S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేటలో భారీ కార్డన్ సెర్చ్

జగ్గయ్యపేట, జూలై 3: పట్టణంలోని ధనంబోడు కాలనీలో ఆదివారం రాత్రి నందిగామ డిఎస్‌పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల సిఐలు, డివిజన్‌లోని 12మంది ఎస్‌ఐలతో నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్ ధనంబోడు కాలనీలోని సుమారు 500 ఇళ్లలో పోలీసులు అణువణువునా తనిఖీలు నిర్వహించారు. స్వయంగా డిఎస్‌పి ఉమామహేశ్వరరావు పలు ఇళ్లలోకి వెళ్లి ఎవరెవరు నివసిస్తున్నారు, పరిసరాల్లో ఎవరెవరు నివసిస్తున్నారు, తదితర అంశాలను ప్రశ్నించారు. వాహనాలను వాటి రికార్డులను పరిశీలించారు.

గ్రామీణ వికాసమే భారత్ వికాస్ పరిషత్ లక్ష్యం

గుడ్లవల్లేరు, జూలై 3: గ్రామాల వికాసం కోసం భారత్ వికాస్ పరిషత్ (బివిపి) కృషి చేస్తోందని జాతీయ అదనపు కార్యదర్శి సురేష్ జైన్ అన్నారు. మండల పరిధిలోని శింగలూరు గ్రామంలో ఆదివారం జాతీయ భారత్ వికాస్ పరిషత్ డైరెక్టర్ శాస్ర్తీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చోడవరపు విజయకుమార్, ప్రాంతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం పర్యటించారు. ఈసందర్భంగా సురేష్ జైన్ మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ 1963 నుంచి తమ సేవలను ప్రారంభించిందన్నారు. అందరూ కలసికట్టుగా పనిచేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాల్లో గుట్కా, మద్యపాన నిషేధం ఇతర గ్రామాలకు ఆదర్శమన్నారు. ఆధ్యాత్మిక చింతన, విద్యా, వైద్యంతో గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు.

నాగాయలంకకు పర్యాటక శోభ!

నాగాయలంక, జూలై 3: దివిసీమలోని నాగాయలంక ఇతర మండల కేంద్రాల కంటే భిన్నంగా ఓ ప్రత్యేకత సంతరించుకుంది. కృష్ణానదీ ప్రవాహం సంగమంలో ప్రవేశించే ముఖద్వారానికి పడమటి వైపు చీలే పాయ ఒడ్డున వున్న ఈ గ్రామం విభిన్న వృత్తులు, సంస్కృతులకు సమ్మేళనంగా నిలుస్తోంది. సర్వ మతాలకు సమాహారంగా వర్థిల్లుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా స్థానిక శ్రీరామపాద క్షేత్రం వద్ద మునుపెన్నడూ లేనివిధంగా రూ.70 లక్షల వ్యయంతో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించేందుకు అనువుగా ఘాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో జీర్ణదశకు చేరిన వివిధ దేవాలయాల పునఃనిర్మాణ పనులు సైతం ఈసందర్భంగా చేపట్టారు.

సాగునీటిపై సిఎం ప్రకటనతో రైతుల్లో చిగురించిన ఆశలు

కూచిపూడి, జూలై 3: గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా పోలవరం కుడి కాలువ గుండా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటంతో మొవ్వ మండల రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగుపై రైతన్నల్లో ఏర్పడిన అపోహలకు సిఎం హామీ ముగింపు పలికినట్లైంది. ముఖ్యమంత్రి వాగ్దానం కన్నా ముందుగానే వరుణ దేవుడు ఈ ఏడాది మే నెలలో 171.6 మి.మీ.ల వర్షాన్ని, జూన్‌లో 306 మి.మీ.ల వర్షాన్ని కురిపించటంతో విద్యుత్ పంపుసెట్లు, డీజిల్ ఇంజన్లతో మొవ్వ మండలంలోని దాదాపు 100 ఎకరాల్లోని రైతులు భూగర్భ జలాలతో నారుమడులు పోశారు.

ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రం స్థలం మెరక పనులకు శ్రీకారం

తోట్లవల్లూరు, జూలై 3: తోట్లవల్లూరులో ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం నిర్మాణానికి స్థలం మెరక పనులను ఆదివారం చేపట్టారు. తోట్లవల్లూరును దత్తత తీసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి రాజమోహన్ సహాయంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మెరక పనులు చేపట్టారు. ఘనవ్యర్థ పదార్థాల కేంద్రం నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరయ్యాయి. స్థలం గొయ్యిగా ఉండటంతో ఆరు నెలల నుంచి పనులు నిలిచిపోయాయి. గత నెలలో బెంగుళూరు నుంచి తోట్లవల్లూరు వచ్చిన రాజమోహన్‌కు పంచాయతీ కార్యదర్శి డి రాణి స్థలం సమస్యను తెలియజేశారు.

అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేత గర్హనీయం:బిజెపి

మచిలీపట్నం (కల్చరల్), జూలై 3: అభివృద్ధి పేరుతో ఆలయాలను కూల్చివేయడం గర్హనీయమని పలువురు బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఆలయాల కూల్చివేతకు నిరసనగా ఆదివారం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

సందడిగా హ్యపీ సండే

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 3: అందరూ సుఖసంతోషంతో ఉండాలనే ఆలోచనలతో హ్యపీ సండే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఆరోగ్యకరంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుందని నగర మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద హ్యపీ సండే కార్యక్రమం ఆనందమయంగా జరిగింది. హ్యపీ సండేలో పాల్గొన్న మేయర్ మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో హ్యపీ సండే కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని వారికి నచ్చిన క్రీడల్లో పాల్గొనడం ఎంతో అభినందనీయమన్నారు.

బిజెపి ప్రెస్‌మీట్ రసాభాస

ఇంద్రకీలాద్రి, జూలై 3: మల్లిఖార్జున పేట గోశాల ఆవరణలో ఆదివారం ఉదయం బిజెపి నేతలు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రంగ ప్రవేశంతో ఉద్రికత్త పరిస్థితులకు దారితీసి చివరకు రసాభాసగా మారటంతో బిజెపి నేతలు వెళ్లిపోయారు. కృష్ణ పుష్కరాలు, నగరాభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కృష్ణాజిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా పాతబస్తీలో తొలగించిన ఆలయాలు, గోశాల సగభాగం తొలగింపును పరిశీలించిన బిజెపి నేతలు మల్లిఖార్జునపేట గోశాల ఆవరణలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు.

ముందు ప్రజలకు కనిపించి తర్వాత విమర్శలు చేయండి

ఇంద్రకీలాద్రి, జూలై 3:ముందు మీరు మీనియోజకవర్గానికి వెళ్ళి ప్రజలకు కనిపించండి తర్వాత మాపై విమర్శనలు చేయండి అంటూ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానీ యంపి గోకరాజు గంగారాజుకు సలహా ఇచ్చారు. యంపి కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యంపి నాని మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరు సహకరించాలన్నారు. ప్రజలను మోసం చేసి ఇప్పుడు స్వామివేషంలో ఉన్న దొంగస్వామిని అడ్డుపెట్టుకొని రాష్టమ్రుఖ్యమంత్రి అవాకులు-చెవాకులు పేల్చటం ఎంతవరకు సమంజమని ఆయన ప్రశ్నించారు.

ఎక్కువ నష్టపోయింది నేనే

ఇంద్రకీలాద్రి, జూలై 3: దుర్గగుడి అభివృద్ధి విషయంలో తీవ్రంగా నష్టపోయింది నేనేనని అధికారపార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. దుర్గగుడి కొండపై సుమారు 30ఏళ్లుగా ఉన్న 6 దుకాణాలను తొలగించి అభివృద్ధికి సహకరించిన విషయాన్ని సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. గోశాల షేడ్ తొలగింపునకు నష్టపరిహారం ఇప్పించేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసిన విషయాన్ని వివరించారు. తొలగించిన ఆలయాలను అన్నింటినీ ఒకే చోట నిర్మించటం జరుగుతుందన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు.

Pages