S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

26న రాష్టవ్య్రాప్తంగా ఇఫ్తార్ విందు

హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న హైదరాబాద్‌లో వంద మసీదుల్లో, తెలంగాణ జిల్లాల్లో 95 నియోజకవర్గ కేంద్రాల్లో ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విందు సందర్భంగా రెండు లక్షల మంది పేద ముస్లింలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తారు. నగరంలోని నిజాం కళాశాల మైదానంలో ఆరువేల మందికి విందు ఇస్తారు.

నకిలీబాబాకు 28వరకూ రిమాండ్

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో మత్తుమందు కలిపిన పరమాన్నం ఇచ్చి 1.33 కోట్ల రూపాయలతో ఉడాయించి పోలీసులకు పట్టుబడిన నకిలీబాబా శివానందను శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. శివానందతో పాటు ఆయన అనుచరులిద్దరినీ ఈనెల 28 వరకూ రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

తెలంగాణలో పారిశ్రామిక విధానం భేష్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన విధానాలు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్నాయని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఆయన శనివారం నగర శివారులోని ఆదిభట్ల వద్ద టాటా-బోయింగ్ ఏర్‌స్పేస్ సంస్థ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రగతికి కేంద్రం అన్ని విధాలా స్నేహహస్తం అందిస్తుందన్నారు.

యుద్ధ విమాన పైలెట్లుగా ముగ్గురు యువతులు

హైదరాబాద్ : తొలిసారిగా యుద్ధ విమాన పైలెట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు యువతులు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్సు అకాడమీలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. దుండిగల్లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 130పైలెట్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గౌరవ వందనం స్వీకరించారు. భారత వాయుసైన్యంలో ఇప్పటిదాకా మహిళా పైలెట్లకు యుద్ధ విమానాలను నడిపేందుకు అనుమతి లేదు. యుద్ధ విమానాలు నడిపే బాధ్యత అప్పగించాలని ఇటీవల వైమానిక రంగంలో పనిచేస్తున్న మహిళలు రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు.

పారిశ్రామిక అనుమతులు పారదర్శకంగా..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌-ఆదిభట్లలో టాటా-బోయింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, టాటా-బోయింగ్‌ సంస్థ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

చైనాలో వరదలు.. ఆరుగురు మృతి

బీజింగ్‌: చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్‌ ప్రాంతంలో వరదల కారణంగా ఆరుగురు మృతిచెందగా ఇద్దరు గల్లంతయ్యారు. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 39,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 5,000 మంది బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

ఏరోస్పేస్‌ యూనిట్‌కు శంకుస్థాపన

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఆదిభట్లలో కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ టాటా-బోయింగ్‌ ఏరోస్పేస్‌ సంస్థ యూనిట్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల వ్యయంతో 3 నెలల్లో ఏరోస్పేస్‌ యూనిట్‌ పూర్తికానుంది.

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు శనివారం తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని, తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు.

వారం రోజుల్లో గ్రూప్స్‌ పరీక్షలకు కొత్త సిలబస్‌

విజయవాడ: వారం రోజుల్లో గ్రూప్స్‌ పరీక్షలకు కొత్త సిలబస్‌ ఖరారు చేస్తామని, రెండు నెలల్లో గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ వెలువరిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ శనివారం తెలిపారు. నిరుద్యోగులు ఓటీపీఆర్‌ నమోదు చేసుకోవాలని, ఖాళీలపై శాఖాధిపతులతో సమావేశమై రోస్టర్‌ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు.

Pages