S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎం చంద్రబాబు దృష్టికి విధ్వంసక చర్యలు

ఇంద్రకీలాద్రి, జూలై 3: కృష్ణ పుష్కరాలు, నగరాభివృద్ధి పేరుతో ఆలయాలను కూల్చివేస్తూ విధ్వంసక చర్యలకు పాల్పడి హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్న అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు బిజెపి నేతలు తెలిపారు. మల్లిఖార్జున పేట గోశాల ఆవరణలో ఆదివారం ఉదయం బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి పేరుతో వివిధ ఆలయాలను ఆగమశాస్త్రానికి విరుద్ధంగా కూల్చివేస్తూ విగ్రహాలను వియంసి వ్యాన్‌లో తీసుకువెళ్లి తీవ్రమైన అపచారం చేస్తున్నట్లు వారు ఆరోపించారు.

కలెక్టరేట్‌ను మరిచారా.. సారూ!

మచిలీపట్నం, జూలై 3: జిల్లా కలెక్టర్ బాబు.ఎ జిల్లా కేంద్రాన్ని మరిచిపోయారా..? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జిల్లా వాసులతో పాటు ప్రజాప్రతినిధుల్లో సైతం ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం నుండి పాలన సాగించాల్సిన కలెక్టర్ బాబు.ఎ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విజయవాడకే పరిమితం కావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇద్దరు ముఖ్య అధికారులు విజయవాడనే అంటిపెట్టుకుని ఉండిపోతుండటంతో వివిధ శాఖల జిల్లా అధికారులు సైతం విజయవాడకే పరిమితం కావాల్సి వస్తోంది. సొంత కార్యాలయాలన్నీ ఇక్కడ పెట్టుకుని విజయవాడలో వేలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తూ అదనపు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

వర్షాకాలం ప్రారంభంతోనే జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు

విజయనగరం, జూలై 3: వర్షాకాలం ప్రారంభంతోనే జిల్లాలో సీజనల్ వ్యాధులు తీవ్రతరం అవుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు హడలెత్తిపోతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు ఏర్పాట్లు చేశామని, వ్యాధిగ్రస్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా ఆసుపత్రులలో సీజనల్ వ్యాధులతో వస్తున్న రోజుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభంతోనే రోగుల సంఖ్య పెరుగుతుంటే ఇక జోరు వర్షాలు కురిస్తే జిల్లాలో సీజనల్ వ్యాధుల పరిస్థితి ఎలా ఉంటుందోనని కిందిస్థాయి వైద్య సిబ్బంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అణువిద్యుత్ కేంద్రాలు పర్యావరణానికి ప్రమాదకరం

గరం, జూలై 3: అణువిద్యుత్ కేంద్రాలు పర్యావరణానికి, ప్రజల మనుగడకు ప్రమాదకరమని ప్రముఖ సామాజిక, పర్యావరణవేత్త ఇ.ఎ.ఎస్.శర్మ తెలిపారు. ఆదివారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభలో ముఖ్యఅతిధిగా శర్మ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు- ప్రమాదాలు- ప్రత్యామ్నాయ మార్గాలు అనే అంశంపై మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అణువిద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, సంభవించిన ప్రమాదాలను ప్రస్తావించారు.

‘ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల మూసివేత తగదు’

విజయనగరం(టౌన్), జూలై 3: సం క్షేమ హాస్టళ్లను ప్రభుత్వం మూసివేయ డం సరైన చర్య కాదని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. బా లాజీ కూడలిలోని అంబేద్కర్ భవనం లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి కె.సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల మూసివేత, విలీనం, పాఠశాలల రేషనలైజేషన్ అంశాలపై చర్చించారు.

