపెనీలతో చర్చించి అందులో 11 కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకోగా, మరికొన్ని కంపెనీలు క్షేత్రస్థాయిలో పర్యటించి వసతులు, వనరులను పరిశీలించి తమ నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించినట్లు సమాచారం. అందులో మూడు కంపెనీలకు ప్రకాశం జిల్లా దొనకొండతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడలో వారు కోరిన చోట భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించనుందని తెలు స్తోంది.

నేడు ఎఫ్‌ట్యాప్సీ వంద సంవత్సరాల వేడుకలు

హైదరాబాద్, జూలై 3: ఎఫ్‌టాయఫ్సీ శత వసం తాల వేడుకలు సోమవారం ఇక్క డ జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఈ వేడుకలను ప్రారంభిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య, వ్యాపార, పారి శ్రామిక వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (్ఫ్యప్సీ).. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫ్ టాయఫ్సీ)గా మారినది తెలిసిందే. పారిశ్రామిక రంగానికి ధీటైన నాయకత్వం అందించిన ఎఫ్‌టాయఫ్సీ 1917లో ఆవిర్భవించింది. వాణిజ్య, వ్యాపార, పరిశ్రమల రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో వర్తకుల హక్కుల పరిరక్షణకు అండగా నిలిచింది.

తూర్పు కనుమల్లో రంగురాళ్ల నిధి!

విశాఖపట్నం, జూలై 3: విశాఖ జిల్లాలోని తూర్పు కనుమల్లో రంగురాళ్ల నిధి ఉన్నట్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. అత్యంత విలువైన అలెగ్జాండ్రైట్ రకం రంగురాయి నిల్వలను దాదాపు 51.26 టన్నుల మేరకు గుర్తించారు. ఏజన్సీలోని కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు జరగడం, కొంతమంది వ్యాపారులు ఈ వ్యవహారాల్లో పట్టుబడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా విశాఖ జిల్లా ఏజన్సీలో రంగురాళ్ల నిల్వలపై అధ్యయనం చేశారు.

ఫిక్కీ తెలంగాణ, ఏపి చైర్మన్లుగా సురానా, ప్రభాకరరావు

హైదరాబాద్, జూలై 3: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (్ఫక్కీ) తెలంగాణ మండలి చైర్మన్‌గా భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేంద్ర సురానా, ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్‌గా ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం ప్రభాకరరావు ఎన్నికయ్యారు. వీరిరువురు సోమవారం ఇక్కడ జరిగే ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫిక్కీ జాతీయ స్థాయిలో కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కాగా, సురానా మాట్లాడుతూ పరిశ్రమల రంగానికి సేవలు అందించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Pages