S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ శాస్తవ్రేత్తలకు ఫార్మా రిసెర్చ్ అవార్డులు

హైదరాబాద్, జూలై 3: ఔషధ రంగంలో వినూత్న పరిశోధనలు చేసిన ఐదుగురు యువ శాస్తవ్రేత్తలకు సిప్రా ఇన్నోవేటివ్ ఫార్మా రిసెర్చ్ అవార్డులను ప్రదానం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సనత్‌నగర్ (హైదరాబాద్)లోని సిప్రా ల్యాబ్స్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైనె్సస్ డైరెక్టెర్ జావేద్ ఇక్బాల్ చేతులమీదుగా ఈ అవార్డులను శాస్తవ్రేత్తలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 96 పరిశోధనాత్మక వ్యాసాలు వచ్చాయి.

మదుపరుల దృష్టి వర్షాలపైనే

న్యూఢిల్లీ, జూలై 3: వర్షాలు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో అంతకుముందు వారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. గత వారం కోలుకున్నది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 747.20 పాయింట్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 239.75 పాయింట్లు ఎగిసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇందుకు దోహదం చేశాయి.

స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల సంపద!

న్యూఢిల్లీ, జూలై 3: నల్లధనానికి అసలుసిసలు చిరునామాగా నిలిచే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల సంపద తగ్గిపోతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. తాజా గణాంకాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో సొమ్మున్న విదేశీయుల జాబితాలో భారత్ 75వ స్థానానికి పడిపోయింది. నిరుడు 61వ స్థానంలో ఉంది. నిజానికి 2007 వరకు టాప్-50లో ఉన్న భారత్.. 2004లోనైతే 37వ స్థానంలో నిలిచింది. ఇదిలావుంటే స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకైన స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బి) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో అధిక సొమ్మున్న దేశస్తుల్లో బ్రిటన్ ప్రథమ స్థానంలో ఉంది.

స్టాక్ మార్కెట్లలోకి ప్రథమార్ధంలో రూ. 20 వేల కోట్లు

న్యూఢిల్లీ, జూలై 3: విదేశీ మదుపరులు దేశీయ రుణ మార్కెట్ల కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి- జూన్)లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపా యలకుపైగా పెట్టుబడులను తీసుకువస్తే, రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. గత నెల జూన్ విషయానికొస్తే స్టాక్ మార్కెట్లలోకి 3,713 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. రుణ మార్కెట్ల నుంచి 6,220 కోట్ల రూపాయలను పట్టుకుపోయారు. మే నెలలో కూడా 4,409 కోట్ల రూపాయల పెట్టుబడులను రుణ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకున్నారు.

20లోగా పుష్కర పనులు పూర్తయ్యేలా కసరత్తు

విజయవాడ, జూలై 3: కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులు ఈనెల 20లోగా పూర్తిచేసేలా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారని కృష్ణా పుష్కరాలకు, ప్రత్యేక అధికారిగా నియమించిన బి.రాజశేఖర్‌కు జిల్లా కలెక్టర్ బాబు.ఎ వివరించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్, జిల్లా కలెక్టర్ బాబు.ఎతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పుష్కరాలపై వివరిస్తూ ఆగస్టు 12 నుండి 23 వరకు నిర్వహించే పుష్కరాలకు అన్ని శాఖలకు సంబంధించిన పనులు 24 గంటలు నిర్వహిస్తున్నారన్నారు.

పుష్కర ఘాట్ల పనులను అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ బాబు.ఎ

విజయవాడ, జూలై 3: ఈనెల 20లోగా పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. కృష్ణా పుష్కరాలకు చేపడుతున్న ఘాట్లు, ఇతర అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ బాబు.ఎ శనివారం రాత్రి 10 గంటల నుండి ఆదివారం తెల్లవారుఝామున 3 గంటల వరకు కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్, దుర్గా ఘాట్, భవానీఘాట్, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఘాట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులు పలు సూచనలు చేశారు.

పక్కదారి పడుతున్న ‘ఉచిత ఇసుక

పెనమలూరు, జూలై 3: ఇసుక రవాణాలో అవినీతిని అరికట్టి పారదర్శకతను నెలకొల్పేందుకు, పేద ప్రజలకు ఆర్ధిక ఉపశమనం కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని కొందరు నేతలు నిర్వీర్యం చేస్తూ కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే ఈ దందా కొనసాగుతుండటం ప్రజలను విస్మయపరుస్తోంది. పెనమలూరు నియోజకవర్గంలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, కంకిపాడు నియోజకవర్గాలకు చెందిన మద్దూరు, రొయ్యూరులలో ఇసుక ర్యాంపులు వున్నాయి. యనమలకుదురులో ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అనుమతి నిరాకరించింది.

6 నుంచి డెల్టాకు గోదావరి జలాలు

జి.కొండూరు, జూన్ 3: జి.కొండూరు మండలంలో జరుగుతున్న పోలవరం కుడి ప్రధాన కాలువ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. వెలగలేరు శివార్లలో, బుడమేరుపై హెడ్ రెగ్యులేటర్ వద్ద, వరదనీరు ప్రవహించే ప్రదేశాలను పరిశీలించారు. ఈ నెల 6 నుంచి పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్ళించి, వాటిని డెల్టాకు సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. పట్టిసీమ నీటిని ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రకాశం బ్యారేజికి మళ్ళించే క్రమంలో ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వెలగలేరు వద్ద శాశ్వత వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు.

అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజల గుణపాఠం తప్పదు

మచిలీపట్నం, జూలై 3: పట్టణాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సైకిల్ యాత్రలో భాగంగా ఆదివారం ఆయన పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుతో కలిసి 42వ వార్డులో పర్యటించారు. వార్డులో నెలకొన్న మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.2.60 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి తాము ముందుకురాగా స్థానిక ప్రజాప్రతినిధి ఇందుకు సహకరించకపోవడం బాధాకరమన్నారు. అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసిరావాలని కోరారు. లేకుంటే చరిత్రహీనులుగా మిగలాల్సి వస్తుందన్నారు.

మీ త్యాగనిరతి గ్రామానికి వరం

చల్లపల్లి, జూలై 3: గాంధిజీ స్వచ్ఛ భారత్ కల నెరవేరేందుకు స్ఫూర్తిదాయక సేవలందిస్తున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల త్యాగ నిరతి గ్రామానికి వరమని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వచ్ఛ చల్లపల్లి 600వ రోజు వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధప్రసాద్ స్వచ్ఛ కార్యకర్తలతో కలిసి చిల్లలవాగు వద్ద నుండి ప్రధాన రహదారి వెంట పాద యాత్రగా ర్యాలీ నిర్వహించారు.

Pages