S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్ముకున్న మేఘాలు

మహబూబ్‌నగర్, జూలై 3: గతపది రోజుల నుండి జిల్లాను మేఘాలు దండిగా కమ్ముకున్నప్పటికినీ వరుణుడు మాత్రం కనికరించడంలేదు. వానలు ఊరిస్తుడడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో కుండపోత వర్షం కురిసి నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తుంటే మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి, రెండవ వారంలో భారీగానే జిల్లాలో వరుణుడు కనికరించినప్పటికిని భారీ స్థాయిలో చెరువులు కుంటలు నిండి అలుగుపారే వాన కురియకపోవడం దురదృష్టకరం.

పుష్కరఘాట్లను పరిశీలించిన మంత్రులు

మక్తల్, జూలై 3: మక్తల్ మండల పరిధిలోని పంచదేవ్‌పాడ్‌వద్ద పుష్కరఘాట్ల పనులను రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, డాక్టర్ లక్ష్మారెడ్డిలు పరిశీలించారు. ఆదివారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రామాల్లో పాల్గొన్న మంత్రులు పుష్కరఘాట్లను సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 12 నుండి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఏడాదిలో జరిగిన గోదావరి పుష్కరాలకు ధీటుగా కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని అన్నారు. పుష్కరాల పనులను యుద్ధ ప్రతిపాధికన పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను అదేశించారు.

వేడెక్కిన రాజకీయం

మహబూబ్‌నగర్, జూలై 3: జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలింది. ఓ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా మరోపార్టీ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల నాయకుల మధ్య పచ్చిగడ్డివేస్తే భగ్గుమనే స్థాయికి రాజకీయ రగడ ప్రారంభమయింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై మరోకరు దూషించుకుంటూ దాడులు చేసుకుంటూ ఆందోళన బాటపట్టడంతో జిల్లాలో రాజకీయం వేడిని రగిలించింది.

అటు సైబరాబాద్..ఇటు మహబూబ్‌నగర్

షాద్‌నగర్, జూలై 3: అధికారులు దూరదృష్టి లేకుండా తీసుకున్న నిర్ణయాలతో షాద్‌నగర్ నియోజకవర్గంలో అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న షాద్‌నగర్ పోలీస్ సర్కిల్ పరిధిని ఆకస్మాత్తుగా సైబరాబాద్ వెస్ట్‌జోన్‌లో కలుపుతూ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న నిర్ణయం నాయకులను, ప్రజలను విస్మయానికి గురి చేసింది. షాద్‌నగర్ సర్కిల్ పరిధిలో ఉన్న బాలానగర్‌ను మినహాయించి షాద్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట పోలీస్ స్టేషన్లను సైబరాబాద్ వెస్ట్ జోన్‌లో కలుపుతూ..శంషాబాద్ డివిజన్ కింద ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాపై కెసిఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ

మక్తల్, జూలై 3: ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మహబూబ్‌నగర్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ద్ధ ఉందని అందుకే జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరిష్‌రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, రాష్ట్ర మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కోర్టులో కేసులు పెడుతూ పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటం హాస్యాస్పదమన్నారు. ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని జిమ్మిక్కిలు చేసిన ప్రాజెక్టులు పూర్తిచేసి జిల్లాలోని పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి జిల్లాను పచ్చని పాలమూరుగా మారుస్తామని తెలిపారు.

కథా రూపం (శ్రీవిరించియం 4)

మనిషికి ఒక రూపం, ప్రతి మనిషిని గుర్తించటానికి వీలయిన రూపం- శరీర నిర్మాణం వున్నట్లే, ప్రతి రచయితకు అతనిదే అయిన శైలి, సరళి, రచన పద్ధతి వుంటుంది. రచనలో ఒక వాక్యం చదవగనే యిది ‘పలానా’ రచయితదే అయి వుంటుంది అని ఖచ్చితంగా చెప్పగల పాఠకులు వుంటారు. అక్కడ ముఖ్యమయిన విషయం యేమంటే- రచయిత వ్యక్తిత్వాన్నిబట్టి అతని శైలి కూడా నిర్మాణం అయి వుంటుంది. అతని ఆలోచన పద్ధతి అతని శైలిని రూపొందిస్తుంది. శరీరము, మనస్సులకువున్న అనుబంధంలో యిదో ప్రధాన అంశం. రచయిత ఆలోచన పరిణతి చెందినకొద్దీ అతని శైలి కూడా మరింత సరళతను పెంపొందించుకుంటుంది.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584

