S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశించిన వర్షాలు లేక అన్నదాత ఆందోళన

మెదక్ రూరల్, జూలై 3: పక్కజిల్లాల్లో వర్షాలు కురుస్తున్నా..మెదక్ ప్రాంతంలో ఆశించిన వర్షాలు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రెండు బలమైన కార్తులు పూర్తయినా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశంవైపు చూస్తున్నారు. ఈసారి మనకు కరవేనా అన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా వరుస కరవు ఎదుర్కొంటున్న కర్షకులు ఈసారైనా భారీ వర్షాలు కురిసి చెర్వులు, కుంటలు నిండుతాయని, వాగులు, వంకలు పారుతాయని ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికీ సాదారణ వర్షపాతం నమోదుకాలేదు. ఒక్కనాడు వరదలు పారేలా వర్షం కురిసిన దాఖలాలులేవు.

ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి

సంగారెడ్డి టౌన్, జూలై 3: ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకరావాలని ఎబివిపి జిల్లా కన్వీనర్ అనిల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఐబి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలుగా ఉండాల్సిన విద్యాలయాలను దోపిడి సంస్థలు తయారు చేస్తున్నారని విమర్శించారు. చదువుల తల్లిని అంగట్లో సరుకుగా మార్చి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అధిక ఫీజులు, నిబంధలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవడం లేదన్నారు.

అక్రమ ఇంటి నిర్మాణం కూల్చివేత

చిన్నశంకరంపేట, జూలై 3: అసైండ్‌మెంట్ భూమిలో అక్రమంగా ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న ఓ ఇంటిని రెవెన్యూ అధికారులు జెసిబితో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని 345 సర్వే నంబర్‌లో లంబాడి శ్రీనివాస్ శోభ ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ పనులను నిలిపివేయాలంటూ తహశీల్దార్ విజయలక్ష్మీ ఆదేశించారు. అయినప్పటికీ బెస్మెంట్ వరకు నిర్మించారు. ఆర్‌ఐ సతీష్ విఆర్‌ఓ, రెవెన్యూ సిబ్బందితో వెళ్లి ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించరాదని, ఈ నిర్మాణ సామాగ్రిని గతంలో రెండు సార్లు స్వాదీనపరుచుకున్నారు.

ఆందోళనలతో జిల్లాలు రావు

సిద్దిపేట టౌన్, జూలై 3: ప్రతిపక్ష రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, ఆందోళనలతో జిల్లా వస్తాయనుకోవడం భ్రమఅని టిఆర్‌ఎస్ నేతలు అన్నారు. టిఆర్‌ఎస్‌వి జిల్లా ఉపాధ్యక్షుడు గుండురవితేజ, నేతలు తూముల శ్రీనివాస్, ముదిగొండ శ్రీనివాస్ లు మాట్లాడుతూ కొత్తజిల్లాలు పరిపాలన సౌలభ్యం కోసమే ఏర్పాటు అవుతాయని, కొంతమందిని ప్రలోభపెట్టి ఆందోళనలు చేయిస్తే కొత్తజిల్లా కేంద్రాలు ఏర్పడవన్నారు. పరిపాలన పరంగా అవసరమైన చోట ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు.నియోజకవర్గంలోని మండలాలు ఇతర జిల్లాలోకి వెళ్లినంత మాత్రాన నష్టంలేదని, అన్ని మండలాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటున్నాయన్నారు.

డిపిఆర్ తయారు చేయకుండా..భూ సేకరణ చట్టవిరుద్ధం

దౌల్తాబాద్, జూలై 3: మల్లన్నసాగర్ పేరిట నిర్మించనున్న ప్రాజెక్ట్ డిటిఅర్ (డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారుచేయకుండానే భూ సేకరణ చేయడం చట్ట విరుద్దమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిది రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం దౌల్తాబాద్‌లో జరిగిన మండల కార్యవర్గ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించవద్దని సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ పేరిట రైతుల భూములను దౌర్జన్యంగా స్వాదీనం చేసుకుంటూ బయాందోళనలకు గురిచేస్తుందని ఆరోపించారు.

నేడు పాదయాత్ర ముగింపు సమావేశం

తొగుట, జూలై 3: మండంలోని ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామంలో ఈ నెల4న ఉదయం 11గంటలకు సిపిఎం పాదయాత్ర ముగింపు సమావేశం నిర్వహించడం జరుగుతుందని మల్లన్నసాగర్ జెఏసి కన్వినర్ భాస్కర్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రోఫెసర్ హరగోపాల్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్‌లు హాజరవుతున్నారని, భూనిర్వాసిత గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

తారురోడ్లను ధ్వంసం చేస్తున్న దమ్ముచక్రాలు

మెదక్ రూరల్, జూలై 3: తారురోడ్లపై దమ్ము చక్రాలు తిరగడం ఆగడం లేదు. గత సంవత్సరం రహదారుల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రోడ్లపై దమ్ము చక్రాలు తిరిగితే పోలీసు కేసులుపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాలను సంబంధిత శాఖల అధికారులు ఖచ్చితంగా అమలుచేయక, ఉదాసీనంగా వ్యవహరించడంతో యధేచ్చగా వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు దమ్ము చక్రాలు తిప్పుతున్నారు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించిన తారురోడ్లు దుమ్ము దుమ్ముగా మారుతున్నాయి. తారురోడ్లపై కంకరతేలి వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దమ్ము చక్రాలు తిప్పకుండా పోలీసులు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పాలమూరు ప్రాజెక్టును నిర్మించి తీరుతాం

మాగనూర్, జూలై 3: ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆగదని, ప్రాజెక్టును పూర్తి చేసి పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ప్రజలు బంగారు తెలంగాణలో భాగస్వామ్యమై అభివృద్ధ్దికి నాందిగా నిలవాలని కోరారు. మాగనూరు మండలం మురహరిదొడ్డి గ్రామంలో మోఘా ఇంజనీరింగ్ కంపెనీ యాజమాని పిపిరెడ్డి గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజలకు పలు సౌకర్యాలు కల్పించారు. మురహరిదొడ్డి గ్రామంలో నిర్మించిన ఫిల్టర్‌వాటర్ ప్లాంట్, సోలార్‌లైట్లను ఆదివారం మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు.

గద్వాల జిల్లా సాధన ఉద్యమంపై ఖాకీల డేగ కన్ను

గద్వాల, జులై 3: వినతులు, ధర్నాలతో మొదలైన గద్వాల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు పెరుగుతూ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దవౌతుంది. ఈ నెల 1న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసొచ్చే విధంగా దాదాపు రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ధర్నాను నిర్వహించి వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో నడిగడ్డలోని అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యమ నేతలు ఒకే తాటిపైకి వచ్చి మరిన్ని ఉద్యమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా గద్వాల ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 5న రైల్‌రోకోకు పిలుపునివ్వడంతో నడిగడ్డలో టెన్షన్ మొదలైంది.

బంగారు తెలంగాణ కాదు! బాధల తెలంగాణ!!

షాద్‌నగర్, జూలై 3: బంగారు తెలంగాణగా మార్చుతామని చెబుతున్న కెసిఆర్ ప్రభుత్వం..ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బాధల తెలంగాణగా మార్చుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. ఆదివారం ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి గ్రామ సమీపంలోని భాస్కర గార్డెన్‌లో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ కుటుంబ పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేనివారు ఐదు లక్షల మంది ఉన్నారని సమగ్ర సర్వేలో వెల్లడైందని తెలిపారు.

Pages