S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుణమాఫీపై దుష్ప్రచారం తగదు : ఆదాల

నెల్లూరు రూరల్, జూలై 2: తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విడతలవారీగా రుణమాఫీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు రుణమాఫీ జరగడం లేదంటూ దుష్ప్రచారం చేయడం తగదని ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు మండల పరిధిలోని ములుముడి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తెలుగదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తోందని ఆయన తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో రైతుల రుణమాఫీ 60 కోట్ల రూపాయలుగా నిర్ధారించగా, అందులో 31 కోట్ల రుణమాఫీ జరిగిందని ఆయన తెలిపారు.

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

నెల్లూరు, జూలై 2: విద్యార్థులు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని నగర డిఎస్‌పి జివి రాముడు పిలుపునిచ్చారు. మన ఊరు - మన పోలీసు కార్యక్రమంలో భాగంగా రెండవ నగర పోలీసులు తమ పరిధిలోని బోడిగాడితోట, వైకుంఠపురం చుట్టుపక్కల ప్రాంతాలను దత్తత తీసుకున్నారు. అక్కడ సమస్యలను పరిష్కరించటం కోసం తొలుత విద్యాభివృద్ధితోనే ప్రజల్లో సరైన అవగాహన సాధించవచ్చు అనుకుంటూ మున్సిపల్ పాఠశాలకు మరమ్మతులు చేయించి అందుకు అవసరమైన వౌలిక సదుపాయలను కల్పించారు.

రుణమాఫీతో చిన్న రైతు జీవితాలు సాఫీ

నెల్లూరు, జూలై 2 : ఆరుగాలం కష్టించే రైతుల కళ్లల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం రైతుల జీవితాలకు భరోసా కల్పిస్తూ అధికారం చేపట్టగానే ప్రకటించిన రైతు రుణమాఫీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ బృహత్తర పథకం ప్రభుత్వానికి భారమైనా చిత్తశుద్ధితో అమలుకు ప్రభుత్వం కట్టుబడింది. ఫలితంగా రైతుల జీవితాలకు రుణమాఫీతో భరోసా కల్పించింది. ఈ రుణమాఫీతో బ్యాంక్‌లు రైతులకు విరివిగా నూతనంగా రుణాలు అందించాల్సిన ఆవశ్యకతను ఉద్ఘాటించింది. రుణమాఫీకి విస్తృత స్థాయిలో ఆర్థిక సాయం చేసి తమను విముక్తులు చేసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకోవాలి

ఒంగోలు, జూలై 2:జిల్లాలోని వెనుకబడిన గ్రామాలను ఎన్‌ఆర్‌ఐలు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ఆటా సదస్సులో ఎంపి సుబ్బారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అనేక వెనుకబడిన గ్రామాలు ఉన్నాయని వాటి మీద ఎన్‌ఆర్‌ఐలు దృష్టిసారించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలందరికి తమపార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తమ సత్తాను అన్నిరంగాల్లో చాటాలని పిలుపునిచ్చారు.

త్వరలో ఐదు జిల్లాల్లో పాల విక్రయాలు

ఒంగోలు, జూలై 2: రాష్ట్రంలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అమరావతి, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో త్వరలో మంచిరోజులు చూసుకుని పాలను విక్రయించనున్నట్లు ఒంగోలు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం రాత్రి వరకు సాగిన బోర్డుమీటింగ్ వివరాలను విలేఖర్లకు వెల్లడించారు. ఈ జిల్లాల్లో పాలను విక్రయించేందుకు ప్రత్యేకంగా జనరల్ మేనేజరును నియమించినట్లు చెప్పారు. జిల్లాలో వచ్చేసంవత్సరం మార్చినాటికి రోజుకు లక్ష లీటర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాల ఉత్పత్తిదారులకు ఎలాంటి బకాయిలులేవని, అదేవిధంగా సిబ్బందికి నెలవారీ జీతాలను అందచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఒంగోలు,జూలై 2: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార,పౌరసంబంధాల,ఐటి శాఖమంత్రి పల్లె రాఘనాథరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక గుంటూరురోడ్డులోని పాటిబండ్ల గోపాలస్వామి ఫంక్షన్‌హాలులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం చంద్రన్న రంజాన్ తోఫాను అందిస్తుందన్నారు.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి

కాకినాడ, జూలై 2: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సింగిల్ డెస్క్ ప్రకారం అన్నింటికీ అనుమతులు సకాలంలో మంజూరు చేయాలన్నారు. వచ్చే వారం నాటికి లక్ష్యాలను అధిగమించాలని పరిశ్రమల డిఎంకు సూచించారు. డిఎం డేవిడ్ సుందర్‌కుమార్ మాట్లాడుతూ ఈ నెలలో 142 యూనిట్లు గ్రౌండ్ చేయగా, రూ.4,800 లక్షల పెట్టుబడితో 1543 మందికి ఉపాధి కల్పిస్తున్నటు చెప్పారు.

బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

కాకినాడ, జూలై 2: 2019 నాటికి తూర్పుగోదావరి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో ఎంపిడిఒలు, మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతీ మండలంలో నెలకు 200 వ్యక్తిగత మరుగుదొడ్లను స్వచ్ఛ్భారత్, ఉపాధి హామీ కార్యక్రమాల ద్వారా ఉద్యమ స్థాయిలో నిర్మించాలన్నారు. గత మూడు నెలల కాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో గోకవరం, యు కొత్తపల్లి, కిర్లంపూడి, మండపేట, సామర్లకోట మండలాలు పురోగతి సాధించాయన్నారు.

నిండు గోదారి నిలకడగా నీటిమట్టం

రాజమహేంద్రవరం, జూలై 2: గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం వద్ద గంట గంటకూ నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. శనివారం రాత్రి కాటన్ బ్యారేజ్ వద్ద 8.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. 1,24,255 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేశారు. బ్యారేజ్ దిగువ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో కాటన్ బ్యారేజ్ నుండి డెల్టా కాలువలకు నీటి సరఫరా బాగా తగ్గించారు.

ముద్రణాలయం భవన నిర్మాణం చేపట్టాలి

కర్నూలు సిటీ, జూలై 2:ప్రభుత్వ ముద్రణాలయానికి కొత్త భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మనోహర్ మాణిక్యం డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శనివారం కర్నూలు ముద్రణాలయ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించా రు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాత బస్టాండ్ సమీపం లో ఉన్న ముద్రణాలయంలో అన్ని జిల్లాలకు చెందిన ప్రభుత్వ శాఖల ముఖ్య పత్రాలను ముద్రించటమే కా కుండా అసెంబ్లీకి సంబంధించిన పత్రాలను కూడా ఇక్కడే ముద్రిస్తారన్నారు. అయితే ఇక్కడ స్థలం సరిపోకపోవడంతో సీతారామ నగర్‌లోని (రైల్వే స్టేషన్ వెనక) భాగాన 4 ఎకరాల స్థలా న్ని కేటాయించిందన్నారు.

Pages