వల్లంపూడి పోలీసు స్టేషన్‌లో డిఎస్పీ తనిఖీ

వేపాడ, జూలై 3: మండలంలోని వల్లంపూడి పోలీసు స్టేషన్‌లో విజయనగరం డి ఎస్పీ రమణ ఆదివారం వార్షిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు, కేసు లు నమోదు, లైసెన్సులు కలిగిన తుపాకులు, గ్రామాల చరిత్ర రికార్డులను డిఎస్పీ పరిశీలించారు. పలు రికార్డుల నిర్వహణపై తప్పులను ఎత్తిచూపుతూ ఎస్సై కృష్ణమూర్తిని సున్నితంగా మందలించారు. ఉద్యోగంలో చేరి రెండున్నర సంవత్సరాలు జరుగుతున్నందున రికార్డుల నిర్వహణను తెలుసుకోవాలని డిఎస్పీ సూచించారు. అన్ని రికార్డులను ఎప్పుడు ఎవరు వచ్చి తనిఖీ చేసినా సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. సెక్షన్-336 కేసులను ఎఎస్సైతో చర్చించాలే తప్ప ఎస్సైగా జోక్యం చేసుకోరాదని అన్నారు.

‘పరిశుభ్రతపై ప్రజల ఆలోచనలో మార్పు రావాలి’

బొండపల్లి, జూలై 3: పరిసరాల పరిశుభ్రతపై ప్రజల ఆలోచనలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని జెడ్పీటిసి బం డారు బాలాజీ అన్నారు. మండలంలోని బి.రాజేరు గ్రా మంలో సర్పంచ్ అధ్యక్షతన మండల బిజెపిశాఖ ఆధ్వర్యం లో స్వచ్ఛ్భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలలో ప్రజలు మారుతున్న కాలాన్ని బట్టి ఆలోచనలలో మార్పు రావాలన్నారు. బిజెపి చేపట్టిన స్వచ్ఛ భారత్ పట్ల ప్రజలు అర్థం చేసుకుని ఆచరించాలన్నారు. జ నాభా పెరుగుతున్న దృష్ట్యా అవసరాలు పెరుగుతాయని, ప్ర తి అడుగు పరిశుభ్రత వైపు వేయాలని బాలాజీ పిలుపునిచ్చారు. మానవ మనుగడకు ప్రధానంగా పరిశుభ్రతతోనే ము డిపడి ఉందన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.వి.

‘దొడ్డిదారి ఒప్పందాలు కార్మికులు సహించరు’

నెల్లిమర్ల, జూలై 3: నెల్లిమర్ల జూట్‌మిల్లు యాజమాన్యం దొడ్డిదారి ఒప్పందాలు చేస్తే కార్మికులు సహించరని జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కిల్లంపల్లి రామారావు అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 800 గ్రాట్యూటీ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా యాజమాన్యం ఇంతవరకు చర్య లు చేపట్టలేదని అన్నారు. 5,10,18 రూపాయలు కోత బకాయిలు కార్మికులకు చెల్లించకుండా మరోసారి 18రూపాయలు కోతకు యాజమాన్యం సిద్ధపడుతుందని అన్నారు. ఒప్పందం ప్రకారం 2014కి 18రూపాయల కోత బకాయిలు చె ల్లించాల్సి ఉన్నా ఒప్పందాన్ని అమలు చేయలేదని అన్నారు.

క్వారీ పేలుళ్లతో ప్రజల్లో భయాందోళనలు

గజపతినగరం, జూలై 3: మ ండలంలోని కొణిసి గ్రామంలోగల గ్రానైట్ క్వారీ నిర్వాహకు లు పేలుస్తున్న పేలుళ్లతో కొణి సతోపాటు సమీప చిట్టాయవలస గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతూ ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. రాళ్లను పేల్చడానికి పేలుళ్లు నిర్వహించడంతో ఆ శబ్దాలు చెవులకు చిల్లులు పడేలా ఉంటున్నాయని, దీనివలన శారీరక సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. బోడిమెట్టలో గెలాక్సీ, నటరాజ్, ఎస్.కె. చిన్నమ్మలు నాలుగు కంపెనీల నిర్వాహకులు క్వారీలు నిర్వహిస్తున్నారు.

‘సిపిఎస్ విధానం రద్దు చేయాలి’

విజయనగరం(టౌన్), జూలై 3: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అమలులోకి తెచ్చిన 2004 కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శేషగిరి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలోని యుటిఎఫ్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పింఛన్ వల్ల ఉద్యోగులకు ఎటువంటి భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానం అమలుచేయాలని కోరారు. 2004లో అప్పటి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని చెబుతూ, ఈ విధానం వల్ల ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత ఎటువంటి బెనిఫిట్స్ ఉండవన్నారు.

Pages