S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగ్గురు కొత్తహీరోల జిందగీ

కిరణ్, వర్ధన్, ఫణిప్రకాష్ ప్రధాన తారాగణంగా దయా పిక్చర్స్, శ్రీనాథ్ ఫ్రెండ్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘జిందగీ’. కె.దయాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో వి.చంద్రశేఖర్‌తో కలసి ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక నాయకుడు నారాయణస్వామి ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు దయా మాట్లాడుతూ, కళాశాల ముగిశాక విద్యార్థులుగా ఉన్న ముగ్గురు మిత్రులు తమ జీవితాన్ని ప్రారంభించి ఏమేమి సాధించారు, వారి జీవితంలో మలుపుతిరిగిన అవకాశాలు ఎలా వచ్చాయి, వాటిని ఎలా వినియోగించుకుని సమాజానికి మేలు చేశారు?

అదిరేటి స్టెప్పు నువ్వేస్తే!

దక్షిణాదిలో టాప్ హీరోయిన్ల రేసులో ఉన్న తమన్నాకు ఈమధ్య క్రేజీ సినిమా అవకాశాలు అందివస్తున్నాయి. ఇటీవలే ‘ఊపిరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమన్నా ప్రస్తుతం ‘అభినేత్రి’ అనే భారీ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ సినిమాతో తన సత్తా చాటుకోవాలనే గట్టి ప్రయత్నాల్లో ఉంది మిల్క్భీమ. అందుకే ఈ సినిమాకోసం తెగ కష్టపడుతోందట. ఇందులో కావాల్సినంత గ్లామర్ అందాల్ని ఆరబోయడమే కాకుండా నటిగా తనదైన సత్తాను ప్రూవ్ చేసుకోనుందట. మరోవైపు డాన్సులో కూడా ఇరగదీస్తుందట!

ముందే చెప్పాలి!

ఒక్కో సినిమాతో టాలీవుడ్‌లో తనదైన ఇమేజ్‌ను పెంచుకుంటోంది గ్లామర్ భామ రెజీనా. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రెజీనాపై రూమర్స్ కూడా ఎక్కువయ్యాయి. ఈమధ్య ఆమె బికినీ వేస్తుండడంతో మీడియాలో తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన రెజీనా నేను తాజాగా నటిస్తున్న కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాకోసం దర్శకుడు ఒక్కసారే బికినీ వేయడానికి ఏమైనా అభ్యంతరమా అని అడిగాడని చెప్పింది. దాంతో బికినీ వేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో బికినీ వేస్తానో లేదో నాకే తెలియదు కానీ, ఒకవేళ బికినీ వేయాల్సి వస్తే కచ్చితంగా ఒక నెల ముందే చెప్పాలని ఆ దర్శకుడితో కండీషన్ పెట్టిందట.

కూల్చిన ఆలయాలు పునర్నిర్మిస్తాం

విజయవాడ:కృష్ణా పుష్కరాలకోసం చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న ఆతృతలో అధికారులు చేసిన పొరపాటు ఫలితంగా కొన్ని ఆలయాల కూల్చివేత జరిగిందని, ప్రభుత్వం ఆలయాల కూల్చివేత చేపట్టాలని నిర్ణయించలేదని మంత్రుల బృందం స్పష్టం చేసింది. పట్టణంలో శనీశ్వర, దక్షిణముఖ ఆంజనేయ, విజయేశ్వర ఆలయాల కూల్చివేతతో బిజెపి సహా స్థానిక నేతలు, ప్రజలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం స్పందించింది. మంత్రులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావుల, మాణిక్యాలరావుతో కూడిన బృందం ఆయా ఆలయాల ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం వారు పరిస్థితిని సమీక్షించారు.

8న ఏపీ కేబినెట్ భేటి

విజయవాడ:విజయవాడలో సోమవారం జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ 8వ తేదీకి వాయిదాపడింది. కాగా అమరావతిలో అభివృద్ధిని వైకాపా అడ్డుకుంటోందని మంత్రి నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని, భవనాలు కూలిపోతున్నాయని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

గోదావరికి వరద ఉధృతి

భద్రాచలం:ఎగువున ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత నదుల్లో వరద పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరికి నీటిప్రవాహం వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి 18 అడుగుల నీటిమట్టం ఉండగా ఆదివారం మధ్యాహ్నానికి అది 28 అడుగులకు పెరిగింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల వరదనీరు పెరుగుతోంది. ఒకటిరెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు

హైదరాబాద్:బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని, అంతవరకు నిలిపివేస్తామని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. నగరంలోని లకడీకాపూల్‌లో సమావేశమైన వీరు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారంవరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని, ఆ రోజు మరోసారి సమావేశమైన తాజా నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు.

కుంబ్లే సారథ్యంలో భేటి

ముంబై:్భరత్‌లో క్రికెట్‌కోసం పనిచేస్తున్న సంస్థలన్నీ సాఫీగా, క్రమబద్ధంగా పనిచేసేలా చూడాలని భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ అనిల్‌కుంబ్లే భావిస్తున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు. ఆదివారంనాడు భారత టెస్ట్ క్రికెట్ జట్టుకెప్టెన్ కోహ్లి, పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ ధోని, అండర్ -19 జట్టు కోచ్ రాహుల్‌ద్రావిడ్, బిసిసిఐ సభ్యులు, దేశంలోని క్రికెట్ అకాడమీల చైర్మన్లు పాల్గొన్న ఈ సమావేశంలో కుంబ్లే మాట్లాడారు. భారత క్రికెట్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విషయంలో ఆయా సంస్థలన్నింటికీ భాగస్వామ్యం కల్పించేలా అడుగులువేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

బాగ్దాద్‌లోనరమేధం

బాగ్దాద్:ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రద్దీగా ఉండే రెండు మార్కెట్లలో బాంబు పేలుళ్లకు పాల్పడి పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం కలిగించారు. రంజాన్ పవిత్రమాసం సందర్భంగా భోజనాలు చేస్తున్నవేళ వారు ఈ దాడికి తెగబడ్డారు. నిత్యం రద్దీగా ఉండే కరద, షల్లాల్ మార్కెట్లలో వారు బాంబు దాడులు చేశారు. కరద మార్కెట్‌లో మొదట ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని దాడి చేస్తే రెండోచోట కారుబాంబు పేల్చారు. దాదాపు 75మంది మరణించగా మరో వందమంది గాయపడ్డారు.

Pages