S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

చ. తలఁపగ నాఁడు పల్కిన విధం బెటఁ దప్పఁగ వీడె నొక్కొ చూ
డ్కులు విరసంబులై కరము క్రూరము లైన నిమిత్త మేమియో?
కలయఁగఁ బల్కరించి రుపకారులు నైరని నమ్మి యుండఁగా
వలవదు బుద్ధిమంతులు నవప్రియులైన ధరాధినాథులన్

యువర్స్ లవ్వింగ్లీ...11

‘‘కావచ్చు. కానీ ఆ రోజు భరణి గెస్ట్‌హౌస్‌కి వచ్చే సమయానికి వాచ్‌మెన్ అక్కడ లేకపోవడం మాత్రం యాదృచ్ఛికం కాదు. ఎవరో కావాలనే ఆ సమయానికి అతడు అక్కడ ఉండకుండా ప్లాన్ చేసారు’’
‘‘ఎలా చెప్పగలుగుతున్నారు?’’
‘‘తిరుపతయ్యకి ముందు రోజు బిగ్‌బజార్ నుంచి ఫోన్ వచ్చింది. అతడు వేసిన కూపన్‌కి బహుమతి వచ్చిందనీ, మర్నాడు ఫలానా సమయానికి వచ్చి బహుమతి తీసుకోమని. అది తీసుకోవడానికే వెళ్లాడు అతడు ఆ రోజు. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది అది ఫేక్ ఫోన్ కాల్ అని. ఆ విషయాన్ని నిర్థారించుకుని అతడు తిరిగి గెస్ట్‌హౌస్‌కి వచ్చేసరికి భరణి రావడం, చనిపోవడం జరిగిపోయాయి.’’

వరలక్ష్మి మురళీకృష్ణ

హరివంశం 176

కంసుడి మంత్రులలో ఒకడైన పృథుడనే రాక్షసుణ్ణి, అతడి కొడుకైన అసిరోముడితోసహా వధించాడు. నరరూప ధరుడైన విరూపాక్షుడైన రాక్షసుణ్ణి, వాడి మదపుటేనుగైన ఐరావణంతో సహా రూపుమాపాడు. హిమశైల వాసులై లోకోపకారానికి తలపెట్టిన మైంద, ద్వివిదులనే వానరులను శిక్షించాడు.
శోణపురంలో పరమ శివానుగ్రహ సంరక్షితుడైన బాణుణ్ణి శిక్షించి ప్రాణమాత్రావశిష్ఠుణ్ణి చేశాడు. అతడి వేయి బాహువులు ఖండించాడు. అగ్ని తేజస్సును అణచివేశాడు. వరుణడిని ధిక్కరించి కలచివేశాడు. ఇక బాల్యంలోనే ఆయన మహిమలు పూతన సంహారం, కంస విదారణం తెలిసినవే కదా!

కర్మఫలం

జీవకోటిలో మానవ జన్మ సుకృతమైనది. దీన్ని మరిచిన కొందరు స్వార్థానికి ఇచ్ఛ వచ్చినట్లు మాట్లాడుతూ తాము కోరిన పనులు చేస్తుంటారు. దానివల్ల ఇతరులు కష్టపడతారనో లేక ఇతరులకు నష్టం వాటిల్లుతుందనో విషయాన్ని గ్రహించరు. దీనివల్ల ఆ పని చేసేవారికి పాపమొస్తుందని తలంపే ఉండదు. పాపాభీతి ఉండడం దైవం పట్ల నమ్మకం ఉంటే వారు తప్పక పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు. ఈ నాది నేను అనే అహంకారం వల్ల ఎన్నో పాపకృత్యాలకు అలవడి గర్వాన్ని అతిగా పెంచుకుంటారు.

- రాంప్రసాద్

సిద్ధమవుతున్న జనతా గ్యారేజ్

ఎన్టీఆర్ కథానాయకుడుగా నటిస్తున్న ‘జనతాగ్యారేజ్’ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ఈనెల 6న ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయడానికి యూనిట్ ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆడియో విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ ఆడియోను ఈనెల 22న భారీగా విడుదల చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోంది. సమంత, నిత్యామీనన్‌లు కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఆగస్టు 12న విడుదల చేయనున్నట్టు టాలీవుడ్ టాక్!

రామ్ సినిమాల జోరు!

‘నేను శైలజ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ తన తదుపరి చిత్రాలకు జోరు పెంచాడు. ప్రస్తుతం ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నాడు. ‘పటాస్’, ‘సుప్రీమ్’ల విజయంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన అనీల్ రావిపూడి రామ్ కోసం మంచి కథ రెడీ చేశాడట. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. తనకి చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు.

ఎంత ఘాటు ప్రేమయో!

సౌత్‌లో పాపులర్ హీరోయిన్‌గా మారిన నయనతార ఈమధ్య కోలీవుడ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. అందుకే ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా కూడా కాదని తమిళంలోనే వరుస సినిమాలు చేస్తోంది. మరోవైపు జోరుగా ప్రేమాయణం సాగిస్తున్న నయనతార వ్యవహారంపై కొన్ని రోజులుగా ప్రచారం సాగుతూనే వుంది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఈమె ప్రేమలో పడిందని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకూ వీరు తమ ప్రేమను రహస్యంగానే సాగించారు. కానీ ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేదికపై వీరి ప్రేమాయణం బయట పడింది.

చుట్టాలబ్బాయి వస్తున్నాడు!

ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ పతాకాలపై వెంకట్ తలారి, రాము తాళ్లూరి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా రీరికార్డింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దారని, ఆది నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుందని తెలిపారు.

15న సెల్ఫీరాజా

అల్లరి నరేష్ హీరోగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో గోపీ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ‘సెల్ఫీరాజా’ చిత్రం ఈనెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఆసక్తికరమైన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లపై అంతటా క్రేజ్ నెలకొంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అల్లరి నరేష్.

అవసరానికో అబద్ధం ట్రైలర్

నూతన తారలతో చక్రం క్రియేషన్స్ పతాకంపై సురేష్ కె.వి. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అవసరానికో అబద్ధం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ ట్రైలర్ విడుదల చేసి వౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా విజయవంతం కావాలని, తాము రూపొందించిన ‘స్వయంవరం’ చిత్రం కూడా అలాగే హిట్ అయిందని అన్నారు. నిజమని నువ్వు నమ్మేదానిని, నిజమని నీకు చెప్పింది ఎవరు? అబద్ధమని నువ్వు అనుకునేదాన్ని అబద్ధమని నీకు చెప్పింది ఎవరు?

Pages