పంజాగుట్ట బూరుగుచెట్టు

హుస్సేన్‌సాగర్ జలాల మధ్య
నిలువెత్తు బోధిసత్వుడు నిలబడినట్టు
రణగొణ ధ్వనుల పంజాగుట్ట రద్దీ చౌరస్తాలో
హుందాగా నిలబడిందీ బూరుగుచెట్టు
దూరం నుండి చూస్తే సాదాసీదాగా కనిపించే ఈ చెట్టు
దాని మొదట్లో నిలబడి తలెత్తిచూస్తే
ఖలీఫా బురుజంత ఎత్తుగా దర్శనమిస్తుంది

- శిఖామణి, 9848202526

ఓ ఉషోదయ వేళ

ఓ ఉషోదయ వేళ
తమ కిలకిలారావాలతో ప్రభాతానికి
రాగాల హారతి పడుతున్న
పక్షుల సవ్వడి విని
నెమ్మదిగా కళ్లు తెరిచా!
ఇంకేముంది?
ఉదయం ఆరుగంటలు దాటిందని
గోడ గడియారం
వెక్కిరింపులు ఒకవైపు
కిటికీలోంచి దూరి
తమ కిరణాలతో భానుని
చెక్కిలిగింతలు మరోవైపు!
ఆవలింతలతో
తనువంతా పులకరిస్తుంటే...
కలలో నన్ను
అలరించిన మధుర ఘటనలు
ఒక్కొక్కటి నా మనోఫలకంపై
నాట్యమాడసాగాయి!
స్వప్నంలో ఎంచక్కా
తొలకరి జల్లులో తడుస్తూ
ఒక్కో చుక్కను దోసిట్లో
ఒడిసిపట్టిన సంగతి గుర్తుకొచ్చి
అరచేతుల్ని ఆత్రంగా చూశా!

- దాస్యం సేనాధిపతి, 9440525544

వాస్తవి‘కథ’కు ప్రతిబింబం

పాత్రముల చరిత్రములను విస్తరించుటలో వర్ణనీయమైన పద్ధతి యేదనగా
స్ర్తి పురుషులు గుణానుగుణమైన నడవడిగలవారయ్యును
ప్రపంచాచారములయందు వలెకావ్యములందును
గాల దేశవర్తమానములవలన
నొక్కొక్కయెడ విరుద్ధమైన వర్తనము గలవారుగా
నున్నట్లునూ ప్రదర్శించుట.
(కట్టమంచి రామలింగారెడ్డి: కవిత్వత్త్వ విభాగము (1947) పు.21)

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, 9440222117

ఘటనాత్మక కవిత - ఒక భావన

‘‘సాహిత్యం సామాజిక విప్లవాన్ని తెస్తుంది. అది కాగడాలాంటిది, వేగుచుక్క లేదా మార్గదర్శి, సాహిత్యం సమాజాన్ని ప్రతిఫలిస్తుంది’, అది దానికి అద్దం వంటిది’’ - అని ఇలాంటి వాక్యాలు సాహిత్య విమర్శలో అటు లిఖిత రూపంలోను ఇటు వౌఖిక మార్గంలోను చాలాకాలంగా అనాదిగా వ్యాప్తిలో ఉన్నవి. ఈ వాక్యాల్ని అలవోకగా అంటుంటారు. అంత సీరియస్ విషయంగా మాత్రం చాలామంది పరిగణించరు. సమాజాన్ని ఎలా ప్రతిఫలించింది లేదా ఎలా ప్రభావితం చేసింది దీనివల్ల స్పష్టంగా ఇంత మేలు జరిగింది అని చెప్పే కొలబద్దలు కాని లేదా కొలిచి చెప్పిన దాఖలాలు కాని మనకేం దొరకవు.

- పులికొండ సుబ్బాచారి, 9440493604

Pages