S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణస్తు భగవాన్ స్వయం

దుష్టశిక్షణ, శిక్ష రక్షణచేసి, ధర్మాన్ని పరిరక్షించడంకోసం శ్రీహరి శ్రీకృష్ణుడిగా అవతరించాడు. బృందావనలీలను మహిమ లకే మహిమ గా చూపెట్టాడు. యశోదాదేవి తను కన్న కొడుకు చిన్నవాడు అని బెత్తంపుచ్చుకుని బెదరించాల నుకొంటే చిన్నవాడు చిన్మయుడు అని చెప్పడానికా అన్నట్టు నోట పదునాల్గు భువనా లను చూపెట్టాడు. అతి లేత వయస్సులోనే పూతన శకటాసురు ల్లాంటి ఎందరో రాక్షసులను మట్టుపెట్టిన వీరాధివీరుడు శ్రీకృష్ణుడు. అందుకే ‘ఓం నమో నారాయణాయ’ అని జపిస్తే చాలు అష్టసిద్ధులు నవనిధులు ఒనగూరుతాయ. కృష్ణుని పూజించిన వారికి ఆనందమే ఆనందం లభిస్తుంది.

మారుతి పూజ.. కార్యసిద్ధి

రామకథాగానంలో తన్మయుడు, శివాంశ సంభూతుడు, రాక్షసాంతకుడు మారుతి. మనోజవుడు, వాయువేగుడు, ఇంద్రియవిజేత, బుద్ధిమంతుడు వాయునందుడు, వానర సేనలో ముఖ్యుడు, శ్రీరామదూత అయన ఆంజనేయస్వామిని స్మరించడంవలన బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, భయం లేకుండుట, రోగాలు లేకుండా, పటిష్టమైన వాక్కు లభిస్తాయ.నలభై రోజులపాటు- స్వామివారి తోకకు రోజుకొక చందనపూత పూసి, కుంకుమ బొట్టు చొప్పున పెట్టి పూజిస్తే, నలభై రోజుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

జగత్తుకు మేలు చేసే జగన్నాథ రథయాత్ర

జగన్నాథుడంటే జగత్తు కంతటికీ నాయకుడు. జగత్తుకు హితం చేకూర్చేవాడు. శ్రీ మహావిష్ణువు జగన్నాథ నామంతో భాసిస్తూన్న క్షేత్రం ‘పూరీ’గా నామాంతరం చెందింది.
పూరీలో వెలసిన క్షేత్రజ్ఞునికి ‘దారుబ్రహ్మం’, ‘చొక్కడోలా’, ‘చొక్కినయనా’, ‘పురుషోత్తముడు’అని ఎన్నో నామాలున్నాయి. ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఆ ఒకే మూర్తిని జగన్నాథునివి.

- ఎ. సీతారామారావు

జగన్నాథుని విశిష్టతలు

అక్షయ తృతీయ అంటే వైశాఖ శుద్ధ తదియనాడు చందనోత్సవంతోపూరీ జగన్నాథుని రథాల తయారీకి శ్రీకారం జరుగుతుంది. దీని మూడు రోజుల పాటు దేవతా మూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. నరేంద్రకొలనులో ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి. చందనం ఇతర పరిమళ ద్రవ్యాలతో కొలను నడుమ వున్న చిన్న ఆలయంలోని రాతి గినె్నలలో వున్న నీటితో జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రా దేవులతో పాటు గా సుదర్శన చక్రానికి పుణ్యస్నానాలు చేయిస్తారు.దీని తరువాత పౌర్ణమి తిథినాడు 108 కళశాలతో అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు సామాన్య భక్తులకు దర్శనం నిలిపివేయబడుతుంది. దేవతామూర్తులకు అడ్డుగా వెదురుతో నిర్మించిన తడకలాంటిది అమరుస్తారు.

- హనుమాయమ్మ

మహిమాన్వితుడు

త్రిలోక సంచారి నారదుడు కంసుని ఇంటికి వచ్చాడు. కంసుడు ఏకాంతంలో కూర్చుని వుండగా ప్రసంగవశాత్తు చెప్పినట్టుగా నారదుడు అతనితో నీవు పూర్వ జన్మలో కాలనేమి అనే రాక్షసుడవని, శ్రీహరి ఖడ్గానికి బలి అయ్యావు అని మందలో వున్న నందాదులు, దేవకీ వసుదేవులు మొదలైన వారంతా దివినుండి భువికి దిగివచ్చి మానుష రూపంలో వున్న దేవతలని ఆ శ్రీహరి దేవకీదేవి ఎనిమిదవ గర్భంలో జనించి దైత్యులను చంపడానికి ప్రయత్నిస్తాడని చెప్పి తన దోవన తాను వెళ్లిపోయాడు.

- ఎస్.్ధర్మారావు

శ్రవణమే ముఖ్యం

మంచి మాట చెప్పినా వినేవాడుండడు. ఒకవేళ వింటే విన్నవాడు గొప్పవాడవుతాడు. మారీచుడు రాముణ్ణి గురించి గొప్పగా చెప్పినా రావణుడు వినలేదు. తన అనుభవంతో కలిగిన రామశబ్దం మహిమను గురించి ఎంత చెప్పినా వినలేదు. రావణాసురుడి చేతిలో మరణం కంటే రాముడి చేతిలో మరణం మంచిదని, రావణుడు చెప్పినట్లే బంగారు లేడిగా మాయదారిగా సీతారాముల ఆశ్రమం నందు తిరగడానికి మారీచుడు నిశ్చయంచుకుని వెళ్లాడు. ఆ మాయామృగాన్ని చూచిన సీత భ్రమించింది. బంగారు లేడి తెచ్చివ్వమని రాముని కోరింది.

-జమలాపురం ప్రసాదరావు

నలుగురి మంఛి కోరితే...

సంతోషం కోసం ఎక్కడో వెతక్కర్లేదు. అది మన మనసులో ఉంది అంటారు విజ్ఞులు. మనిషికి తృప్తి ఉంటే చాలు సంతోషం అదే వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో సంతోషం ఉన్నా సరే పామరుడి దగ్గర నుంచి పండితుని వరకు అందరూ ఆనందాన్ని కోరుకునేవారే. తృప్తి స్వర్గాన్ని ఇలలో కనిపింపచేస్తే అసంతృప్తి సంతోషంగా ఉన్న ఇంటిని కూడా నరకాన్ని చేస్తుంది. గొప్పలకు పోవడం, లేనిది ఉన్నట్టుగా చూపించాలను కోవడం, ఒకరికి ఉన్నదని తమకులేదని అనుకోవడం, అందరికన్నా ఎక్కువగా ఉన్నతంగా తామే ఉండాలని మరొకరు ఉండకూడదనే ఆలోచనల వల్ల అసంతృప్తి కలుగుతుంది.

-చివుకుల రామమోహన్

బ్రహ్మకు ఆలయమెందుకు లేదు?

* జడ భరతుడు భారతదేశం పాలించినందువల్ల ‘‘్భరతదేశం’’ ఇఅని పేరు వచ్చిందంటారు. కొందరు శకుంతలా పుత్రుడైన భరతుడు పాలించినందువల్ల అంటారు. నిజమేమిటి? కె.వి. ప్రసాదరావు, కందుకూరు

mataata

Pages