S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కల నాటి సంరక్షించండి

విజయనగరం (్ఫర్టు), జూలై 3: మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే గీత కోరారు. పట్టణంలో పూల్‌బాగ్‌లో ఆదివారం మొక్కలను నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ మొక్కలను నాటితే సరిపోదని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేయాలం టే మొక్కలను నాటాలని కోరారు. వాటి పెంపకంపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. విజయనగరం పట్టణంతోపాటు రూరల్ మండలంలో కూడా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

‘బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి’

విజయనగరం (్ఫర్టు), జూలై 3: పట్టణంలో బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలలలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. 13వ వార్డు పరిధిలో కాటవీధి మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బడిఈడు వయస్సు కలిగిన పిల్లలను గుర్తించి పాఠశాలలలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేందుకు ఉపాధ్యాయులు తగిన శ్రద్ద వహించాలని అన్నారు.

ఇంక అల్లంత దూరమే...

ఏలూరు, జూలై 3 : ఇంకొంతకాలమే... మనం అధికారంలోకి వస్తాం... ఆ తరువాత ఇన్నాళ్లూ కష్టపడిన వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుంది... అంటూ రెండేళ్ల క్రితం ఎన్నికల ముందు టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు జిల్లా జిల్లా పార్టీ కేడర్‌కు హామీలు ఇస్తూ ముందుకు సాగిపోయారు. ఆయన చెప్పిన విధంగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కూడా పూర్తి మెజార్టీతో కొలువుతీరింది. ఆ తరువాత పూర్తిస్థాయిలో న్యాయం జరిగిపోతుందని కేడర్ అంతా ఎదురు చూపులు చూస్తేనే వున్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడచిపోయినా నామినేటెడ్ పదవుల పందారం పూర్తిస్థాయిలో ముందుకు సాగకుండా నిలచిపోయింది.

బెల్టుషాపులను నిరోధించాలి

ఏలూరు, జూలై 3 : జిల్లాలో బెల్టుషాపులను పూర్తిగా నిరోధించాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక శనివారపుపేట రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఎక్సైజ్ శాఖ పనితీరుపై ఆమె సమీక్షించారు.

పోలవరం స్పిల్‌వే డయాగ్రామ్ వాల్ రాళ్ల పరిశీలన

పోలవరం, జూలై 3: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే డయాగ్రామ్ వాల్ నిర్మించే ప్రాంతంలో సేకరించిన రాళ్లను సీనియర్ జియాలజిస్టు అజయ్‌కుమార్ ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజన్సీకి చెందిన ల్యాబ్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. జియాలజిస్టు ఆఫ్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయిన అజయ్‌కుమార్ రెండు రోజుల రాతి పరీక్షల నిమిత్తం శనివారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పటి నుండో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

బిజెపి నేతలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం

భీమవరం, జూలై 3: కృష్ణా పుష్కరాల నేపధ్యంలో సిఎం చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన పురాతన దేవాలయాలను పరిశీలించేందుకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులు దాడి చెయ్యడం చాలా దారుణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ మండిపడ్డారు. ఈ విధంగా దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఆదివారం నాడు భీమవరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో వర్మ తెలుగుదేశం పార్టీ నేతలపై మాటలను తూటాలుగా పేల్చారు. పరుష పదజాలంతో విమర్శలు చేశారు.

దేశాన్ని, ధర్మాన్ని కాపాడటమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం

భీమవరం, జూలై 3: దేశాన్ని, ధర్మాన్ని కాపాడటమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లక్ష్యంగా పనిచేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత బౌద్ధప్రముఖ్ గుత్తా శేషారెడ్డి (ఆంధ్రప్రదేశ్) అన్నారు. సమాజ సేవలో ఐక్యమత్యంతో సంఘ్ ముందుకు వెళ్తోందన్నారు. ఆదివారం స్థానిక త్యాగరాజ భవనంలో ఆర్‌ఎస్‌ఎస్ గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు మంతెన రామచంద్రరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అతిథులుగా సూర్యమిత్ర ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి డాక్టర్ ఇర్రింకి సూర్యారావు, సిద్దార్ధ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ బొడ్డు దుర్గారావు హాజరయ్యారు.

భీమవరంలో గోవు మృతి

భీమవరం, జూలై 3: కొద్ది రోజుల క్రితం పట్టణంలోని గోవులను స్థానిక బంట్రోతులవారి వీధిలో ఉన్న మున్సిపల్ స్థలానికి తీసుకువచ్చారు. ఇక్కడకు గోవులు ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం జరిగింది. అయితే వాటికి ఎటువంటి ఆహార, పానీయాలు పురపాలక సంఘ అధికారులు అందించలేదు. అయితే ఏం జరిగిందో తెలియదుగాని ఆదివారం రాత్రి ఒక గోవు మృతి చెందింది. ఈ గోవును పురపాలక సంఘం సిబ్బంది మున్పిపల్ చెత్త ట్రాక్టర్‌లో వేసి గునుపూడిలోని హిందూ స్మశాన వాటికకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మ రక్షా వేదిక, హిందూ చైతన్య వేదిక, గో రక్షణ, ఆర్‌ఎస్‌ఎస్, పలువురు కౌన్సిలర్లు వెళ్ళి అడ్డుకున్నారు.

దుష్ప్రచారాలు మానుకోవాలి

ఏలూరు, జూలై 3 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుంచుకోవాలని, దుష్ప్రచారాలు మానుకోవాలని ప్రతిపక్ష వై ఎస్ పార్టీకి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి కష్టాలు, నష్టాల్లో ప్రభుత్వం వున్నప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు అనేక పధకాలను రూపొందిస్తూ సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. 24 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అమలు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని అన్నారు.

గోదావరిలో స్నానానికి దిగి బాలుడు మృతి

పోలవరం, జూలై 3: గోదావరి నదిలో స్నానానికి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు మునిగి మరణించిన సంఘటన ఆదివారం సాయంత్రం పోలవరం పంచాయతీ పరిధిలో జరిగింది. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కేతా మహేష్ (15) కొంతమంది యువకులతో ఇంజన్ పడవపై తూర్పుగోదావరి జిల్లాలోని పూడిపల్లి గ్రామ సమీపంలో ఉన్న గండి పోశమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మహానందీశ్వర స్వామివారి ఆలయం వద్ద ఆగి దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం గోదావరి నది వడ్డుకు చేరుకున్న వారు సహచరులు ఎంత వారించినా వినకుండా నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు గోతిలో పడి మృతిచెందాడు.

Pages