S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11నుంచి సమ్మె

న్యూఢిల్లీ, జూలై 3: ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెంచిన వేతనాలు తమకు సరిపోవంటూ దేశవ్యాప్తంగా ఉన్న 33 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 11నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు. 7 వేల రూపాయలుగా ఉన్న బేసిక్ వేతనాన్ని 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫార్ములా ప్రకారం వేతన సంఘంలో రూ. 18 వేలుగా నిర్ణయించారు. అయితే 3.68 శాతం ఫిట్‌మెంట్ ఫార్ములా ప్రకారం రూ 28,000గా నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం’ అని అఖిల నారత రైల్వే మెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, జాతీయ సంయుక్త కార్యాచరణ కౌన్సిల్ కన్వీనర్ అయిన శివగోపాల్ మిశ్రా ఆదివారం ఇక్కడ చెప్పారు.

జల వివాదంపై త్రిసభ్య కమిటీ

హైదరాబాద్, జూలై 3: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యాను నియమించారు. ఈ కమిటీలో కేంద్ర జల సంఘం సీనియర్ ఇంజనీర్లు ఏకె బజాజ్, సురేష్ చంద్రను సభ్యులుగా నియమించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిని కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు, రాయలసీమకు విడుదల చేసే విషయమై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఈ నివేదికను కృష్ణా బోర్డు కూడా పరిశీలించి తన నిర్ణయం తెలియచేస్తుంది.

సమన్వయమే శరణ్యం!

అంతర్జాతీయ ఉగ్రవాదం వెర్రితలలు వేస్తోంది. ఓర్లాండో, ప్యారిస్ నుంచి ఇస్తాంబుల్, ఢాకా వరకూ ఏ నగరానికీ నిర్భయంగా మనుగడ సాగించగలిగే పరిస్థితులు కనుమరుగే! ఎప్పుడు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంపై, ఎలాంటి నగరంపై ఉగ్రవాదులు విరుచుకు పడతారో తెలియని పరిస్థితి మరింతగా కలవర పెట్టేదే..నిన్న అల్ ఖైదా, నేడు ఐసిస్..పేరేదైనా వాటి వాదం ఉగ్రవాదం. అరాచక వాదం. శాంతిని కబళించి మానవత్వానికి పాతరేసే అమానుష, అనాగరిక విధానం. ఢాకాలో తాజాగా జరిగిన భయానక ఊచకోత ప్రపంచ దేశాలన్నింటినీ కల్లోల పరిచింది. వరుసగా గత పది రోజులుగా ఐసిస్ మారణకాండ సాగించని రోజులేదు.

అనవసర జాప్యంతో అనర్థం

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని భవనాలకు గత బుధవారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరగటం, ప్రభుత్వ సిబ్బంది తమ కార్యాలయాలలోకి ఆనందోత్సాహాలతో ప్రవేశించడం, ఆ సంరంభాలను టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలతో గమనించడం శాశ్వతంగా గుర్తుండిపోయే దృశ్యాలు. ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలోచించిన వారికి బహుశా రెండు భావనలు కలిగివుంటాయి. ఒకటి భవిష్యత్తుకు సంబంధించినది కాగా, రెండవది గత అనేక దశాబ్దాల పరిణామాలు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)

కుటిల రాజకీయం

రాష్ట్ర విభజన తర్వాత అండగా నేను వున్నాను, అధైర్య పడకండి! తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు. తల్లిని నేను తిరిగి బ్రతికిస్తాను! అంటూ భారీ సెంటిమెంట్ డైలాగులు చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు కనుక కాన్పు తర్వాత తల్లిని రోడ్డుపై పడేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకూ ప్రమాదకరంగా తయారౌతోంది. సొంత ఆదాయ వనరులు అంతంత మాత్రం కావడంతో ఆర్థిక అవసరాలకోసం బహిరంగ మార్కెట్ ఋణాలపై ఆధారపడవల్సి వస్తోంది. ఈ ఏడాది రూ.24 కోట్లకు పైగా ఋణం తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

షాపింగ్‌కి వేళాపాళా అక్కరలేదిక!

‘‘ఏమండోయ్! దోమలమందయిపోయింది!’’ పసిపిల్లాడికి గ్రైప్ వాటర్ అయిపోతే కంగారుగా కేక వేసినట్లు- ‘‘మళ్లీ దుకాణం కట్టేస్తాడు సందుమొగ సేఠ్’’- అంటూ మొగుణ్ని కంగారు పెట్టేస్తుంది ఓ ఇల్లాలు.
‘‘అందుకే ఆన్‌లైన్‌లో కొట్టడం నేర్చుకో. నీకు మొబైల్ వుందా?’’ అంటాడు భర్తగారు. ‘‘దోమలమందు కోసం ఆన్‌లైనా? ఆన్ ద వే తెచ్చేసుకోవాలిగానీ. నేనే ఆగుదును కానీ, అక్కడ ముక్కేదిరా? అంటే యిలా త్రిప్పి అలా చూపించినట్లు కిలోమీటరున్నర దూరం తిరగాలి. అంచేత నాన్నాజీ ఆటో వచ్చేస్తుంది అని ఇంటికి దూసుకొచ్చేశానంటుంది భార్యామణి.

విప్లవవీరుడి త్యాగానికి విలువేదీ?

భారతమాత దాస్యశృంఖలాలను ఛేదించడానికి జాతి యావత్తు అహింసే పరమధర్మమని ప్రగాఢంగా విశ్వసించి ఉన్న తరుణంలో దానికి భిన్నంగా సర్వశక్తి సంపన్నులైన బ్రిటిష్ పాలకులపై విలక్షణమైన రీతిలో సాయుధ పోరాటం జరిపిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. విశాఖ, గోదావరి ఏజెన్సీ ఏరియాల్లో నాగరికతకు దూరంగా, బతుకుతున్న ఆదివాసీలను సంఘటితపరచి వారిలో దేశభక్తిని రగిల్చి సాయుధులుగా తీర్చిదిద్ది బ్రిటిష్ ప్రభుత్వంపై సమరశంఖాన్ని పూరించిన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు.

-పెన్మత్స శ్రీహరిరాజు సెల్: 9848054455

ప్రభుత్వం విరమించుకోవాలి

ఘట్‌కేసర్, జూలై 3: రంగారెడ్డి జిల్లా ప్రాంతాన్ని ఇతర జిల్లాలకు విస్తరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని కెఎల్‌ఆర్ గెస్ట్ హౌస్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో గడ్డం ప్రసాద్‌కుమార్, డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో కలిసి మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలను కేసిఆర్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు.

కాజేసిన నిధులను వెంటనే చెల్లించాలి

ఘట్‌కేసర్, జూలై 3: పోచారం ఎల్‌ఐజి కాలనీలో అభివృద్ధి, మరమ్మతుల పేరుతో లక్షలాది రూపాయలను కాజేసిన అధ్యక్ష, కార్యదర్శులు తిరిగి వెంటనే చెల్లించాలని ఆ కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఎల్‌ఐజి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు కె అర్జున్‌కుమార్, కార్యదర్శి డి కాశినాధ్, కోశాధికారి బొడ్డు వెంకన్న, కాలనీవాసులు శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ పి రమేశ్ పాల్గొన్నారు.

తిరుగులేని శక్తిగా బిజెపి

మేడ్చల్, జూలై 3: మేడ్చల్ పట్టణంలో భారతీయ జనతాపార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిదేందుకు పార్టీశ్రేణులు అంకితభావంతో కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్ది మోహన్‌రెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణ బిజెపి అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన శ్రీనివాస కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథులుగా వారు పాల్గొన్నారు.

Pages